తిరుపతి: విజయవాడ దుర్గ, కాళహస్తి ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది. మాల్ గంగా డైరీ పేరుతో బోలేబాబా ఈ నెయ్యిని సరఫరా చేశాడు. డైరీ జీఎం హరి మోహన్ రాణా సుగంధ ఆయిల్, పామోలిన్‌తో నెయ్యి తయారీలో కీలక పాత్ర పోషించాడని ఏపీపీ జనన ఏసీబీ కోర్టులో రాణా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ వాదించారు.
Locations: Krishna
-
పండుగలా ‘యోగాంధ్ర’.. 9లక్షల మందితో!
ఎన్టీఆర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో పండుగలా నిర్వహించేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన జిల్లాలో 605 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో 9లక్షల మందితో యోగా నిర్వహిస్తామని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమాన్ని నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తైన ప్రతిఒక్కరూ యోగాలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
-
అక్కాచెల్లెళ్లకు జనసేన నేత, కుమారులు వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం
కృష్ణా: జనసేన నాయకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బంటుమిల్లి మండలం పెందుర్రుకు చెందిన అక్కాచెల్లెళ్లపై అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పాండు, అతని కుమారులు నాగబాబు, సూరి వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని యువతి ఆరోపించింది. రోజురోజుకి వేధింపులు ఎక్కువవడంతో తన ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.
-
‘డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి’
కృష్ణా: జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర రావు ఆదేశాల మేరకు కోడూరు ఎస్సై చాణక్య గురువారం వి.కొత్తపాలెం గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామ ప్రజలకు పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమనిబంధనలు, డయల్ 100&112, చోరీలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, అలాంటి సమాచారం ఏదైనా తెలిస్తే వెంటనే పోలీసువారికి తెలియజేయాలని కోరారు.
-
గంటల్లో ఫోన్ రికవరీ చేసిన పోలీసులు
కృష్ణా: మచిలీపట్నం జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగి ఆటోలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫోన్ మర్చిపోయింది. విషయం గుర్తించి.. చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, టెక్నాలజీ సాయంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ నబి.. గంటల వ్యవధిలో ఫోన్‌ను రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు.
-
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి అభినందనలు
ఎన్టీఆర్: ప్రజా జీవితంలోనే కాకుండా న్యాయవాద వృత్తి రీత్యా కూడా తన తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు ఆశయాలను కొనసాగించాలన్న లక్ష్యంతో నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఏపీ లాసెట్‌లో 739వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు తెలిపారు.
-
అక్రమ సంబంధంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
కృష్ణా: గుడివాడ రైలు పేటలోని ప్రియురాలి ఇంటిలో గురువారం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ శివ నాగప్రసాద్(38) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య,పిల్లలు ఆసుపత్రిలో విలపించారు. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని భార్య పేర్కొంది.
-
కొండపల్లి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం
ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ ఛైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావును మెప్మా సభ్యులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల సభ్యులకు అభినందనలు తెలిపారు. మెప్మా సిబ్బంది, ఆర్పీలకు సహకరిస్తూ, సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని, తన సాయశక్తులా అందరికీ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.
-
రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే
కృష్ణా: అధికారులు చొరవ తీసుకొని రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని.. సమస్యల పరిష్కారానికి నా సంపూర్ణ సహకారం అందిస్తానని అధికారులతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గురువారం ప్రజావేదిక కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్‌ఓబీ,అనుబంధ రహదారుల నిర్మాణ పురోగతిని అడిగితెలుసుకున్నారు. రోడ్ల అభివృద్ధి ఆలస్యంపై సాంకేతిక సమస్యలను ప్రస్తావిస్తూ, అధికారులు చొరవతో పనులు పూర్తి చేయాలన్నారు.
-
‘కలెక్టర్ పర్యటనలతో రోడ్లు బాగుపడుతున్నాయి’
ఎన్టీఆర్: కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గుంతలు, మురుగునీరు, చెత్తతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోయినా, బుధవారం జిల్లా కలెక్టర్ వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమానికి రావడంతో అధికారులు వేగంగా గుంతలు పూడ్చి, రోడ్లు శుభ్రం చేశారు. కలెక్టర్ పర్యటనలతోనే రోడ్లు బాగుపడుతున్నాయని, తమ ప్రాంతాలకు కూడా వస్తే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.