Locations: Krishna

  • ‘కార్యకర్తల సంక్షేమనిధి.. టీడీపీకి మాత్రమే ఉంది’

    కృష్ణా: దేశంలోనే మరే రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశానికి మాత్రమే కార్యకర్తల సంక్షేమనిధి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కుటుంబసభ్యులుగా భావించే సంస్కృతి టీడీపీ సొంతమన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన నందివాడ మండలం అరిపిరాల గ్రామానికి చెందిన కొసనం నరసింహారావు కుటుంబసభ్యులు గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు.

  • విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యం: ఎమ్మెల్యే

    కృష్ణా: విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో జిల్లా ఫస్ట్ సాధించిన అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కారంకి గంగాభవాని (423/440), కాకర్ల వికాస్ (480/500)లను ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన నాయకుడు గరికిపాటి రామ్ వశిష్ఠ ఆధ్వర్యంలో సత్కరించారు. గంగాభవాని విద్యకు సహకరిస్తున్న రామ్ వశిష్ఠను ఎమ్మెల్యే అభినందించారు.

  • ఆగని మట్టి అక్రమ రవాణా.. రైతులు ఆందోళన

    ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామంలో రైతులు అక్రమ మట్టి రవాణాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పొలాలు, ఇళ్లకు మట్టి అనుమతి నిరాకరిస్తున్న అధికారులు ఇటుక బట్టీలకు మాత్రం అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రావులచెరువులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు, ట్రాక్టర్ల ద్వారా వేల క్యూబిక్ మీటర్ల మట్టిని జిల్లాలు దాటి తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో మట్టి దిబ్బలు స్టాక్‌ రూపంలో దర్శనమిస్తున్నాయి.

     

  • జనసేనలో చేరిన వైసీపీ నేతలు

    కృష్ణా: అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో పలువరు జనసేన పార్టీలోకి చేరారు. మోపిదేవిలంకకు చెందిన వైసీపీ మాజీ గ్రామకన్వీనర్, మండల కమిటీ సభ్యుడు బళ్ళ లక్ష్మణస్వామి జనసేనలో చేరారు. ఆయనతో పాటు మాజీ వార్డు సభ్యుడు రాజులపాటి శ్రీనివాసరావు, దేవనబోయిన సాంబశివరావు, పెద్దిబోయిన రంగారావు, విశ్వనాధపల్లి బాబూరావు పార్టీలో చేరారు. వారికి జనసేన పార్టీ కండువాలతో స్వాగతం పలికారు.

     

  • పకృతి విపత్తులు ఎదుర్కోవడంపై అవగాహన కార్యక్రమం

    కృష్ణా: ఘంటసాల మండలం, కృష్ణా నది పరివాహక ప్రాంతాలైన శ్రీకాకుళం గ్రామము, పాపవినాశనం గ్రామాల్లో ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామసభ నిర్వహించారు. గురువారం ఉదయం 10 గంటలకు గ్రామస్థాయి అధికారులు, గ్రామస్తులు, ఆశ్రమ నిర్వాహకులతో సమావేశం నిర్వహించినట్లు తహశీల్దార్ బి.విజయప్రసాద్ పేర్కొన్నారు. వరద కారణంగా వచ్చే ప్రమాదాలను వివరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక బస్సులు

    ఎన్టీఆర్: జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఇంద్ర ఏసీ ప్రత్యేక బస్సులు నడనుంది. ఈనెల 25న విజయవాడ నుంచి బస్సులు బయలుదేరి, 28న రాత్రి తిరిగి వస్తాయి. రూ.4,800 టికెట్‌తో అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, కోణార్క్, పూరి ఆలయాల దర్శనం కల్పించనున్నారు. మరిన్ని వివరాలకు APSRTC వెబ్‌సైట్‌ చూడవచ్చు.
  • సుబ్రహ్మణ్యేశ్వరున్ని దర్శించుకున్న ఎస్పీ గంగాధర్

    కృష్ణా: మోపిదేవి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఆయనను సత్కరించారు.

  • అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

    కృష్ణా: మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. పిల్లలను సరదాగా పలకరించి అన్నం రుచి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఎదుగుదలకు సరైన పోషకాలు గల ఆహారం అందించాలని పలు సూచనలు చేశారు.

  • వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ బాలాజీ

    కృష్ణా: మోపీదేవిలోని తహశీల్దార్ కార్యాలయం పక్కనున్న ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలో అదనపు గదుల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. అక్కడ రూ.33.40 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతుల గదులను, మరుగుదొడ్లు, వంటగది మరమ్మతు పనులను పరిశీలించారు.

  • కుంగిన సైడ్ షోల్డర్స్.. చర్యలు చేపట్టిన అధికారులు

    కృష్ణా: కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయినట్లు అధికారులు తెలిపారు. అయితే జయపురం-వి.కొత్తపాలెం గ్రామాల మధ్య ఆరు ప్రదేశాల్లో రహదారికి పక్కనున్న సైడ్ షోల్డర్స్ కుంగిపోవడంతో అధికారులు దానికి సంబంధించిన పనులపై దృష్టి సారించారు. గత రెండు రోజుల నుంచి కుంగిన చోట పట్టిష్టమైన చర్యలు చేపట్టేందుకు ఆ ప్రాంతంలో కొండ రాళ్లను వేసి రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.