ఎన్టీఆర్: కంకిపాడు మండలంలోని పునాదిపాడు జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పదో తరగతి పాసైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది దురుసుగా సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పాఠశాల వద్ద పడి కాపులు కాస్తున్నామని వాపోతున్నారు.