ఎన్టీఆర్: తిరువూరు నగర పంచాయతీ 2వ సచివాలయం పరిధిలోని 3వ వార్డులో బొమ్మల బజార్ రోడ్డులో డ్రైన్ పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ మనోజ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు.
Locations: Krishna
-
కార్మికులకు ‘తల్లికి వందనం’ అమలు చేయాలి
ఎన్టీఆర్: తిరువూరు మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని చీరాల సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-
మెట్రో ప్రాజెక్టు భూసేకరణకు సంయుక్త పరిశీలన
ఎన్టీఆర్: మెట్రో రైలు ప్రాజెక్టు భూసేకరణ కోసం క్షేత్ర స్థాయిలో అధికారులు సంయుక్త పరిశీలన చేయాలని జేసీ ఇలక్కియా సూచించారు. విజయవాడ-హైదరాబాద్, పెడన-విస్సన్నపేట జాతీయ రహదారుల విస్తరణకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టరేట్‌లో ఆమె సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ..విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని 226 కి.మీ మేర 6వరుసల విస్తరణకు భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు.
-
పెదపట్నం బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
కృష్ణా: బందరు మండలం పెదపట్నం బీచ్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ముదినేపల్లికి చెందిన గణేష్(34)గా గుర్తించారు. బైక్ రైడ్ చేస్తుండగా పైప్‌లైన్‌ను ఢీకొని పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు చెప్పగా..హత్య జరిగి ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేశారు.
-
మట్టి కోసం పాట్లు పడుతున్న అక్రమార్కులు
ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో మట్టి కోసం అక్రమార్కులు పాట్లు పడుతున్నారు. బొర్రగూడెం చెరువు వద్ద మట్టి రవాణాపై పుల్లూరు, బొర్రగూడెం గ్రామస్థులు గొడవకు దిగారు. అదేవిధంగా వెలగలేరులోని పోలవరం కాలువ ప్రక్కన టిప్పర్లతో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. రవాణా చేసే క్రమంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న ట్రాక్టర్లు స్థానికులను భయపెడుతున్నాయి. ఇంతా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
-
మంగినపూడి బీచ్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కృష్ణా: మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌కు గుడ్లవల్లేరుకు చెందిన జిలానీ(30) మంగళవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి వచ్చి సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి గల్లంతయ్యాడు. జిలానీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిలానీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
పెనుగొండ రామచంద్రరావుకు సేవా భూషణ్ అవార్డు
ఎన్టీఆర్: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో త్యాగరాయ గానసభ వేదికగా జాతీయ స్థాయి తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. కరోనా సమయంలో విస్సన్నపేటకు చెందిన బీజేపీ నేత పెనుగొండ రామచంద్రరావు చేసిన సేవలకు గుర్తింపుగా సీఈఓ రత్నం చేతుల మీదుగా సేవా భూషణ్ అవార్డు, షీల్డ్, ప్రశంసాపత్రం అందజేశారు. అనంతరం రామచంద్రరావు సేవలను రత్నం కొనియాడారు.
-
నేడు జగ్గయ్యపేటలో తాగునీటి సరఫరాకు అంతరాయం
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని ముక్త్యాల రోడ్డులో 40HP మెయిన్ పంపింగ్ లీకేజీ కారణంగా మిట్టగూడెం, డంగ్‌మిల్లు, యాదవబజార్, డీవీఆర్‌నగర్ ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. ఇంజినీరింగ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారని, 24 గంటల్లో సమస్య పరిష్కరించి నీటి సరఫరా కొనసాగిస్తామన్నారు. అత్యవసర నీటి కోసం పురపాలక సంఘాన్ని సంప్రదిస్తే ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు.
-
నేడు ఉద్యోగ మేళా..ఎక్కడంటే
కృష్ణా: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి పామర్రులోని ఆరేపల్లి కల్యాణ మండపంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వర్ల కుమారారాజా తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.. వివిధ ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయన్నారు. ఎంపికైన వారికి మంచి వేతనం ఇతర సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు.