Locations: Krishna

  • దేవినేని నెహ్రూకు అవినాష్ నివాళులు

    ఎన్టీఆర్: మాజీమంత్రి దేవినేని నెహ్రూ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. నేడు దేవినేని నెహ్రూ  జయంతి సందర్భంగా విజయవాడ నెహ్రూ ఘాట్, ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి అవినాష్ నివాళులర్పించారు. నెహ్రూకి NTR రాజకీయ జన్మ ఇస్తే.. YSR పునర్జన్మ ఇచ్చారన్నారు.

  • ‘రాజకీయాల్లో నెహ్రూ లాంటి నేతలు అరుదు’

    ఎన్టీఆర్: నేడు దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ఘాట్, ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ శ్రేణులు నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో నెహ్రూ లాంటి నేతలు అరుదుగా ఉంటారన్నారు. నెహ్రూ న్యాయం కోసమే రాజకీయాలు చేసే వ్యక్తి అన్నారు.

  • నల్లమట్టితో నానా తంటాలు.. రైతుల ఆరోపణలు

    ఎన్టీఆర్: జిల్లా కొండూరు మండలం కౌలూరులో బుడమేరు గండ్ల పూడిక పనుల్లో అవినీతి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పూడికకు గ్రావెల్ వాడాల్సిందిపోయి కవులూరు చెరువు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తెచ్చిన నల్లమట్టితో పూడ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.10కోట్ల నామినేటి పనుల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని రైతులు వెల్లడించారు.

  • పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్.. కలెక్టర్ ఉత్తర్వులు

    కృష్ణా: కోడూరు పంచాయతీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి బి.శేషగిరిరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, పీజీఆర్ఎస్‌లో శేషగిరిరావుపై గ్రామానికి చెందిన భాస్కరరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఈఓపీఆర్డీ రేవతి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగాలో రూ.34.62లక్షల నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారించారు.

  • తిరువూరు AMC వైస్ ఛైర్మన్‌కి మాతృ వియోగం.. MLA నివాళి

    ఎన్టీఆర్: తిరువూరు AMC వైస్ ఛైర్మన్ కుక్కడపు నాగేశ్వరరావు మాతృమూర్తి సుశీల ఆదివారం ఉదయం ఆనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగఢ సానుభూతి తెలియజేశారు.

  • కెనెరా బ్యాంక్ దగ్ధం.. ఎమ్మెల్యే స్పందన

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని కోదాడ రోడ్డులో కెనరా బ్యాంక్ దగ్ధమైన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బందితో మాట్లాడి, దగ్ధానికి కారణాలు, జరిగిన నష్టంపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు వివరించగా, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సంబంధిత శాఖలకు ఎమ్మెల్యే సూచించారు.

  • సైబర్ వలలో వివాహిత.. రూ.27లక్షలు స్వాహా!

    కృష్ణా: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓవివాహిత రూ.27లక్షలు పోగొట్టుకున్న ఘటనపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సీఐ వెంకటరమణ తెలిపారు. మండలంలోని పోరంకి సీతాపురం కాలనీకి చెందిన ఆర్.సుధారిణికి ఈనెల 12వ తేదీన బెంగళూరు పోలీసులమంటూ కాల్స్ చేశారు. డబ్బులిస్తే అరెస్ట్ చేయమని నమ్మించారు. నమ్మిన సుధారాణి పలు దఫాలుగా ఆన్‌లైన్‌లో రూ.27లక్షలు బదిలీ చేసింది. మోసాన్ని గుర్తించిన సుధారాణి ఫిర్యాదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

  • మోపిదేవిలో 24న సర్వసభ్య సమావేశం

    కృష్ణా: మోపిదేవిలో ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ స్వర్ణభారతి తెలిపారు. ఎంపీపీ రావి దుర్గావాణి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.

  • కెనరా బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. పూర్థిగా దగ్ధం

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని కెనరా బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బ్యాంక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • నేడు SGECలో స్నాతకోత్సవం

    కృష్ణా: గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ 24వ స్నాతకోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డా.నూతులపాటి వెంకటరమణ రానున్నారని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ బి.కరుణకుమార్ తెలిపారు.