ఎన్టీఆర్: యోగాతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందొచ్చని విస్సన్నపేట ఎంపీడీవో చిన్న రాట్నాలు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికాస్ కళాశాల ఆవరణలో శనివారం యోగాంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కోట లక్ష్మి కళ్యాణితో పాటు సుమారు 5వేల మంది పాల్గొని యోగాసనాలు వేశారు.
Locations: Krishna
-
కంచికచర్లలో ‘యోగాంధ్రా’
ఎన్టీఆర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంచికచర్ల పట్టణంలోని మార్కెటింగ్ యార్డులో శనివారం యోగాంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ లక్ష్మీ కుమారి అధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ అజయ్, జూనియర్ అసిస్టెంట్ వెలంకి రామారావు, తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.
-
‘భార్యపై అనుమానంతోనే పిల్లల్ని హత్య చేశా’
ఎన్టీఆర్: కన్న బిడ్డలైన లక్ష్మీ హిరణ్య(9), లీలాసాయి నృసింహ(7)ను హత్య చేసి.. ‘నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని లేఖ రాసి పరారైన తండ్రి రవిశంకర్ పోలీసులకు విశాఖపట్నంలో చిక్కాడు. ఈ నెల 12న మైలవరంలో జరిగిన ఈ జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. విచారణలో తన భార్యపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు రవి శంకర్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
-
ఆరోగ్య సమాజం నిర్మిద్దాం: MLA
ఎన్టీఆర్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో శనివారం యోగాంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిచారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, నెట్టెం రఘురాం, రాఘవేంద్ర హాజరయ్యారు. యోగ ద్వారా మనసుకు శాంతి, శరీరానికి ఆరోగ్యం, జీవితం స్ఫూర్తిదాయకంగా మారుతుందని వక్తలు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు యోగా సాధనను జీవనశైలిగా మార్చుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
-
యోగా ఒక అమూల్యమైన బహుమతి: మానస
ఎన్టీఆర్: ప్రాచీన భారతీయ సంప్రదాయంలో అమూల్యమైన బహుమతి యోగా అని కంచికచర్ల మండల డిప్యూటీ తహశీల్దార్ మానస తెలిపారు. శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి అత్యంత విశ్వసనీయ మార్గాలలో ఒకటిగా ఉద్భవించిందని వెల్లడించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం యోగాంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిచారు. రెవెన్యూ సిబ్బంది, మండల ప్రజలు పాల్గొని ఆసనాలు వేశారు.
-
రీసర్వేలో అభ్యంతరాలు ఉంటే చెప్పండి: MRO
కృష్ణా: పాములపాడు పరిధిలో చేసిన రీసర్వేలో అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని పెదపారుపూడి మండల తహశీల్దార్ శ్రీను నాయక్ తెలిపారు. పాములపాడు సచివాలయం వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంంలో ఆయన పలు విషయాలు వివరించారు. రీ సర్వేలో అభ్యంతరాలను 15 రోజుల్లోపు లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు.
-
లిటరసీ న్యూమరసిపై టీచర్స్‌కు శిక్షణ
కృష్ణా: ఈ నెల 23 నుంచి 28 వరకు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసి(FLN)పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్ఎస్‌సీ ఎంవో శ్యాంసుందరరావు ఓ ప్రకటనలో తెలిపారు. 1,2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొనాలని చెప్పారు. గుడివాడ ఉషోదయ పబ్లిక్ స్కూల్, కేసరపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, మచిలీపట్నంలోని హిందూ కళాశాల, అవనిగడ్డ ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
-
కంచికచర్ల ఎమ్మార్వోగా నరసింహరావు బాధ్యతలు
ఎన్టీఆర్: కంచికచర్ల మండల తహశీల్దారుగా సీహెచ్ నరసింహరావు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. కంచికచర్ల డీటీగా పనిచేస్తున్న వేమూరి మానస ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ ఎమ్మార్వోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశా ఉత్తర్వుల మేరకు గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్న నరసింహారావు కంచికచర్లకు వచ్చారు. ఈయన గతంలో కంచికచర్ల రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌గా, పీడీఎస్ డీటీగా పనిచేశారు.
-
పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన నేడే.!
ఎన్టీఆర్: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి శనివారం నుంచి వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్‌కు వెళ్లేటప్పుడు మెరిట్ కార్డు, ఆన్‌లైన్ ఫీజు రసీదు, క్యాస్ట్, ఇన్కమ్, స్టడీ సర్టిఫికేట్లు తీసుకుని వెళ్లాలని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విజయసారథి ఓ ప్రకటనలో తెలిపారు. 1- 5,000ల ర్యాంకు వరకు తమ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు.
-
గురుకులాల సీట్ల భర్తీకి డేట్ ఫిక్స్
ఎన్టీఆర్: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నట్టు సమన్వయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 6, 7, 8, 9 తరగతులకు సంబంధించి బాలికలకు కుంటముక్కల, బాలురకు కృష్ణారావు పాలెంలో పరీక్ష పెట్టనున్నట్లు చెప్పారు.