Locations: Krishna

  • కొండపల్లిలో ఆవుల బెడద

    ఎన్టీఆర్: కొండపల్లిలో ఆవుల సంచారం పెరిగిపోయింది. ప్రధాన రహదారులపై ఆవులు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, కొండపల్లి మార్గాల్లో తరచూ ఈ సమస్య వస్తోంది. రాత్రిపూట పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, నూతన పాలకవర్గం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు ఫ్రిజ్

    ఎన్టీఆర్: కొండపల్లి రైల్వే స్టేషన్ సెంటర్‌లోని కృష్ణ చేతన్ పాఠశాలకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కృష్ణ మోహన్ బృందం కూలింగ్ వాటర్ ఫ్రిజ్‌ను అందజేశారు. విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి ఈ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకి మంచి నీటి సౌకర్యం కలిగినందుకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

  • ‘చదువు దూరం చేయొద్దు’

    ఎన్టీఆర్: కొండపల్లి అడవి క్వారీ పాఠశాలను కొనసాగించాలని సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు చదువు దూరం చేయవద్దని కోరింది. ఈ ప్రాంతంలోని విద్యార్థులు చదువుకు దూరం కాకూడదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో అవసరమని, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లు చొరవ తీసుకోవాలని సీఐటీయూ నాయకులు కోరారు.

  • ‘సురేష్ మృతి పార్టీకి తీరని లోటు’

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు యానాల సురేష్ గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరామర్శించారు. అవినాష్ మాట్లాడుతూ..సురేష్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. సురేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మునేరు తువ్వ కాలువ మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని కోరారు. రైతుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.

  • ‘శరవేగంగా బుడమేరు అభివృద్ధి పనులు’

    ఎన్టీఆర్: గత ఏడాది వరదల కారణంగా జరిగిన నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన్ రావు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో బుడమేరు, పోలవరం కాలువల మరమ్మత్తులకు నిధులు కేటాయించిందన్నారు. దీని ద్వారా త్రాగునీరు, సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. బుడమేరు అభివృద్ధి పనులు శరవేగంగా  జరుగుతున్నాయన్నారు.

  • ముఖర్జీకి ఘన నివాళి

    ఎన్టీఆర్: బీజేపీ గంపలగూడెం మండల ఆధ్వర్యంలో మంగళవారం జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ గంపలగూడెం నాయకులు అన్నవరపు క్రాంతి కుమార్, గోపాలకృష్ణ, యుగంధర్, రామారావు మహిళా మోర్చా అధ్యక్షులు వనమా సత్యవాణి, నేరెళ్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

  • తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ

    ఎన్టీఆర్: విజయవాడ కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశంలో తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మిశ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో గృహాలు, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి కాలనీల ఏర్పాటు, కృష్ణా జలాలను అందించే పైప్‌లైన్ పనుల గురించి సమీక్షించారు.

  • నిత్యాన్నదాన పథకానికి విరాళం అందజేత

    కృష్ణా: మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నిత్యాన్నదాన పథకానికి తెనాలికి చెందిన మద్ధిరెడ్డి భార్గవ రెడ్డి, మనస్వి దంపతులు విరాళం అందజేశారు. వారి కుమార్తె నిహిర పేరుపై రూ.1,00,001 విలువైన చెక్కును డిప్యూటీ కమిషనర్, ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందించారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

  • జగన్‌లో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు : మండలి

    కృష్ణా: మాజీ సీఎం జగన్‌పై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విమర్శలు గుప్పించారు. జగన్‌లో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదని, ఆయన ఆత్మవిమర్శ చేసుకోరని అన్నారు. వైసీపీ కార్యకర్త సింగయ్య దుర్మరణంపై జగన్ వ్యాఖ్యలు ఆయనలోని మానవత్వ లోపానికి, బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రప్రజల స్వేచ్ఛను హరించిన జగన్‌కు ప్రజలు ఓటు హక్కుతో బుద్ధి చెప్పినా ఇంకా అదే ప్రవర్తనతో కొనసాగటం విచారకరమన్నారు.

  • ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన

    ఎన్టీఆర్: విజయవాడలో ఆర్చరీ క్రీడాకారులను శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందించారు. సింగపూర్‌లో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఆర్చరీ ఆసియా కప్ పోటీల్లో గణేష్ మణిరత్నం, షణ్ముఖి సిల్వర్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలంటూ వారిని అభినందించారు. కార్యక్రమంలో కోచ్ చిరంజీవి, వోల్గా ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.