కృష్ణా: ఉత్తర చిరువోలులంక-చల్లపల్లి మధ్య బస్సు సర్వీసు తిరిగి ప్రారంభమైంది. అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చొరవతో 18 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. విద్యార్థుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ సమస్యను పరిష్కరించారు. దీంతో ఉదయం 7:30 గంటలకు, సాయంత్రం 5:30 గంటలకు బస్సు సర్వీస్‌ను RTC అధికారులు పునరుద్దరణ చేశారు.
Locations: Krishna
-
హేమంత్‌కు జాతీయ పురస్కారం
కృష్ణా: చల్లపల్లికి చెందిన వేముల హేమంత్ న్యూఢిల్లీలో జరిగిన 12వ నేషనల్ స్టూడెంట్స్ కాన్వకేషన్‌లో పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. విజయవాడ గురుకుల్ విద్యాసంస్థలో సీఏ, సీఎంఏ చదివిన హేమంత్, 2024 సీఎంఏలో జాతీయస్థాయిలో 36వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఐసీఎంఏఐ అధ్యక్షుడు బిభూతి భూషణ్ నాయక్ సమక్షంలో హేమంత్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
-
తాడిగడప నూతన కమిషనర్‌గా షేక్ నజీర్ ఛార్జ్
కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా షేక్ నజీర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఆయన, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని నజీర్ పేర్కొన్నారు.
-
విజయవాడ రైల్వే స్టేషన్‌లో మొరాయిస్తున్న లిఫ్టులు
ఎన్టీఆర్: విజయవాడ రైల్వే స్టేషన్లో లిఫ్టులు తరచూ పనిచేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం అందుకుంటున్న ఈ రద్దీ స్టేషన్ లో లిఫ్టులను సరిగా నిర్వహించకపోవడం బాధాకరమంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘వడ్డీ లేకుండా పన్నులు చెల్లించండి’
కృష్ణా: గుడివాడ పురపాలక సంఘానికి చెల్లించాల్సిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, కుళాయి పన్నులను వడ్డీ లేకుండా వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ సోమవారం కోరారు. పురపాలక సంఘ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలన్నారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో కూడా గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలోని కౌంటర్ నందు పనులు చెల్లించవచ్చని తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నివాళి
కృష్ణా: చల్లపల్లి సూర్య రిపోర్టర్ పెనుమూడి శ్రీనివాసరావు మాతృమూర్తి పెనుమూడి వెంకటేశ్వరమ్మ(70) సోమవారం ఉదయం కన్నుమూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాగోలులోని ఆమె స్వగృహానికి వెళ్లి వెంకటేశ్వరమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. శ్రీనివాసరావును పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.
-
ఈ అంగన్వాడీ కేంద్రం ఎప్పుడు పూర్తవుతుందో?
ఎన్టీఆర్: మైలవరం పరిధిలోని దేవుడు చెరువు శివారులో ఉన్న అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరిందని స్థానికులు తెలిపారు. నంబర్ 4 సచివాలయ పరిధిలో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ నిధులతో స్లాబ్ మట్టానికి వచ్చినా పూర్తవ్వలేదని ఆరోపించారు. పిల్లలను వేల రూపాయల అద్దెలు కట్టి చదివిస్తున్నారని, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు విమర్శించారు.
-
చల్లపల్లి.. స్వచ్ఛతకు ఆదర్శం: తహశీల్దార్
కృష్ణా:
చల్లపల్లి గ్రామం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అని తహశీల్దార్ డి.వనజాక్షి అన్నారు. సోమవారం చల్లపల్లిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాద్ ఆహ్వానం మేరకు.. వనజాక్షి, ఎంపీడీఓ డాక్టర్ ఎ.వి.రమణ జాతీయ రహదారి-216కు ఇరువైపులా మొక్కలు నాటారు. హైవేపై “స్వచ్ఛ సుందర చల్లపల్లి” బోర్డును ఏర్పాటు చేశారు.
-
మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం భరోసా: మంత్రి
ఎన్టీఆర్: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫారుక్ స్పష్టం చేశారు. సోమవారం సూఫీ మత గురువు, ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా మంత్రిని కలిసి మైనార్టీల సంక్షేమం, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు కోరారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
-
మారెమ్మ దేవాలయానికి విరాళం
ఎన్టీఆర్: పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని మారెమ్మ దేవాలయానికి భారత్ బంక్ యజమాని రాజశేఖర్ టీవీతో పాటు రూ.10,116 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సహాయాన్ని సోమవారం బంక్ కార్యాలయంలో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ ప్రధాన కార్యదర్శి రావి మణిరాజ్ (ఫణి), 21వ వార్డు ప్రముఖులు జెల్లీ కాంతారావులు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన రాజశేఖర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.