Locations: Krishna

  • నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ

    ఎన్టీఆర్: నేరాల నియంత్రణకు పోలీసులు ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు సత్ఫలితాలిస్తున్నాయి. నేరాలు అదుపులోకి రావడంతో పాటు నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నేరాలు ఎక్కడ జరిగినా ఇట్టే దొంగలను పట్టించేస్తున్నాయి. పట్టణంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 316సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు సీఐ ఎ.చంద్రశేఖర్ తెలిపారు.

  • మచిలీపట్నంలో మంత్రి లోకేశ్!

    కృష్ణా: ఈనెల 25వ తేదీన మంత్రి లోకేశ్ మచిలీపట్నంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఉదయం నియోజకవర్గ టీడీపీ నాయకులతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3గంటలకు కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ వర్గాలు చేస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.

  • విస్సన్నపేటలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం

    ఎన్టీఆర్: విస్సన్నపేటలో జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 52వ వర్ధంతిని బీజేపీ మండల అధ్యక్షులు గంగిశెట్టి మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ కన్వినర్ పెనుగొండ రామచంద్రరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖర్జీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

  • ‘కొలికపూడి శ్రీనివాసరావు అనే నేను..’@ ఏడాది!

    ఎన్టీఆర్: ఇరవై ఏళ్ల తరువాత తిరువూరు గడ్డ మీద టీడీపీ జెండా ఎగరింది. నియోజకవర్గ ఎమ్మెల్యే‌గా కొలికపూడి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆదరణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు.

     

  • ముగిసిన జర్నలిస్ట్‌ కృష్ణంరాజు కస్టడీ

    AP: రాజధాని అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన జర్నలిస్ట్ కృష్ణంరాజు కస్టడీ ముగిసింది. శుక్రవారం కస్టడీకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు మూడురోజులపాటు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో మంగళగిరి ఆస్పత్రిలో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం కృష్ణంరాజును గుంటూరులోని జిల్లా జైలుకు తరలించనున్నారు.

  • రేపు వాహనాల వేలం పాట

    ఎన్టీఆర్: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేసిన 19 వాహనాలను ఈనెల 24వ తేదీన తిరువూరులో వేలం పాట వేయనున్నారు. వేలంపాటలో పాల్గొనాలనుకున్న వారికి GST నంబర్ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 10:30గంటలకు తిరువూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్నారు. రూ.వెయ్యి దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

  • MLA కొలికపూడి నేటి షెడ్యూల్

    ఎన్టీఆర్: తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేటి షెడ్యూల్‌నుఆక్ష్న కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. ఉదయం 11:30గంటలకు విసన్నపేటలో అవిన్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 12గంటలకు AMC వైస్‌ఛైర్మన్ కుక్కడపు నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. సాయంత్రం 5గంటలకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి సెక్రటేరియట్ దగ్గర ఏర్పాటు చేసిన సుపరిపాలన-తొలి అడుగు వేడుకకు హాజరవుతారన్నారు.

  • కేంద్రీయ విద్యాలయంలో ఖాళీలు.. అప్లై చేయండి!

    కృష్ణా: మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయంలో 8, 11 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆసిఫ్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

     

  • దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష నేడు!

    ఎన్టీఆర్: ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గగుడి మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశం నేడు మహామండపం ఏడో అంతస్తులో జరుగనుంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశానికి హాజరయ్యే అవకాశమున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి పనులు, అన్నదాన భవనం, ప్రసాదపోటు సిద్ధం కోసం ప్రణాళికలు రూపొందుతున్నట్లు పేర్కొన్నారు. దుకాణాల తరలింపు అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

  • కలెక్టరేట్‌లో నేడు PGRS

    ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. సమస్యల పరిష్కరాలనికై తప్పక కృషి చేస్తామన్నారు. జిల్లా అధికారులు కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.