Locations: Krishna

  • మృతుడి కుటుంబానికి MLA మండలి పరామర్శ

    శ్రీకాకుళం: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ఇటీవల కృష్ణానదిలో ప్రమాదవశాత్తు పడి మరణించిన ఆత్కూరి ఫణికుమార్ కుటుంబాన్ని సోమవారం అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అకాల మరణం చెందిన ఫణికుమార్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించిన ఆయన, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన

    కృష్ణా: ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి మాట్లాడుతూ..’తల్లికి వందనం’ పథకం తమకు వర్తింపజేయాలని, నెలకు రూ.27వేల వేతనం ఇవ్వాలని  ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

  • అనుమానమే పెను భూతమై.. చిన్నారులను కడతేర్చిన తండ్రి

    ఎన్టీఆర్: మైలవరంలో ఇద్దరు చిన్నారుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు రవిశంకర్‌ను అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతో పిల్లలు తనకి పుట్టలేదని రవిశంకర్ వారిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రవిశంకర్ మొదట కుమారుడిని ఉరివేసి, ఆ తరువాత కుమార్తెను దిండుతో అదిమి చంపేశాడు. ఆపై, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి పారిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

  • అసాంఘిక ప్రదేశాలపై డ్రోన్‌తో నిఘా

    కృష్ణా: కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దూరులోని కరకట్ట ప్రాంతాలలో కోడిపందాలు, పేకాట నిర్వహించడానికి అవకాశం ఉన్న ప్రదేశాలపై పోలీసులు డ్రోన్ కెమెరాతో సోమవారం నిఘా పెట్టారు. గన్నవరం డీఎస్పి శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో కంకిపాడు ఇన్స్పెక్టర్ మురళికృష్ణ, కంకిపాడు ఎస్ఐలు సందీప్, తాతచార్యులు కరకట్ట వద్ద డ్రోన్ ద్వారా అసాంఘిక ప్రదేశాలను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • కూటమిలో ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్: అవినాష్

    ఎన్టీఆర్: కూటమి హయంలో ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమానికి అవినాష్ మద్దతు తెలుపుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను మభ్యపెట్టారన్నారు. లోకేష్ నిరుద్యోగ భృతి గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

     

  • చంద్రబాబు పరిస్థితి అది: పేర్నీ కిట్టు

    కృష్ణా: కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మచిలీపట్నం వైసీపీ ఇన్‌ఛార్జ్ పేర్ని కిట్టు విమర్శించారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైసీపీ ‘యువత పోరు’ నిర్వహించింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు ధర్నా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మోదీని అప్పు కూడా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని కిట్టు ఎద్దేవా చేశారు.

  • BJP పట్ల అందుకే ఆకర్షితుడినయ్యా!

    కృష్ణా: గుడివాడలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. ‘ముఖర్జీ ఆశయాలతో మాలాంటివారు రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి మహనీయుల సిద్ధాంతాలతో నేను బీజేపీ పట్ల ఆకర్షితుడయ్యాను’ అని అన్నారు.

  • మరోసారి PSR‌కు నిరాశ.. బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

    AP: APPSC‌లో జరిగిన అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోసం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న IPSఅధికారి PSRఆంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో దిగువ కోర్టు PSR‌కు బెయిలిచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.

  • దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఆలయ అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వినయ్‌చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

  • మట్టి దోపిడీ జోరుగా.. అడ్డుకునే నాథుడెక్కడ?

    కృష్ణా: నందివాడ మండలం లక్ష్మీనరసింహాపురంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి బుడమేరు కరకట్టను తవ్వేస్తూ అక్రమంగా మట్టిని ఆక్వా చెరువులకు తరలిస్తున్నారు. కూటమినేతల కనుసనల్లో జరుగుతున్న మట్టి దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసినా..అటువైపు కన్నెత్తి చూడట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం బుడమేరు ఆధునీకరణకు నిధులు వెచ్చిస్తున్నా, కొందరు స్వార్థపరులు లక్ష్యానికి విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.