Locations: Krishna

  • సమస్యల పరిష్కారానికై.. నేడే PGRS

    కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకె బాలాజీ తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. సమస్యల పరిష్కరాలనికై తప్పక కృషి చేస్తామన్నారు. జిల్లా అధికారులు కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

  • నేరాల నియంత్రణకు పకడ్బందీగా గస్తీ

    కృష్ణా: జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశాలతో రాత్రి వేళ పకడ్బందీగా గస్తీ విధులు నిర్వహించారు. అందులో భాగంగా నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ నిరంతరం బీట్ పాయింట్స్ తనిఖీ చేపట్టారు. ఏటీఎంలు,వ్యాపార సముదాయాల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పకడ్బందీగా గస్తీవిధులు నిర్వర్తించాలని సూచించారు. నిద్రమత్తులో రోడ్డుప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు ఫేస్‌వాష్ చేయించి వాష్ అండ్ గో నిర్వహించారు.

  • రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్.. అలా చేస్తే.. చర్యలే!

    కృష్ణా: జిల్లా ఎస్పీ గంగాధర రావు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తూ చెడు నడత కలిగిన రౌడీ, డీసీ, కేడీ, సస్పెక్ట్ షీట్ హోల్డర్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఏదైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరించారు.

  • ఘనంగా దేవినేని రాజశేఖర్ అభిమాన సభ

    ఎన్టీఆర్: మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) 71వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నందలి చిట్టినగర్‌లో గల నగరాల కల్యాణమండపంలో అభిమాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ కుమారుడు, జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • టెక్నాలజీతో హత్య కేసును ఛేదించిన పోలీసులు

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో ఆదివారం తెల్లవారుజామున వెంకయ్య హత్య కేసులో నిందితుడు అల్లూరి కృష్ణ(50)ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిస్టియన్‌పేటకు చెందిన అభిమల్ల మణి ఫిర్యాదు మేరకు, సీసీ కెమెరాల సాయంతో గంటల వ్యవధిలో నిందితుడిని గుర్తించారు. శనివారం రాత్రి మద్యం తాగిన గొడవలో కృష్ణ,వెంకయ్యను అంబేద్కర్ విగ్రహం వద్ద రాయితో కొట్టి చంపినట్లు తెలిపారు. టెక్నాలజీతో అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

  • రేణుకమ్మ తల్లి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే

    కృష్ణా: పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం తరకటూరుపాలెంలో శ్రీ రేణుకమ్మ తల్లి అమ్మవారి సంబరాలు ఘనంగా జరిగాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

  • పెడనలో అధ్వాన్నంగా పారిశుధ్యం

    కృష్ణా: పెడన పట్టణంలోని 16వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండి దుర్వాసన వస్తున్నాయి. సిబ్బంది కొరతతో పనులు సక్రమంగా జరగడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

    కృష్ణా: ఈనెల 23న మచిలీపట్నం కలెక్టరేట్‌లో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం” కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. పాలనను చేరువ చేసేందుకు ఈ వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు వికేంద్రీకరించారు. అర్జీదారులు సమీప మండల లేదా మున్సిపల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

  • ఏఎంసీ వైస్ ఛైర్మన్ కుటుంబానికి పరామర్శ

    ఎన్టీఆర్: తిరువూరు ఏఎంసీ వైస్ ఛైర్మన్ కుక్కడపు వెంకట నాగేశ్వరరావు మాతృమూర్తి సుశీలమ్మ కన్నుమూశారు. ఆమె మృతికి పలువురు సంతాపం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మురుగుల ప్రసరావు, లోకేష్ రావు, వేమన తదితరులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • యువతా కదలిరండి..!

    ఎన్టీఆర్: విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు యువజన విభాగ నాయకులతో కలిసి జూన్ 23న ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న “యువత పోరు” పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిరుద్యోగుల పక్షాన నిలిచి చంద్రబాబు సర్కార్‌పై నిరసన తెలపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రానికి యువత కదలి రావాలని పిలుపునిచ్చారు.  ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు.