Locations: Krishna

  • వరదొస్తే.. ఆ దారి సంగతి అంతే..!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల చెరువుకు వరద వచ్చినప్పుడల్లా మద్దులమ్మ డొంక దారిపై నీరు చేరి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఈ మార్గంలో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధాన దారి నుంచి డొంక దారికి చప్టా నిర్మించాలని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా..ఫలితం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

     

  • మంత్రి కొలుసుకు పత్రిక సంపాదకుల విన్నపం

    ఏలూరు: రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి నడుపుతున్న స్థానిక, పీరియాడికల్ పత్రికల సంపాదకులందరికీ స్టేట్ అక్రిడేషన్, స్టేట్ బస్‌పాస్ ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథిని ఏపీ ఎడిటర్స్&రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడు కోరారు.
    గురువారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రికి సంపాదకుల సమస్యలను వివరించారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలను యథావిధిగా కొనసాగిస్తూ..సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.

     

  • ఆరేడున్నా లాభం లేదాయే!

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి పంచాయతీ నర్మదానగర్‌‌లో నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ఉన్నా 6-7హ్యాండ్ బోరింగ్‌లో ఒక్కటి కూడా పనిచేయడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులకు చెప్పినా..ఉపయోగం లేదని ఆరోపిస్తున్నారు. నీటి కోసం ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై జాలీ చూపించి, అధికారులు స్పందించి నీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

  • పదవులు నాకు ముఖ్యం కాదు.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    కృష్ణా: పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, వరుస సినీ విజయాలను తాను ప్రజల విజయాలుగా భావిస్తున్నానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పామర్రు మండలం నిమ్మకూరులో పర్యటించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పదవులు నాకు ముఖ్యం కాదు. వాటికే నేను అలంకారమన్నది నా భావన. తండ్రైనా, గురువైనా, దేవుడైనా నాకు అన్నీఎన్టీఆరే. హిందూపురం ఎమ్మెల్యేగా రాయలసీమను నా అడ్డాగా భావిస్తా’’ అని వ్యాఖ్యానించారు.

  • నిమ్మకూరులో బాలయ్య సందడి

    కృష్ణా: ఇటీవలే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ స్వగ్రామం నిమ్మకూరులో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్యకు గుడివాడ టీడీపీ సీనియర్ నాయకుడు పిన్నమనేని బాబ్జి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు బాలయ్య నివాళులర్పించారు. బాలయ్యతో కొద్దిసేపు బాబ్జి ముచ్చటించారు.

     

  • సొంత నిధులతో నీటి మళ్లింపు

    ఎన్టీఆర్: ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రామికనగర్(కొత్తగేటు) ఏరియాలో కొండ వాగు ఉధృతంగా ప్రవహించడంతో 50ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఈవిషయాన్ని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాస్
    మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..వారు స్పందించకపోవడంతో తానే స్వయంగా సొంత నిధులు వెచ్చించి కొండ వాగు నీటి మళ్లింపు చేపట్టారు. దీంతో స్థానికులు శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

     

     

  • కురుమద్దాలిలో 6న జాబ్ మేళా

    కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఈణెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, బి.ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35ఏళ్లలోపు యువత అర్హులన్నారు. పూర్తి వివరాకలు 8074370846, 6300618985 నంబర్లను సంప్రదించాలని కోరారు.

  • జూపూడి పేలుడు.. కీలక విషయాలు వెలుగులోకి!

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో జరిగిన పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు జరిగిన ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఇంట్లో బాణసంచా నిల్వలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 10 ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేయగా పెద్ద సంఖ్యలో నాటు బాంబులు బయటపడ్డాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

  • బస్ కిందపడి వృద్ధుడు మృతి

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట బస్టాండు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడు మరణించారు. బస్టాండులో నిలిచి ఉన్న జగ్గయ్యపేట-బోదవాడ సర్వీస్ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు కదలడంతో మెడిసిన్ తీసుకొస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వృద్ధుడు దాని కిందపడి మృతిచెందాడు. మృతుడి భీమవరానికి చెందినవాడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

  • పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి: చెన్నుబోయిన

    ఎన్టీఆర్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు సూచించారు. కొండపల్లి శివకృష్ణ థియేటర్ వద్ద డ్రెయినేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాలని, మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, మున్సిపల్ ఏఈ మోష్మీ గినియా తదితరులు పాల్గొన్నారు.