ఎన్టీఆర్: రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య పదజాలంతో దూషించిన సుధీర్ బాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు విస్సన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంతో పాటు మాల, మాదిగ కులస్తులను కించపరుస్తూ పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. తొలుత వైసీపీ లీగల్ సెల్ నాయకులు శిరసాని ప్రకాష్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పల్లెపాము లక్ష్మయ్య, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
Locations: Krishna
-
ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నేతల నివాళులు
ఏలూరు: జన్ సంఘ్ స్థాపకులు డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నూజవీడు అసెంబ్లీ పరిధిలో బీజేపీ నాయకులు నిర్వహించారు. ఆయా బూత్‌లకు చెందిన క్రియాశీలక సభ్యులు, బూత్ అధ్యక్షులు.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖర్జీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆదర్శాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. శ్రీనివాసరావు, కృష్ణారావు, శంకరం, నాగశివ, తదితరులు పాల్గొన్నారు.
-
రూ.1054 కోట్లతో అమృత్ 2.0
కృష్ణా: అమృత్ 2.0 పనులకు అధికారులు ఈనెల 27న టెండర్లు పిలవనున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 86 పనులకు సంబంధించి రూ.1,054 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. తాడేపల్లిలోని ఈఎన్‌సీ కార్యాలయంలో నిర్వహించిన ఐదు సర్కిళ్ల ప్రజారోగ్య విభాగ ఎస్ఈల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. బిడ్‌డౌన్ లోడింగ్ ప్రక్రియ 27న మొదలు కానుండగా.. నెల రోజులపాటు దాఖలు చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
-
భవానీ ద్వీపానికి కొత్త కళ
AP : విజయవాడ సమీపంలోని భవానీ ద్వీపానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు పర్యాటక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ద్వీపంలో ఏర్పాటు చేసిన బొమ్మలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. సెల్ఫీ కేంద్రాలను పునరుద్ధరించారు. సందర్శకులు తిరిగేందుకు వీలుగా సైకిళ్లకు మరమ్మతులు చేశారు. త్వరలో ద్వీపం ఒడ్డు, ఐకానిక్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.
-
మైలవరం పిల్లల హత్య కేసు.. వీడిన మిస్టరీ
ఎన్టీఆర్: మైలవరంలో ఇద్దరు పిల్లల హత్య కేసులో మిస్టరీ వీడింది. భార్యపై అనుమానంతో భర్తే పిల్లలపై పగ పెంచుకుని ఈదారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు వేముల రవిశంకర్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. భార్య చంద్రికపై అనుమానంతో పిల్లలు లక్ష్మిహిరణ్య(10), సాయి లీలానృసింహ(8)ను ఈనెల 8న చంపేసి పరారయ్యాడు. అయితే డబ్బుకోసం జి.కొండూరులో ఓ వ్యక్తికి ఫోన్ చేయడంతో నిందితుడి ఆచూకీ దొరికింది.
-
వినియోగదారుల కమిషన్ భవనం ప్రారంభం నేడు
కృష్ణా: మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మచిలీపట్నంలో పర్యటించనున్నారు. వినియోగదారుల కమిషన్ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు నూతన భవనాన్ని ప్రారంభింనున్నారు. నాదెండ్లతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు వినియోగదారుల కమిషన్ జిల్లా అధ్యక్షులు నందిపాటి పద్మారెడ్డి తెలిపారు.
-
రేపు మచిలీపట్నానికి మంత్రి లోకేశ్
కృష్ణా: మంత్రి నారా లోకేశ్ ఈనెల 25న మచిలీపట్నంలో పర్యటించనున్నారు. కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర నాయకులు గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నగరానికి వచ్చే అవకాశం ఉందని.. కార్యకర్తలను కలిసి, మధ్యాహ్నం విశ్వవిద్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తారన్నారు. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.
-
దుర్గమ్మ హుండీ ఆదాయం ఎంతంటే..?
ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల హుండీ కానులను సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించింది. దేవస్థానం ఈవో శీనానాయక్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు లెక్కింపును పర్యవేక్షించారు.
-
భవానీద్వీపానికి నూతన కళ
ఎన్టీఆర్: వరద కారణంగా దెబ్బతిన్న, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడలోని భవానీద్వీపానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పర్యాటకశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ద్వీపంలో పేరుకున్న ఇసుక మేటలు తొలగించే పనులను చేస్తున్నారు. ద్వీపంలో ఏర్పాటు చేసిన బొమ్మలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. సెల్ఫీ కేంద్రాలను పునరుద్ధరించారు. త్వరలో ద్వీపం ఒడ్డు, ఐకానిక్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.
-
ఆలయ కమిటీల నియామకానికి నోటిఫికేషన్
AP : రాష్ట్రంలోని 1,015 ఆలయాలకు కమిటీలు నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని, త్వరలోనే నియమకాలు పూర్తి చేస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ అమలుపై మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు.