Locations: Krishna

  • పెళ్లిళ్ల బ్రోకర్ల మోసం.. పెళ్లి చేసిన వెంటనే..

    ఎన్టీఆర్: కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో పెళ్లి బ్రోకర్ల మోసం వెలుగులోకి వచ్చింది. అప్పారావు, భవాని అనే బ్రోకర్లు బెంగుళూరుకు చెందిన రాజశేఖర్‌రెడ్డికి ముగ్గురు పిల్లలున్న కొండపల్లి కరుణావతితో పెళ్లిచేశారు. బంధువులకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి హడావుడిగా పెళ్లిచేసి ₹2లక్షలు వసూలు చేశారు. పెళ్లితర్వాత విజయవాడ వచ్చిన కరుణావతి..రాజశేఖర్‌ని వదిలి పారిపోయింది. వివాహం సత్యసాయి జిల్లాలో జరగడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

  • గంజాయి బ్యాచ్ వీరంగం.. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి

    ఎన్టీఆర్: విజయవాడ రూరల్ న్యూ అంబాపురం పైపుల్ రోడ్డు సర్కిల్ సమీపంలో, గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తుండటంతో స్థానికులు వారిలో ఒక యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. విద్యుత్ లైట్లు లేకపోవడంతో రాత్రుళ్లు దొంగతనాలు, మహిళలను వేధిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

  • జోరుగా నకిలీ సిగరెట్ల వ్యాపారం

    ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గ పరిధిలో నకిలీ సిగరెట్లు వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రముఖ బ్రాండ్లతో పోలి ఉండేలా నకిలీ సిగరెట్లు తయారు చేసి వాటిని మార్కెట్లో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. సిగరెట్లలో వాడుతున్న నాసిరకం పొగాకు ప్రజలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుందని, ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

     

  • CEC రాక.. నేటి నుంచి వినతుల స్వీకరణ

    కృష్ణా: కైకలూరులో కొల్లేరు గ్రామాలను సందర్శించనున్న సీఈసీ(కేంద్ర సాధికారత కమిటీ) పర్యటన నేపథ్యంలో, కలెక్టర్ కె.వెట్రిసెల్వి కొల్లేరు పరీవాహక ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి పందిరిపల్లెగూడెం, ఆలపాడు, ఆటపాక తదితర గ్రామాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కొల్లేరు విస్తీర్ణం, సరిహద్దులు, 5వ కాంటూరు పరిధిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం నుంచి ఏలూరు కలెక్టరేట్‌లో కొల్లేరు ప్రాంత వాసుల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.

  • అలర్ట్.. నేడు, రేపు నీటి సరఫరా బంద్

    ఎన్టీఆర్: భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డు, మానవ మందిరం రోడ్డు, క్రాంబ్వే రహదారి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. భవానీపురం లారీ స్టాండు వద్ద తాగునీటి పైపులైన్లకు మరమ్మతు పనుల నిమత్తం ఈనెల 17, 18 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఆయా పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.

     

  • నేడు పెనుగంచిప్రోలు మండల సమావేశం

    ఎన్టీఆర్: ఎంపీపీ మార్కపూడి గాంధీ అధ్యక్షతన నేడు పెనుగంచిప్రోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి. శ్రీను తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో మండల పరిషత్ సభ్యులు, మండల అధికారులు హాజరు కావాలని కోరారు.

  • మతిస్థిమితం లేని భర్తను హతమర్చిన భార్య!

    ఎన్టీఆర్: మతిస్థిమితం లేక అనారోగ్యంతో ఉన్న భర్తను చల్లపల్లి నారాయణరావునగర్‌లో కర్రతో కొట్టి హతమార్చిన భార్య బోలెం మంగమ్మను సోమవారం సీఐ కె.ఈశ్వరరావు అరెస్టు చేశారు. మొవ్వ కోర్టులో హాజరుపర్చగా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

  • రేపు మెగా ఉచిత వైద్య శిబిరం

    కృష్ణా: కంకిపాడు మండల కేంద్రంలో రేపు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. పెనమలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఈనెల 18న ఉదయం 10గంటల నుంచి ఈ శిబిరం నిర్వహించనున్నట్లు ఏఎంసీ అధ్యక్షుడు అన్నే ధనరామకోటేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పరిసర ప్రాంత ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • నేడు బంటుమిల్లి మండల సర్వసభ్య సమావేశం

    కృష్ణా: బంటుమిల్లి మండల పరిషత్తు కార్యాలయంలో నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీపీ వెలివెల తారా శశిజ్యోత్స్న కృష్ణ అధ్యక్షతన మంగళవారం ఉదయం సమావేశం జరుగుతుందని ఇన్‌ఛార్జి ఎంపీడీవో నీరజాక్షి తెలిపారు. అధికారులు శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తదితరాల గురించి వివరిస్తారని చెప్పారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

  • 30న డాక్ అదాలత్.. ‘సద్వినియోగం చేసుకోండి’

    కృష్ణా: విజయవాడ పోస్టల్ రీజియన్ వారి ఉత్తర్వుల మేరకు డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈనెల 30వ తేదీన మచిలీపట్నంలో పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డాక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు మచిలీపట్నం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.