Locations: Krishna

  • ‘తల్లికి వందనం’తో విద్యార్థుల కళ్లల్లో ఆనందం: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: ఎమ్మెల్యే రాజగోపాల్‌వర్మ తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ పథకాలలో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసిందన్నారు. విద్యార్థుల కళ్లల్లో ఆనందాన్ని చూడటం కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. చదువుకునే పిల్లలకి తల్లికి వందనంతో పాటు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్‌లు, తదితర వస్తువులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

     

  • ‘జల యోగా’ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

    కృష్ణా: జల యోగా ఈవెంట్‌కు మత్స్యకారులు, చిన్నారులు హాజరు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో బుధవారం నిర్వహించబోయే ‘జల యోగా’ ఈవెంట్ ఏర్పాట్లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.హరనాథ్, ఆయుష్ విభాగం వైద్యాధికారులు, మత్స్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

  • కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుంది: ఎమ్మెల్యే నల్లిమిల్లి

    ఎన్టీఆర్: రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రధాని పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, రాష్ట్రంలో వైసీపీ ఉనికిని కోల్పోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఆర్థిక రంగంలో దేశాన్ని 4వ స్థానానికి తీసుకొచ్చారని ప్రశంసించారు.

  • మల్లవోలులో “మొబైల్ క్యాన్సర్ వ్యాన్” కార్యక్రమం

    కృష్ణా: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సహకారంతో BEL వారి CSR నిధులతో వచ్చిన “మొబైల్ క్యాన్సర్ వ్యాన్” అధునాతన సదుపాయాలు కలిగి వివిధరకాల క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం గూడూరు మండలం, మల్లవోలులో “మొబైల్ క్యాన్సర్ వ్యాన్” క్యాంపు జరిగింది. ఈక్యాంపుకు విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని సహకరించారు.

  • నేడు న్యాయవాదుల విధుల బంద్‌కు పిలుపు

    ఎన్టీఆర్: విజయవాడలో న్యాయవాదులు విధులను బహిష్కరించి బంద్‌ను పాటించాలని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా మంగళవారం పిలుపునిచ్చారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సీఐ, కానిస్టేబుల్ న్యాయవాది జెట్టి ప్రణీత్ కుమార్‌ను అకారణంగా దూషించారు. దీనికి నిరసనగా బంద్ చేపడుతున్నాట్లు ఆయన తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు మెమొరాండం ఇవ్వనున్నట్లు చెప్పారు.

  • ట్రాక్టర్ డ్రైవర్ హత్య.. అదే కారణమా..?

    కృష్ణా: గుడ్లవల్లేరు మండలం పశుబోట్లవానిపాలెంలో రేమల్లి వెంకట్రావు హత్యకు గురయ్యాడు. గ్రామంలోని రోడ్డుపక్కన గాయాలతో పడి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు.  ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకట్రావు సోమవారం మద్యం మత్తులో ట్రాక్టర్ యజమానితో గొడవపడ్డాడని, గొడవే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న గుడ్లవల్లేరు పోలీసులు దర్యాప్తు చేపట్లారు. ట్రాక్టర్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  • కాకాణిపై సోమిరెడ్డి క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్

    ఎన్టీఆర్: విజయవాడ MSJ కోర్టులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఇతర దేశాల్లో ₹1000 కోట్ల ఆస్తులున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన ఈ పిటిషన్ వేశారు. MSJ కోర్టు విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

  • చేయి చేయి కలిపారు.. కాలువలు క్లీన్ చేసుకున్నారు!

    కృష్ణా: పెడన మండలం ఎస్వీపల్లి పంచాయతీ పరిధిలోని దొరిసేవల్లిలో ఇటీవల కురిసిన వర్షానికి పలు పొలాలు ముంపుకు గురయ్యాయి. వర్షపు నీరు సరిగ్గా వెలుపలికి పోక మురుగు కాలువలలో దట్టంగా గురకపుడెక్క పేరుకుని తుట్టి కాడ కారణంగా సాగు నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు రైతులు స్వచ్ఛందంగా మంగళవారం గుర్రపుడెక్క తుట్టి కాడ తొలగింపు పనులు చేపట్టారు.

  • ‘కుల ధృవీకరణ పత్రం అత్యవసరం కాదు’

    కృష్ణా: ‘తల్లికి వందనం’లో సమస్యలుంటే గ్రీవెన్స్ ద్వారా సచివాలయాల్లో సరిచేసుకోవాలని పురపాలక కమిషనర్ సింహాద్రి సమనోహర్, గుడివాడ MPDO విష్ణుప్రసాద్, MEO బి.బాలాజీలు తెలిపారు. బడిలో చదివే ప్రతి పిల్లవానికి పథకం వస్తుందని, కుల ధృవీకరణ పత్రం అత్యవసరం కాదన్నారు. అర్హుల జాబితాలో పేర్లు లేకుంటే సచివాలయాల్లో వెల్ఫేర్ కార్యదర్శులను సంప్రదించి వారిచ్చిన దరఖాస్తు పూర్తిచేసి దానిలో 9అంశాలకు సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు.

  • విజయవాడలో గంజాయి కలకలం

    ఎన్టీఆర్: విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 22.477 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి గంజాయి తరలిస్తున్న సాంబశివరావును అరెస్టు చేశారు. నిందితుడు కిలో ₹2,000కు కొని, చిన్న చిన్న ప్యాకెట్లుగా ₹300-₹700కు తన స్నేహితులకు, తెలిసిన వారికి అమ్మి ఆదాయం సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.