Locations: Krishna

  • ఆదర్శ గ్రామాలుగా ఎంపికయ్యేందుకు కృషి: కలెక్టర్

    కృష్ణా జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమం కింద 54 గ్రామాలను గుర్తించినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం, మరుగుదొడ్లు, అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర బృందం పర్యటించి వాటికి రేటింగ్ ఇస్తుందన్నారు. మంచి ర్యాంకు సాధించేందుకు లోటుపాట్లు సరిచేయాలని అధికారులకు సూచించారు.

     

  • జగ్గయ్యపేటలో దారుణం.. కార్మికుడిని రాళ్లతో కొట్టి హత్య

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని నడిబొడ్డున వెంకయ్య అనే కార్మికుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపినట్టు దారుణంగా హత్య చేశారు. వెంకయ్య పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

     

  • పవన్‌కళ్యాణ్ కృషితో ఏఐఐబీ రోడ్లకు మోక్షం: MLA

    కృష్ణా: టీడీపీ ప్రభుత్వంలో ఏఐఐబీ ద్వారా మంజూరు చేసిన రోడ్లను వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా నిలిపివేస్తే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తిరిగి మంజూరు చేశారని అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చొరవతో రూ.26.41 కోట్లతో ఏఐఐబీ రోడ్లు పునఃప్రారంభమైనట్లు తెలిపారు.

  • ‘ప్రాణం ఉన్నంతవరకు ప్రాణాయామం చేద్దాం’

    కృష్ణా: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎండీ రఫీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయుష్ ఉన్నంతవరకు ఆసనాలు వేద్దాం-ప్రాణం ఉన్నంతవరకు ప్రాణాయామం చేద్దాం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాకీ హరీష్, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

  • ‘ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దాలి’

    కృష్ణా: విద్యార్థులు యోగా సాధన చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దాలని శ్రీవిజయ అకాడమీ కరస్పాండెంట్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అన్నారు. శనివారం చల్లపల్లిలోని శ్రీవిజయ అకాడమీలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఈటీ అర్జున్ రావు పర్యవేక్షణలో విద్యార్థులు యోగా సాధన చేశారు. కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే యోగా నేర్చుకోవాలని సూచించారు.

     

  • ‘యోగా అంటే ఆసనాలే కాదు’

    కృష్ణా: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పెడన మండలంలోని నందమూరు గ్రామంలోని వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆవరణలో ఉత్సాహంగా యోగా డేను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు, సచివాలయసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు యోగాసనాలు వేశారు. వారు మాట్లాడుతూ.. యోగా అంటే మనస్సు, శరీరం, ఆత్మను ఏకం చేయడమన్నారు.

  • నూతన వంటశాల, భోజనశాల గదుల ప్రారంభం

    కృష్ణా: గూడూరు మండల పోలవరం గ్రామంలో కారుపర్తి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారులు నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూల్ ఆవరణలో వంటశాల, భోజనశాల గదులు ఘనంగా ప్రారంభమైయ్యాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాసాగాని శ్రీనివాసరావు, గూడూరు మాజీ సర్పంచ్ అన్నం హరీ రామకృష్ణ, సర్పంచ్ నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్,  కూటమి నాయకులు, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • వాహ్వా.. నదిలో యోగాసనాలు.. నీటిపై తేలిపోతూ..

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోచ్ దంపతులు పొట్టాబత్తిన పాండురంగారావు, లక్ష్మి నేతృత్వంలో శివారు పాలేరు నదిలో జల యోగాసనాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. యోగా శిక్షకులు సిద్దేపల్లి ఆదిలక్ష్మి నీటిలో అమృతాసనం, పద్మాసనం నిర్వహించారు. మహిళలు 26, పురుషులు 22, బాలబాలికలు 8, మొత్తం 56 మంది ఎటువంటి ఆసరా లేకుండా నీటిలో తేలారు.

  • ముసలోడే కానీ మహానుభావుడు.. 97ఏళ్ల వయసులో కూడా..

    ఎన్టీఆర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు చుంచు సూర్య నారాయణ 97ఏళ్ల వయసులో కూడా యోగాసనాలను వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పాఠశాల విద్యార్థులతో కలసి 97సంవత్సరాలు వయసులో యోగాసనాలను వేయటం అనేది అందరికీ సాధ్యం కాదని పలువురు ఆశ్చర్యానికి గురై ఆయనను ప్రశంసించారు.

  • ‘ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలే లక్ష్యం’

    కృష్ణా: ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ రూ.3.50కోట్ల సీ.ఎస్.ఆర్ నిధులతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన అడ్వాన్సుడ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ డయాగ్నొస్టిక్ యూనిట్ జీవన్ రద్ బస్సును గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ ప్రారంభించారు.