Locations: Krishna

  • విజయవాడలో CPI రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు

    ఎన్టీఆర్: CPI(M) రెండు రోజుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచకంగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు సిహెచ్ నర్సింగరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు.
  • జోరుగా అక్రమ మట్టి దందా!

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో రహదారుల వెంట పంటపొలాల్లో మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి. కోడూరు చెరువు నుంచి ట్రాక్టర్ల ద్వారా భారీగా మట్టి తరలిస్తున్నారు. పొలాలకు మెరక కోసం అనుమతులు తీసుకుని, ఇరిగేషన్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అతివేగంతో వెళ్తున్న ట్రాక్టర్లు పల్టీలు కొడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

  • ఘనంగా జవాన్ విగ్రహ ఆవిష్కరణ

    కృష్ణా: గత ఏడాది క్రింద జరిగిన శ్రీనగర్ లద్దాఖ్ బేగ్ ఓల్టీ ప్రాంతంలో జరిగిన వరద ప్రవాహంలో పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సాధారబోయిన నాగరాజు మృతి చెందారు. ఈ సందర్బంగా ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణలో ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, పెడన జడ్పీటీసీ వెంకట నగేష్, టీడీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

  • ‘ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం’

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయం రంగాన్ని అత్యంత ఆధునికంగా టెక్నాలజీతో వ్యవసాయ పనులు చేసే విధంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.

  • యోగా సాధనలో మున్సిపల్ కార్మికులు

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గుంటుపల్లి డాన్ బాస్కో పాఠశాలలో గత మూడు రోజులుగా యోగ సాధన కార్యక్రమం జరుగుతున్న సంగతి విధితమే. దీనిలో భాగంగా మేము సైతం ఆరోగ్య పరిరక్షణకు ముందు ఉంటామంటూ కొండపల్లి మున్సిపల్ కార్మికులు పాల్గొని వివిధ ఆసనాలను సాధన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతినిత్యం పరిసరాలు శుభ్రం చేస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమని, వారికి యోగా సాధన ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

  • కొండపల్లిలో మున్సిపల్ కార్మికుల ధర్నా

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద జీతాల పెంపు, ఉద్యోగ భద్రత కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ..ఈ నెల 20 తర్వాత నిరవధిక సమ్మెకు సిద్ధమని తెలిపారు. మంచినీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్‌లో సేవలందించే ఇంజనీరింగ్ కార్మికులకు ప్రజలు, మేధావులు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

  • మచిలీపట్నంలో 10వ తరగతి విద్యార్థి అదృశ్యం

    కృష్ణా: మచిలీపట్నంలోని ఓ మిషనరీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఎస్‌కే మతీన్ అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం యధావిధిగా పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగివచ్చిన మతీన్ సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తమ బంధువుల ఇళ్ల వద్ద గాలించినప్పటికీ తమ కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

    ఎన్టీఆర్: నందిగామ మండలం కేతవీరునిపాడులో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి నెలకుదిటి శివనాగేశ్వరావు సోదరుడు నాగయ్య నివాసంలో ఉప్పలమ్మ తల్లి కొలుపు నిర్వహించారు. కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

    ఎన్టీఆర్: ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామలోని జడ్పీహెచ్ స్కూల్‌లో ఏర్పాటు చేయనున్న ‘యోగాంధ్ర’ సభా ప్రాంగణాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి పరిశీలించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో కమిషనర్ లోవరాజు, ఏఈ ఫణి శ్రీనివాస్, సచివాలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.

  • నడిరోడ్డులో స్కూటీపైనే నిద్రించిన మందు బాబు(VIDEO)

    ఎన్టీఆర్: ఇంటికెళ్తే కుటుంబీకులు తిడతారనో, స్కూటీలో ఆయిల్ అయిపోయిందో ఏమో ఓ మందుబాబు రోడ్డుపై నిద్రించాడు. విజయవాడ శ్రీనగర్ కాలనీ వద్ద బుధవారం ఈఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహన హరన్ శబ్దాలు ఉన్నా..బండిపైనే తాపీగా ఒక కునుకు తీశాడు. దీంతో అటుగా వెళ్లే వాహన చోదాకులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. కాగా ట్రాఫిక్ పోలీసులు అతనిని అక్కడ నుంచి పంపించారు.