Locations: Krishna

  • నేడు పవర్ కట్.. ప్రాంతాలివే!

    కృష్ణా: తోట్లవల్లూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈఈ దేవదాసు తెలిపారు. పెనమకూరు సబ్ స్టేషన్లో ఆర్ఎస్ఎస్ విద్యుత్తు లైన్లు మరమ్మతులో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సరఫరా నిలిపివేయనున్నామన్నారు. పెనమకూరు, కుమ్మమూరు గ్రామాల్లో సరఫరాకు అంతరాయం కలుగుతుందని, విద్యుత్ వినియోగదారులు అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

  • రేపు మెగా జాబ్ మేళా.. ఎక్కడంటే?

    కృష్ణా: అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రేపు మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని గుడివాక లక్ష్మి తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆసక్తి గలవారు 9014333335 నెంబరులో సంప్రదించాలన్నారు.

  • అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీ.. ఎప్పుడంటే?

    కృష్ణా: ఏసీఏ ఆధ్వర్యంలో మంగళగిరి, పేరేచర్లలోని ఏసీఏ క్రికెట్ మైదానాల్లో ఏసీఏ సెంట్రల్ జోన్ అండర్-19 అంతర్ జిల్లాల మల్టీ డే క్రికెట్ టోర్నీ జరగనుంది. ఈనెల 21 నుంచి జూలై 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏసీఏ వర్గాలు వెల్లడించాయి. ఈ టోర్నీలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జట్లు తలపడనున్నాయి.

  • ‘మహిళలు మత్స్య పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి’

    కృష్ణా: డ్వాక్రా మహిళలు మత్స్య పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఘంటసాల మండలం చిట్టూర్పు శివారు చాట్రగడ్డ వాని ఎస్సీ కాలనీలో డ్వాక్రా మహిళ కొడాలి వెంకటలక్ష్మి నూతనంగా ఏర్పాటు చేసిన కొరమేను చేపల ఉత్పత్తి ప్లాంటును ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో రాంకి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

  • పెడన అన్నా క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ

    కృష్ణా: పెడన పట్టణంలో అన్నా క్యాంటీన్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్‌ను పరిశీలించి, ఆహారం శుచిత్వం, రుచి, వేడిగా ఉందని లబ్ధిదారుల నుంచి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, పౌష్టికాహారం, వేడివేడి ఆహారం అందించాలని ఆదేశించారు.

  • బండి రామకృష్ణ డీసీఎంఎస్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం

    కృష్ణా: మచిలీపట్నంలో జనసేన నేత బండి రామకృష్ణ డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. వేలాది జనసైనికుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, జనసేన నేత సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ప్రమాణస్వీకారానికి ముందు మూడు స్థంభాల సెంటర్ నుంచి సత్య కన్వెన్షన్ వరకు భారీర్యాలీ నిర్వహించారు.

  • కారును ఢీకొన్న బైక్.. ఇద్దరకీ తీవ్రగాయాలు

    కృష్ణా: మచిలీపట్నం డీమార్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

     

  • జీవితంలో యోగా సాధన భాగం కావాలి: మంత్రి

    ఎన్టీఆర్: భారతీయుల వారసత్వ, సాంస్కృతిక సంపదైన యోగాను నేడు యావత్ ప్రపంచం అనుసరిస్తోందని, తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు-2025 కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని సూచించారు.

  • ఉత్సాహంగా సత్యసాయిబాబా నూరు వసంతాల వేడుకలు

    కృష్ణా: పుట్టపర్తి సత్య సాయిబాబా నూరు వసంతాల వేడుకలలో భాగంగా సత్యసాయి ప్రేమ రథయాత్ర బుధవారం పెడన మండలంలో సందడి చేసింది. ఈ రథయాత్ర బల్లిపర్రు గ్రామం నుంచి పెడన పట్టణం వరకు భక్తుల ఉత్సాహభరితంతో వైభవంగా సాగింది. రథాన్ని స్వాగతించేందుకు భక్తులు పూర్ణకలశాలు, హారతులు, టెంకాయలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీన్మార్ డప్పులు, కర్రసాము, కోలాట బృందాల నృత్యాలతో రథయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.

  • మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ బీభత్సం.. ముగ్గురికీ గాయలు

    కృష్ణా: చెన్నై-కోలకతా జాతీయ రహదారిపై గన్నవరంలోని స్థానిక ఆల్ఫా కేఫ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి పెద్దఅవుటపల్లి వెళ్లే ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొని ఎదురుగా వస్తున్న ఆటోపైకి దూసుకెళ్లింది. ఒక మహిళకు తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆటోలో హాస్పటల్‌కు తరలించారు.