ఎన్టీఆర్: విజయవాడలో ‘తల్లికి వందనం’ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇద్దరు మహిళలను మోసం చేసి రూ.48,500కాజేశారు. జి.కొండూరులో కూడా ఇదేతరహా మోసం జరిగింది. సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, ఓమాజీ వాలంటీర్ ద్వారా లబ్ధిదారుల వివరాలు సేకరించి, ‘అమ్మ ఒడి’ కూడా చెల్లిస్తామని నమ్మించి ఇద్దరు మహిళల నుంచి రూ.29,000దొంగిలించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Locations: Krishna
-
పుణ్యక్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు
ఎన్టీఆర్: పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు నడపనుందని విజయవాడ సంస్థ ప్రాంతీయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, రాజమహేంద్రవరం మీదుగా కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, నైమిశారణ్యం తదితర ప్రదేశాలను సందర్శించి జులై 1న తిరుగు ప్రయాణమవుతుందన్నారు. టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం 9281495848లో సంప్రదించాలన్నారు.
-
డీఎల్పీఓను సత్కరించిన పంచాయతీ కార్యదర్శులు
కృష్ణా: బదిలీల్లో భాగంగా ఈ ప్రాంతానికి డిఎల్పిఓగా ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న ఎండి రజావుల్లా ను గూడూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు మంగళవారం ఘనంగా సత్కరించారు. గతంలో ఆయన నియోజకవర్గంలోని బంటుమిల్లి గూడూరు మండలాల్లో ఈఓపీఆర్డీగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడకు డీఎల్పీఓగా వచ్చారు. ఆయన కార్యాలయంలో వీరు కలిసి సత్కరించారు.
-
అధికార పార్టీ నేతల మధ్య ‘మట్టి’ రగడ
ఎన్టీఆర్: మట్టి కోసం అధికార పార్టీ నేతల మధ్య రగడ రాజుకున్న ఘటన మైలవరం మండలంలో చోటుచేసుకుంది. బొర్రగూడెం గ్రామానికి చెందిన ఓ నేత గ్రామ చెరువు నుంచి గత 20రోజులుగా మట్టిని తరలిస్తున్నారు. చండ్రగూడెం గ్రామానికి చెందిన నాయకులు తాముకూడా మట్టి తోలుకుంటామంటూ ట్రాక్టర్లను తీసుకువచ్చారు. దీంతో స్థానిక నేతలు ట్రాక్టర్లు అడ్డుపెట్టడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.
-
‘పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం’
కృష్ణా: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరపున సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక అన్నె వారి కళ్యాణ మండపంలో పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వారికి వివరించారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
-
‘తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి’
కృష్ణా జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు విద్యాసంస్థల్లో తప్పనిసరిగా వస్తు సేవలు, పన్ను(జీఎస్టీ), వృత్తి పన్ను(టీడీఎస్) ఖచ్చితంగా వసూలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఎస్పీ గంగాధరరావు, జేసీ గీతాంజలిశర్మ,వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ హేమతో కలిసి జిల్లా అధికారులతో పన్ను వసూలుపై సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
-
అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
కృష్ణా జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి కలెక్టర్ డీకే బాలాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ సమీక్షలు జరుపుతున్నా పురోగతి సాధించడంలో కొంత మంది అధికారులు వెనుకబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిగింది. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కాంట్రాక్టర్లు, లబ్దిదారులతో సమావేశాలు నిర్వహించి గృహ నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు.
-
‘జగన్ ప్రభుత్వం.. వ్యవస్థలను నాశనం చేసింది’
కృష్ణా: తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కి, మంత్రి నారా లోకేష్‌ల చిత్రపటాలకు పెడన నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థను, సంక్షేమపథకాలను అమలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
-
అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నిధుల మంజూరు
ఎన్టీఆర్: కంచికచర్ల అగ్నిమాపక కేంద్రాన్ని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల అధ్యక్షులు చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికి సన్మానించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.75కోట్లు అగ్నిమాపకశాఖ ఆధునీకరణకు మంజూరయ్యాయని, కొత్తస్టేషన్లు,వాహనాల కొనుగోలుకు వినియోగిస్తామని, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని చంద్రశేఖర్ తెలిపారు.