Locations: Krishna

  • సొంత నిధులతో నీటి మళ్లింపు

    ఎన్టీఆర్: ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రామికనగర్(కొత్తగేటు) ఏరియాలో కొండ వాగు ఉధృతంగా ప్రవహించడంతో 50ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఈవిషయాన్ని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాస్
    మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..వారు స్పందించకపోవడంతో తానే స్వయంగా సొంత నిధులు వెచ్చించి కొండ వాగు నీటి మళ్లింపు చేపట్టారు. దీంతో స్థానికులు శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

     

     

  • కురుమద్దాలిలో 6న జాబ్ మేళా

    కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఈణెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, బి.ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35ఏళ్లలోపు యువత అర్హులన్నారు. పూర్తి వివరాకలు 8074370846, 6300618985 నంబర్లను సంప్రదించాలని కోరారు.

  • జూపూడి పేలుడు.. కీలక విషయాలు వెలుగులోకి!

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో జరిగిన పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు జరిగిన ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఇంట్లో బాణసంచా నిల్వలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 10 ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేయగా పెద్ద సంఖ్యలో నాటు బాంబులు బయటపడ్డాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

  • బస్ కిందపడి వృద్ధుడు మృతి

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట బస్టాండు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడు మరణించారు. బస్టాండులో నిలిచి ఉన్న జగ్గయ్యపేట-బోదవాడ సర్వీస్ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు కదలడంతో మెడిసిన్ తీసుకొస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వృద్ధుడు దాని కిందపడి మృతిచెందాడు. మృతుడి భీమవరానికి చెందినవాడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

  • పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి: చెన్నుబోయిన

    ఎన్టీఆర్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు సూచించారు. కొండపల్లి శివకృష్ణ థియేటర్ వద్ద డ్రెయినేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాలని, మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, మున్సిపల్ ఏఈ మోష్మీ గినియా తదితరులు పాల్గొన్నారు.

  • ‘అన్ని వర్గాల సాంప్రదాయాలను గౌరవించాలి’

    ఎన్టీఆర్: అన్నివర్గాల సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ప్రతిఒక్క రాజకీయపార్టీపై ఉంటుందని బీజేపీ నందిగామ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాదాల రమేష్ అన్నారు. ఇటీవల గాంధీ‌సెంటర్‌లో దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు చేసిన కార్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వినాయకచవితి వేడుకలు జరుగుతున్న సమయంలో వినాయక మండపం పక్కనే  వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మాంసాహారంతో అన్నదానం చేయటం హేయమైన చర్య అన్నారు.

  • శ్రీ శేష గణపతిగా భక్తులకు దర్శనం

    కృష్ణా: గుడివాడ మెయిన్ రోడ్డులోని ప్రసిద్ధిగాంచిన శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయని కమిటీ ఛైర్మన్ సాయన రాజేష్, ఈఓ యార్లగడ్డ వాసు తెలియజేశారు. గురువారం శ్రీశేషగణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈనెల 6వ తేదీన ఉత్సవ లడ్డూల బహిరంగ వేలం పాట జరుగుతుందని ఛైర్మన్, ఈఓలు తెలిపారు.

     

  • భారీ ధర పలికిన గణపతి లడ్డు

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల సొసైటీ ఆవరణలో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక లడ్డు వేలంపాట కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రూ.35,116లకు స్వామివారి 9 కేజీల లడ్డు, 4తులాల వెండి అదే గ్రామానికి చెందిన బండ్లమూడి లక్ష్మీనారాయణ కైవసం చేసుకున్నారు.

  • జూపూడిలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం, ఇద్దరికీ గాయాలు

    ఎన్టీఆర్: జూపూడిలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బ్లాస్టింగ్ సమయంలో ఇంట్లో వెల్డింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. చుట్టుపక్కల ఇళ్లు పాక్షికంగా విరిగిపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108 ఆంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు.

  • గరిసిపూడిలో పౌష్టికాహార వారోత్సవాలు

    కృష్ణా: బంటుమిల్లి ప్రాజెక్టు పరిధిలో కృత్తివెన్ను మండలం గరిసిపూడి పంచాయతీ లోపెద చందాల అంగన్వాడీ సెంటర్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని సముద్ర వేణి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామంలోని తల్లులు, హెల్త్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే హెచ్‌వీ ఏఎన్ఎం, ఆశాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.