Locations: Krishna

  • తిరువూరులో ప్రైవేట్ ఖాళీ స్థలాలపై చర్యలు

    ఎన్టీఆర్: తిరువూరు నగర పంచాయతీ 9వ వార్డులోని ప్రైవేట్ ఖాళీ స్థలాలు పల్లంగా ఉండటంతో మరుగు నీరు చేరి దోమలు, విష సర్పాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా స్థలాల్లో పిచ్చి చెట్లను తొలగించి శుభ్రం చేయాలని వార్డ్ కౌన్సిలర్ దుర్గారావు ఆదేశించారు. లేనియెడల స్థల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

     

  • గురుకులంలో ఖాళీ సీట్ల భర్తీ.. దరఖాస్తుల ఆహ్వానం

    ఎన్టీఆర్: తిరువురులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ రవిబాబు తెలిపారు.6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తిరువూరు గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈనెల 25న కృష్ణారావుపాలెంలోని గురుకులంలో జరుగుతుందన్నారు.

     

  • యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి: RDO

    ఎన్టీఆర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తిరువూరు ఆర్డీఓ కె.మాధురి కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరువూరు రెవెన్యూ డివిజన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో ఈనెల 21వ తేదీన ఉదయం 7గంటలకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ప్రజలందరిలో యోగా పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

  • పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్‌గా గుడ్లవల్లేరు

    కృష్ణా: ఏపీ పాలిసెట్-2025 ధ్రువపత్రాల పరిశీలన హెల్ప్‌లైన్ సెంటర్‌గా గుడ్లవల్లేరులోని AANM & VVRSRపాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ తెలిపారు. నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ముందుగా ఈనెల 27వ తేదీ లోపు రూ.700(ఓసీ/బీసీ), రూ.250(ఎస్సీ/ఎస్టీ)ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలన్నారు. జూన్ 25నుంచి వెబ్ ఆప్షన్ ఎంట్రీ, జూలై 3న అలాట్‌మెంట్స్ జరుగుతాయన్నారు.

  • వంశీకి కొనసాగుతున్న వైద్యం

    విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీకి నిన్నటి నుంచి వైద్యం కొనసాగుతోంది. అస్వస్థతకు గురైన (వాంతులు, విరోచనాలతో డీహైడ్రేషన్) ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి నుంచి వంశీకి అక్కడే చికిత్స అందిస్తున్నారు.

  • అసభ్య ప్రవర్తన కేసులో మూడేళ్ల జైలు శిక్ష

    ఎన్టీఆర్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి పోక్సో కోర్టు న్యాయాధికారి వి.భవాని మూడేళ్ల జైలుశిక్ష, రూ.20వేల జరిమానా విధించారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఉపాధ్యాయురాలి కుమార్తెతో ప్రసాద్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా..నేరం రుజువైంది. దీంతో నిందితుడికి శిక్షను ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • జిల్లాస్థాయి వాచ్‌డాగ్‌ కమిటీ ఏర్పాటు: జేసీ

    ఎన్టీఆర్: కాలువలు, చెరువుల వెంబడి ఆక్రమణలను గుర్తించి, తొలగించేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జీవో నం. 386 ద్వారా నీటి వనరులు, చెరువుల బెడ్లను ఆక్రమణల నుంచి రక్షించేందుకు జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

  • ‘జిల్లాలో రేపు 4,470 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు‘

    కృష్ణా: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21వ తేదీన జిల్లాలో 4,470 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ జిల్లాలో నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సూచించారు. జిల్లాస్థాయి యోగా కార్యక్రమాన్ని ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తామని తెలిపారు.

  • చెవిరెడ్డి.. ఖైదీ నెంబరు 7865

    చిత్తూరు: మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌కు వెళ్లిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విజయవాడ జిల్లా జైలు అధికారులు నంబరు 7865 కేటాయించారు. ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకు 6864 నంబర్ ఇచ్చారు. వీరిద్దరినీ వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. జైలులో మాత్రం చెవిరెడ్డి మామూలుగానే ఉన్నట్లు, అందరితో కలిసి అల్పాహారం, భోజనానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ కేసులో జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

  • వల్లభనేని వంశీకి అస్వస్థత

    విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో డీహైడ్రేషన్‌కు గురైన ఆయన్ను జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.