Locations: Krishna

  • ‘టీడీపీ దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైంది’

    ఎన్టీఆర్: టీడీపీ దళితులకు, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమైన పార్టీ అని మరోసారి రుజువందని వైసీపీ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు పచ్చిగోళ్ళ పండు అన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో సగం భాగమైన ఇబ్రహీంపట్నంలో అంతమంది ప్రజాస్వామ్యంగా ఎన్నుకొని విజయం సాధించిన కౌన్సిలర్స్ ఉండగా కనీసం ఒక వైస్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు.

     

  • ‘గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి’

    ఎన్టీఆర్: జి.కొండూరులో మండల పరిషత్ సమావేశం ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ అధ్యక్షతన జరిగింది. వివిధ శాఖల అధికారులు సమస్యలను వివరించగా, ఇరిగేషన్ అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మి తిరుపతమ్మ మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యల పరిష్కార దిశగా అందరూ కలిసి ముందుకు వెళ్లాలని, పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెంపు, వర్షాకాల జాగ్రత్తలపై అధికారులకు సూచించారు.

     

     

  • 18 హాస్టల్స్ అభివృద్ధి చేశాం: ఎమ్మెల్యే మండలి

    కృష్ణా: డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నిధులతో రూ.2.64కోట్లతో అవనిగడ్డ నియోజకవర్గంలో 18 వసతి గృహాలు అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. నాగాయలంకలో బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. రూ.15.50లక్షలతో హాస్టల్ మరమ్మతులు, పెయింటింగ్ చేశామని, గత ప్రభుత్వంలో సున్నం కూడా వేయలేదని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఫండ్స్ మంజూరు చేసిన కలెక్టర్ డీకే బాలాజీకి ధన్యవాదాలు తెలిపారు.

  • ‘మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలి’

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీని అందరూ సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య సూచించారు. కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ ఛైర్మన్లు కరిమికొండా శ్రీలక్ష్మి, చుట్టుకుదురు శ్రీనివాస్‌లను తన కార్యాలయంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

  • ‘కార్మికుల సార్వత్రిక సమ్మెకు సహకరించండి’

    ఎన్టీఆర్: జులై 9వ తేదీన లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోరుతూ మంగళవారం కొండపల్లి సీపీసీ యాజమాన్యానికి సీఐటీయు జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల కార్యదర్శి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

  • ‘టీడీపీ అన్నీ కమిటీలు త్వరగా పూర్తి చేయాలి’

    కృష్ణా: పెడన నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గోపు సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచనతో గ్రామ పంచాయతీలలో టీడీపీ గ్రామకమిటీలు, బూత్ కన్వీనర్, క్లస్టర్ కన్వీనర్, అనుబంధ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తిచేయాలని సత్యనారాయణ ఆదేశించారు.

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించాలి : రాఘవులు

    ఎన్టీఆర్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని భారత్ ఖండించాలని CPM పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ ఈ యుద్ధం తీవ్రమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతగులుతుందన్నారు. ఇజ్రాయెల్ దేశానికి భారత్ మద్దతు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే 10% క్రూడాయిల్ ధరలు పెరిగాయని, కేంద్రం పునారాలోచించాలని హితవు పలికారు. అమెరికా చెప్పిన విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

  • వైసీపీ పాలనలో అభివృద్ధిని అటకెక్కించారు: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధిని అటకెక్కించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆమె కార్యాలయంలో కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామం నుంచి వైసీపీని వీడి కూటమి పాలనకు ఆకర్షితులై 52కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరిని కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కోగంటి వెంకటసత్యనారాయణ, ఎమ్మెల్యే పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

  • ‘ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత’

    కృష్ణా: ఈనెల 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై కూటమి నేతలతో సమావేశమయ్యారు. ప్రజల ఆరోగ్యమే మన ప్రభుత్వ ప్రాధాన్యత అని, అందుకే ప్రతిఒక్కరూ యోగా దినోత్సవంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

  • బంటుమిల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

    కృష్ణా: బంటుమిల్లి మండల ప్రజా పరిషత్ సమావేశం ఎంపీపీ వెలివెల చిన్నబాబు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో జగనన్న కాలనీలో నీటి నిల్వ సమస్యపై ఎంపీటీసీ కమల్ భాష చర్చించగా, హౌసింగ్ ఏఈ మణికంఠ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. స్మశానవాటిక సమస్యపై చర్చించగా.. త్వరలోనే పనులు మొదలు పెడతామని చెప్పారు. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్, ఐసీడీఎస్ శాఖ అంశాలపై చర్చించారు.