Locations: Krishna

  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

    ఎన్టీఆర్: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • తాత్కాలిక గేట్లతో.. తప్పని తిప్పలు

    కృష్ణా: కోడూరు అవుట్ పాల్స్ స్లూయిస్‌కు గేట్లు బిగించినా తిప్పలు తప్పడం లేదని రైతులు వాపోయారు. అవుట్ పాల్స్ వద్ద నీటి ప్రవాహానికి అడ్డం వేయకుండా కాంట్రాక్టర్ తాత్కాలిక గేట్లు బిగించాడు. దీంతో ఉప్పునీటి ప్రవాహం ఎగువకు యధావిధిగానే ప్రవహిస్తుందన్నారు. బేస్‌మెంట్ కాంక్రీట్ పనులు చేస్తే ఉప్పు నీరు ఎగువకు రాకుండా ఆగుతాయని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • గుడివాడలో కూరగాయల ధరల వివరాలు

    కృష్ణా: గుడివాడ రైతు బజార్‌లో గురువారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాటా రూ. 28, వంకాయ రూ. 18, బెండకాయ రూ. 20, పచ్చిమిర్చి రూ. 33, కాకరకాయ రూ. 40, క్యాబేజీ రూ. 19, క్యారెట్ రూ. 20, దొండకాయ రూ. 14, బంగాళదుంప రూ. 28, ఉల్లిపాయలు రూ. 28, గోరుచిక్కుడు రూ. 30, దోస రూ. 14, అల్లం రూ. 60, బీట్‌రూట్ రూ. 29, కీరదోస రూ. 41, క్యాప్సికం రూ. 75లుగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.

  • రోడ్డుపై మురుగు.. రాకపోకలకు అవస్థలు

    కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం 6వ వార్డులోని లైబ్రరీ రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. డ్రైనేజీ పూడిక తీయక పోవడంతో మురుగు నీరు రోడ్డు పైకి ప్రవహించి దుర్వాసన వెదజల్లుతోంది. నడవడానికి కూడా వీల్లేకుండా మురుగు నీరు ప్రవహించడంతో పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ నాటే కార్యక్రమం

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలంలో వికసిత భారతదేశపు అమృతకాలం, సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11సంవత్సరాల పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గురువారం ‘అమ్మ పేరుతో-ఒక మొక్క’ నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు పులపాక బాబు, జిల్లా కార్యదర్శి తోకల శంకర్, మండల మాజీ అధ్యక్షురాలు తోకలసుమ, హైందవశక్తి జిల్లా ఉమ్మడి అధ్యక్షురాలు కొత్తూరు ప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • ఆధార్ కేంద్రం లేక ప్రజల అవస్థలు

    ఎన్టీఆర్: కొండపల్లి పట్టణంలో ఆధార్ సెంటర్లు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నూతన ఆధార్, ఆధార్ మార్పులు, చేర్పులకు విజయవాడ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు స్పందించి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సాంకేతిక కారణాలతో సచివాలయాల్లో ఆధార్ సేవలు నిలిచిపోయాయని, త్వరలో సాంకేతిక సమస్యలు పరిష్కరించి ఆధార్ సేవలు పునరుద్ధరిస్తామని మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు.

  • మచిలీపట్నం ఫైర్ యాక్సిడెంట్.. వారిపనేనా..?

    కృష్ణా: మచిలీపట్నంలోని వాణి స్వీట్స్ అండ్ బేకరీస్‌లో తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పల్లపోతు దిలీప్, మాజీ మంత్రి పేర్ని నాని అనుచరుడు అయిన యజమాన్యమే ఆర్థిక నేరాల కేసుల నుండి తప్పించుకోవడానికి అగ్నిప్రమాదం సృష్టించిందని స్థానికులు అనుమానిస్తున్నారు. గతంలో ఈ బేకరీపై ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి.

  • రేపు మెగా జాబ్ మేళా.. ‘సద్వినియోగం చేసుకోండి’

    గుంటూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈనెల 20వ తేదీ మేడికొండూరు మండలం విశదల అడ్డరోడ్డు వద్ద ఉన్న ఎన్ఆర్ఐఐటీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • BREAKING: మచిలీపట్నంలో అగ్ని ప్రమాదం

    కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వాణి బేకరీలో తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • సైబర్ నేరగాళ్ల వలలో MBA విద్యార్థిని.. చివరికి..

    కృష్ణా జిల్లా కానూరుకు చెందిన ఎంబీఏ పట్టభద్రురాలు దివ్య, ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.27 లక్షలు పోగొట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చూసి, షేర్‌చాట్‌లో పోస్టులకు లైక్ చేస్తే ఒక్కోదానికి రూ.50 ఇస్తామని నమ్మించారు. తొలుత డబ్బులు చెల్లించటంతో నమ్మి..దాదాపు రూ.29 లక్షలు చెల్లించిన తరువాత మోసపోయినట్లు గుర్తించిన దివ్య, పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.