కృష్ణా: జర్వం వచ్చిందని ఆస్పత్రిలో చేరిన బాలిక గుండె పోటుతో మరణించింది. పామర్రు మండలం పెదమద్దాలిలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. విషాదం. గుమ్మడి లావణ్య అనే 8వ తరగతి స్టూడెంట్ ఈ నెల 5న జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతుండగా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. పరీక్షలు నిర్వహించగా గుండెపోటుతో మరణించినట్టు తేలింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Locations: Krishna
-
‘హోమియపతి ఆసుపత్రి తక్షణమే ప్రారంభించాలి’
ఎన్టీఆర్: మైలవరం మండలం పుల్లూరులో ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి గత 6నెలల నుంచి మూతబడింది. దీంతో సీపీఎం నాయకులు సోమవారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల కార్యదర్శి సుధాకర్ అన్నారు. హోమియోపతి వైద్యం మీద ఆధారపడిన వారికి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని హాస్పిటల్‌ను ప్రారంభించాలని కోరారు.
-
గణేష్ ప్రెస్ అధినేత వక్కలగడ్డ కన్నుమూత
కృష్ణా: చల్లపల్లిలో గణేష్ ప్రెస్ అధినేత వక్కలగడ్డ రాధాకృష్ణ మరణించారు. ఆయన మరణం పట్ల సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు శీలం నారాయణరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాధాకృష్ణ గత పది సంవత్సరాలు మంచి స్నేహితుడిగా అనేక విషయాల్లో భాగం పంచుకున్నారని, వారి భౌతికకాయాన్ని చివరిసారి చూడలేకపోతున్నందుకు బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
-
ఆ బాధ్యత ప్రభుత్వానిదే: సీపీఐ
కృష్ణా: విస్సన్నపేటలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ లక్ష్మికి మెమోరాండం ఇచ్చారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అందించవలసిన యూరియా తగిన మోతాదులలో లభించడం లేదన్నారు. యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ను కోరారు.
-
గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థిని మృతి
AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం పెదమద్దాలిలో విషాదం చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థిని గుమ్మడి లావణ్య (13) గుండెపోటుతో మరణించింది. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే గుండెపోటు రావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
-
యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు
కృష్ణా: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఘంటసాల రైతు సేవాకేంద్రం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తీరా మల్లంపల్లి, చిలకలపూడి, వి.రుద్రవరం, బోళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులకు మాత్రమే ఇస్తున్నారని చెప్పడంతో పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తే అందరికి ఇవ్వాలని, అరకొరగా ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.
-
వైసీపీ సానుభూతి పరుడు మృతి.. రమేశ్‌బాబు నివాళి
కృష్ణా: చల్లపల్లి ఎస్టీకాలనీకి చెందిన వైసీపీ సానుభూతి పరుడు, రిటైర్డ్ ఆర్టీసి ఉద్యోగి ఉప్పాల మురళీమోహన్(70) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మోహన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
-
కంచికచర్లలో కొనసాగుతున్న బంద్
ఎన్టీఆర్: కంచికచర్ల మండల వ్యాప్తంగా సోమవారం బంద్ చేపట్టారు. పరిటాలలో వినాయక చవితి ఊరేగింపులో జరిగిన హిందువులపై దాడులకు నిరసనగా పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు కంచికచర్ల మండల వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. హిందువులపై రాళ్లదాడి చేసి విద్యార్థులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
-
అండగా ఉంటాం: కొండా
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గ బహుజన ఐక్యసంఘం నాయకులు గుదే జయప్రకాష్, తాడితోటి నరసింహారావు ఆధ్వర్యంలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ మెంబర్ కొండా నాగేశ్వరరావుకు సన్మానసభ ఏర్పాటు చేశారు. బహుజన నాయకులు, టీడీపీ నేతలు వారిని ఘనంగా సన్మానించారు. ఎస్సీలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తామని ప్రవీణ్ వెల్లడించారు. -
యూరియా కోసం తిప్పలు.. క్యూలో చెప్పులు!
ఎన్టీఆర్: గంపలగూడెం మండలంలోని గుళ్ళపూడి గ్రామ సొసైటీలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులు నిలబడేందుకు ఓపిక లేక చెప్పులను క్యూలో పెట్టారు. సోమవారం తెల్లవారుజామున 5గంటల నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా ఇస్తామనడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో యూరియా అందక తాము నష్టపోతున్నారని, ప్రభుత్వం నుంచి యూరియా సరఫరా అరకొరగా అందుతుందన్నారు.