Locations: Krishna

  • VIDEO: కూటమి నేతలపై సుంకర పద్మశ్రీ ఘాటు వ్యాఖ్యలు

    కృష్ణా: గన్నవరంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేతల విగ్రహాలను కూటమి నాయకులు అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ఏఐసీసీ మెంబర్ సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గన్నవరం తహశీల్దార్ శివయ్యను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధిని అడ్డం పెట్టుకుని విగ్రహాలను ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు,పవన్‌కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీపై విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు.

  • భారతదేశ వారసత్వ సంపద యోగా : కందుల

    ఎన్టీఆర్: భారతీయుల వారసత్వ, సాంస్కృతిక సంపదైన యోగాను నేడు యావత్ ప్రపంచం అనుసరిస్తోందని.. తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో 520 మంది పాల్గొనగా విజేతలుగా ఎంపికైన 193 మందికి బహుమతులు ప్రదానం చేశారు.

  • వరుస చోరీలకు పాల్పడిన దొంగల ముఠా అరెస్ట్

    కృష్ణా: వేర్వేరు దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను ఆత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.14లక్షల విలువైన ఐదు బైకులు, 60గ్రాముల బంగారు ఆభరణాలు, 600గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్కూరు ఎస్ఐ, సిబ్బంది అదునాతన సాంకేతికతతో ఏలూరు జిల్లాకు చెందిన పారేపల్లి శేషు(23), పోలవరపు నాగ దుర్గాప్రసాద్, దుగ్గిరాల శివరామకృష్ణలను గుర్తించి, ప్రధాన నిందితుడు శేషును అదుపులోకి తీసుకున్నారు.

  • వేర్వేరు ప్రమాదాల్లో ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత

    కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఒక్క రోజులోనే మూడు వరుస ప్రమాదాలు జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుడ్లవల్లేరుకు చెందిన జిలాని కుటుంబసభ్యులతో సహా మచిలీపట్నం బీచ్‌కి విహారయాత్రకు వచ్చి అలల ఉధృతికి గల్లంతై చనిపోయాడు. ముదినేపల్లికి చెందిన గణేష్ పెదపట్నం బీచ్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడ్డాడు. మచిలీపట్నంలో టిప్పర్ ఢీకొని కొఠారి కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు.

  • 3 రోజుల్లో పంచాయతీలకు నిధులు: కమిషనర్

    కర్నూలు: పంచాయితీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలతో 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయితీలకు రావాల్సిన నిధులపై తాడేపల్లిలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజను కలిసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి తెలిపారు. రూ.1100కోట్ల నిధులు సర్పంచ్‌ల ఖాతాలో విడుదల కాలేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మూడు రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

  • రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

    కృష్ణా: మచిలీపట్నం బీచ్ రోడ్డు మేకావారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైకుపై వెళుతున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. మచిలీపట్నం పోర్టుకు కొండరాళ్లు తరలిస్తున్న టిప్పర్ ఢీకొనడంతో  బైకుపై వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మేకవారి పాలెంకు చెందిన కొఠారి కోటేశ్వరరావు(50) గుర్తించారు.

  • కంచికచర్ల ప్రభుత్వాసుపత్రి వద్ద రిక్వెస్ట్ బస్‌స్టాప్

    ఎన్టీఆర్: కంచికచర్ల నుంచి విజయవాడ, జగ్గయ్యపేట వైపు వెళ్లే బస్సుల కోసం జాతీయ రహదారిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ బస్‌స్టాప్ ఏర్పాటు చేసింది. సాధారణంగా బస్‌స్టాప్ నుంచి ఆరోగ్య కేంద్రానికి 2కిలోమీటర్లు నడవాల్సి ఉండగా, ప్రజల ఫిర్యాదు మేరకు బుధవారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సూపర్వైజర్ రాఘవేంద్ర, ఆర్టీసీ ఏడీసీ అబ్రహం పాల్గొన్నారు.

  • సైబర్ నేరాలపై.. తస్మాత్ జాగ్రత్త!

    ఎన్టీఆర్: సైబర్ నేరాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు, అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అవగాహన సదస్సులు నిర్వహించారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడంతో నగరంలో నేరాలు తగ్గాయి. తెలియని వ్యక్తులకు ఫోన్ స్క్రీన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ షేర్ చేయవద్దని, మోసపూరిత పథకాలపై అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు.

  • కొడాలి నాని అరెస్టు వార్తలు అవాస్తవం: ఎస్పీ

    కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నానిని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు స్పష్టం చేశారు. అధికారికంగా అరెస్టు జరిగితే తెలియజేస్తామని, నిజం లేని వార్తలను పోస్ట్ చేసినా, షేర్ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించమని ఎస్పీ తెలిపారు.

  • భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

    కృష్ణా: అక్రమ సంబంధానికి అలవాటు పడిన భర్తను నిలదీసినందుకు భార్యను హతమార్చిన కేసులో భర్తకు మచిలీపట్నం జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2000 జరిమానా విధించింది. పర స్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్తకు ఈరోజు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.