కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ పెనుమూడి శ్రీనివాసరావు మాతృమూర్తి పెనుమూడి వెంకటేశ్వరమ్మ సోమవారం మరణించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి, శ్రీనివాసరావును పరామర్శించారు. టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, మేకా వెంకటేశ్వరరావు, మల్లంపల్లి శివరామకృష్ణ సహా పలువురు టీడీపీ నాయకులు, గ్రామ ప్రముఖులు నివాళులర్పించారు.
Locations: Krishna
-
ముఖర్జీ బలిదాన్ దివస్ సంస్మరణ సభ
ఎన్టీఆర్: నేడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఎ.కొండూరు మండలంలో గుడిపూడి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంతాప సభ జరిగింది. భారతీయ జనసంఘ్ స్థాపకుడు, “ఒకే రాజ్యం, ఒకే చట్టం” నినాదంతో దేశ ఐక్యత కోసం పోరాడిన ముఖర్జీ త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు.
-
ఎమ్మెల్యే కొలికపూడికి వినతి
ఎన్టీఆర్ జిల్లా: విసన్నపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆత్మీయంగా స్వాగతం పలికారు. సూపర్ బజార్ శ్రీనును ఆయన నివాసంలో కలిసి, స్థానిక సమస్యలపై చర్చించారు. శ్రీను ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
-
దేవినేనిపై తప్పుడు ప్రచారం.. ఎస్సైకి ఫిర్యాదు
కృష్ణా: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారంటూ వస్తున్న తప్పుడు వార్తలపై బుడ్డి సూర్యప్రకాష్ కంచికచర్ల ఎస్సై బోనగిరి రాజుకి ఫిర్యాదు చేశారు. దేవినేని కుటుంబం టీడీపీకి వీర విధేయులని, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేశారని సూర్యప్రకాష్ తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
-
రోడ్డు నిర్మాణానికి MLAకి వినతి
ఎన్టీఆర్: విస్సన్నపేట ఏడో వార్డు టీడీపీ సభ్యులు అనుమోలు శివబాజీ పాత పోలీస్ స్టేషన్ నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు బీటీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని శివబాజీ తెలిపారు. ఈకార్యక్రమంలో ఈవో హరికృష్ణ కుమార్, టీడీపీ నేతలు బద్రీనాథ్, లోకేశ్వరరావు, ప్రభాకర్, ప్రసాద్, నారాయణ, ముస్లింమైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
-
కంకిపాడులో డ్రోన్‌తో నిఘా
కృష్ణా: కంకిపాడు పోలీసులు మద్దూరు గ్రామంలోని కరకట్ట ప్రాంతంలో కోడిపందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ నిఘాను ముమ్మరం చేశారు. కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ రావు ఆదేశాల మేరకు, గన్నవరం డీఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, కంకిపాడు ఇన్‌స్పెక్టర్ జె.మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, అదనపు ఎస్ఐ తాతాచార్యులు డ్రోన్ ద్వారా ఈ ప్రాంతాలను పరిశీలించారు.
-
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు
కృష్ణా: మచిలీపట్నంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి జరిగింది. పంతం వెంకటగజేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంకోసం ఆయన చేసిన త్యాగాలను గజేంద్రరావు గుర్తు చేశారు. కాశ్మీర్ విలీనం కోసం ముఖర్జీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. మోదీ ప్రభుత్వం 370 అధికరణను రద్దుచేసి ఆయనకు ఘన నివాళి అర్పించిందని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
-
విద్యాదాతల సహకారం అభినందనీయం: MEO
ఎన్టీఆర్: మైలవరంలో విద్యాదాతల సహకారం అభినందనీయమని ఎంఈఓ బాలు అన్నారు. పేద విద్యార్థులకు అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో పాటు దాతల సహాయం మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. తారకరామానగర్ పాఠశాలలో జూలూరు రాము విద్యార్థులకు పుస్తకాలు అందించారు. ఆర్థిక అసమానతలు తొలగించడానికి చదువు ఎంతో అవసరమని ఎంఈఓ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
సాఫ్ట్‌బాల్‌కు ప్రోత్సాహం.. కొడాలి నాని విరాళం
కృష్ణాజిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు, కొడాలి కోటేశ్వరరావు(నాని) తన సోదరులు కొడాలి కిషోర్, కొడాలి నాగమల్లి జ్ఞాపకార్థం రూ.20,000 విలువైన సాఫ్ట్‌బాల్ స్లగ్గర్లు, గ్లౌజులు, బంతులను విరాళంగా అందించారు. ఈసామాగ్రిని దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు చేతులమీదుగా కృష్ణాజిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గరికపాటి మారుతికి అందజేశారు. మారుతి దాతలకు, పాల్గొన్న పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
-
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైకు.. స్పాట్ డెడ్
ఎన్టీఆర్: మైలవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చండ్రగూడెం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో దాసుడుపాలెంకు చెందిన రాకేష్ అనే వ్యక్తి బైకుతో ఆగి ఉన్న లారీని ఢీకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.