Locations: Krishna

  • గూడూరు వ్యవసాయ అధికారిగా శివరామకృష్ణ

    కృష్ణా: గూడూరు మండల వ్యవసాయ అధికారిగా శివరామకృష్ణ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో బంటుమిల్లి మండల వ్యవసాయ అధికారిగా పని చేసిన ఆయన బదిలీపై గూడూరుకు వచ్చారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ  మాట్లాడుతూ.. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. వ్యవసాయ పంటలపై పలు సూచనలు సలహాలు ఇస్తానని వెల్లడించారు. తమ సేవలను రైతులు వినియోగించుకోవాలని కోరారు.

  • రేపు మచిలీపట్నంలో కరెంట్ కట్

    కృష్ణా: మచిలీపట్నంలో విద్యుత్ లైన్లకు శనివారం మరమ్మతులు చేపట్టనున్నట్లు ఎపీసీపీడీసీఎల్ ఎక్జిక్యూటివ్ గోవిందరావు తెలిపారు. ఈ మేరకు బందరు మండలం చిన్నాపురం, వాడపాలెం సబ్ స్టేషన్ పరిధి ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు కరెంటు ఉందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

  • ‘యోగా డే’లో పాల్గొనండి: ఎంపీడీవో

    కృష్ణా: పెడన మండలం పెనుమల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.  ఉదయం 7:00 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎంపీడీవో అరుణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

  • యోగా డే విజయవంతం చేయాలి: రమాదేవి

    ఎన్టీఆర్: జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని జనసేన పార్టీ నందిగామ ఇన్‌ఛార్జ్ తంబళ్ళపల్లి రమాదేవి తెలిపారు. శనివారం ఉదయం 6:30 గంటలకు నందిగామ మున్సిపాలిటీ పరిధిలోని ZPH స్కూల్ ఆవరణలో యోగా డే నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరవుతారని చెప్పారు. జనసైనికులు, వీర మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

  • ఉత్తమ సేవలకు సత్కారం

    కృష్ణా: గూడూరు తహశీల్దారు కార్యాలయంలో ఎమ్మార్వో రాజ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా గూడూరు డీసీ ఛైర్మన్ పోతనస్వామి హాజరయ్యారు. రెవెన్యూ వ్యవస్థ స్థాపన, ఇప్పటి వరకు జరిగిన సంస్కరణలకను స్వామి ప్రస్తావించారు. మండల పరిధిలో ఉత్తమ సేవలు కనబరించిన వీఆర్వో అంకాలు, దఫిధార్ శ్రీనివాసరావు, వీఆర్ఏ వెంకటేశ్వరరావుకు ప్రసంశ పత్రాలు, మెమంటోలు అందచేసి సత్కరించారు.

  • జగన్ గారూ.. ఇది సమర్థనీయమా..? : సుజనా చౌదరి

    ఎన్టీఆర్: శాంతియుత ప్రజాస్వామ్యంలో హింసకు, హింసను ప్రేరేపించే చర్యలకు స్థానం లేదన్నారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. సత్తెనపల్లి వైసీపీ నాయకుల హింసాత్మక ప్రవర్తనను ఖండించాల్సిందిపోయి సమర్థిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ‘‘అయ్యా జగన్ గారూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరే ఇలాంటి చర్యలను సమర్థిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమర్థనీయమో ఆలోచించండి. భవిష్యత్తులోనైనా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

  • ‘కార్మిక చట్టాలు కాల రాస్తున్నారు’

    ఎన్టీఆర్: కార్మిక చట్టాలు కొనసాగించాలని మున్సి పల్ కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరువూరు పట్టణంలో సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. పని గంటలను పెంచడాన్ని ఖండించారు. మహిళలు రాత్రివేళల్లో పని చేయాలని క్యాబినెట్‌లో తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని జిల్లా ఉపాధ్యక్షురాలు సుప్రజ ధ్వజమెత్తారు.

  • పిల్లలను విద్యకు దూరం చేయొద్దని నిరసన

    ఎన్టీఆర్: తమ పిల్లలను విద్యకు దూరం చేయొద్దని మైలవరం మండల పుల్లూరు పరిధిలోని లక్ష్మీనరసాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని స్కూల్‌కు తాళం వేసి విద్యార్థులను 2Kmల దూరంలోని మోడల్ స్కూల్‌కు తరలించడాన్ని వారు ఖండించారు. శుక్రవారం MEO కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పిల్లలు నేషనల్ హైవేపై వెళ్లాలని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు.

  • లేబర్ కోడ్లు రద్దు చేయండి: CPI

    ఎన్టీఆర్: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్ చేసింది. శనివారం విస్సన్నపేటలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జూలై 9న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి హరినాథ్ పిలుపునిచ్చారు. ఏఐసీసీటీయూ ఆదేశాల మేరకు నేటి నుంచి జూలై 5 వరకు నిర్వహించాలన్న ప్రచార జాత ప్రారంభించారు.

  • ‘యోగాంధ్రా’ ఏర్పాట్లు పరిశీలించిన శ్రీరాం తాతయ్య

    ఎన్టీఆర్: జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జగ్గయ్యపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో శనివారం యోగాంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాంగణంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులు, అధికారులు, ప్రజల సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని డ్రింకింగ్ వాటర్, ఆరోగ్య బృందం, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.