Locations: Krishna

  • క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ విస్తృత తనిఖీలు

    ఎన్టీఆర్: నందిగామ డివిజన్‌లో జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రోమోర్ ఎరువుల, పురుగుమందుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మకాల రికార్డులను పరిశీలించి, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఎరువుల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఫిర్యాదుల కోసం 9154970454నెంబర్ డిస్ప్లే బోర్డులో పెట్టాలని,ఎరువులు,ధరల సమాచారం నోటీస్ బోర్డులో పొందుపరచాలని సూచించారు. అధిక ధరలకు అమ్మడం, దుర్వినియోగం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ముప్పాళ్ల వేదికగా P4 కార్యాచరణలో అద్బుత ఫలితాలు..!

    ఎన్టీఆర్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల ప్రతిరూపమైన P4 మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమం ముప్పాళ్లలో మార్గదర్శుల ద్వారా లబ్ధిదారులకు సహాయం అందుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ ప్రత్యక్షంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ప్రతిష్టాత్మక P4 కార్యక్రమంలో భాగంగా కొండ్రు వెంకటరావమ్మ, కోట వెంకటరత్నం బంగారు కుటుంబాల ఇళ్లకు ఆర్‌డీవో బాలకృష్ణతో వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి, స్థితిగతులు, ఆదాయ పెరుగుదల తెలుసుకున్నారు.

  • కొండపల్లిలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రామిక నగర్ (కొత్తగేటు)లో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం విగ్రహ కమిటీల వారిని అభినందించారు. విగ్నేశ్వరుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

  • ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి జంపాల శుభాకాంక్షలు

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ప్రెస్ క్లబ్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య కార్యాలయంలో అధ్యక్షుడు గిరి, కార్యదర్శి డేవిడ్‌లను దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల విలువను కాపాడుతూ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

  • రూ.4లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలోని ముత్యాలమ్మ దేవస్థానం దగ్గర వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీ వరసిద్ధి వినాయక స్వామివారికి 4వ వార్షికోత్సవం సందర్భంగా రూ.4లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్న ప్రసాదాలను స్వీకరించారు.

  • ‘హెల్మెట్‌ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి’

    ఎన్టీఆర్: నందిగామ నుంచి బైక్‌పై ఇబ్రహీంపట్నం వెళ్తుండగా పవన్‌కు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అయితే హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని అతను చెప్పారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా ధరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పోలీస్ నిబంధలను పాటించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించాడు. హెల్మెట్ వల్లే తాను సంతోషంగా ఉన్నానని పవన్ తెలిపారు.

     

  • గంజాయి కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్‌

    ఎన్టీఆర్: కంచికచర్లలో గంజాయి కలిగి ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని వసంత కాలనీకి చెందిన రాజేష్(26), నందిగామ టౌన్ BC కాలనీకి చెందిన ఆకాష్(26)లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.3కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరికి రాజముండ్రికి చెందిన నిరంజన్ రాజు అనే వ్యక్తి అమ్మినట్లు కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు.

  • మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులదే బాధ్యత..!

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తనిఖీలలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లకు సీఐ చంద్రశేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. అవగాహన లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి భవిష్యత్తు నాశనం అవుతుందని, పూర్తి శిక్షణ తీసుకున్న తర్వాత లైసెన్స్ పొంది వాహనాలు నడపాలని మైనర్లకు అవగాహన కల్పించారు.

  • 80 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం… మిస్సింగ్ కేసు నమోదు

    ఏలూరు: నూజివీడు పట్టణంలోని కుమ్మరీపేటకు చెందిన 80 ఏళ్ల కోసూరి వెంకటేశ్వరరావు అనే వృద్ధుడు మంగళవారం అదృశ్యమయ్యాడు. ఏలూరులో నివసించే తన కూతురు ఇంటికి బయలుదేరారు. ఆ తర్వాత ఆయన కనిపించకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించి చూశారు. ఎటువంటి సమాచారం దొరకకపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • 1 నుంచి జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు

    కృష్ణా: బంటుమిల్లి ZCDS ప్రాజెక్టు పరిధిలో CDPO సముద్రేణ్ణి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించనున్నారు. కృత్తివెన్ను మండలం లక్మిపురం పంచాయతీలో సూపర్ వైజర్ ఝన్సీ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. గర్భిణీలు, బాలలకు పౌష్టికాహార ప్రయోజనాలు, మునగాకు, కరివేపాకు ప్రయోజనాలు, అంగన్వాడిలో ఉచిత పోషక ఆహారాలు వివరించారు. పెరట్లో ఆకుకూరలు, కూరగాయలు పండించి తినాలని సూచించారు.