Locations: Krishna

  • ట్రాక్టర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో సోమవారం ప్రమాద ఘటన జరిగింది. ఇటుక బట్టిలకు మట్టి తరలించే క్రమంలో ట్రాక్టర్ పల్టికొట్టింది. అతివేగంగా రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు అన్నారు. దీంతో డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. కాగా టక్టర్ల వేగానికి భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ‘నేరస్తులను 24 గంటల్లో పట్టుకోవాలి’

    ఎన్టీఆర్: బందర్ రోడ్డులోని పాత కంట్రోల్ రూమ్ భవనంలో అధునాతన సౌకర్యాలతో పునఃనిర్మించిన మహిళా పోలీసుస్టేషన్‌ను నగర పోలీసు కమిషనర్ రాజశేఖర బాబు ప్రారంభించారు. అధికారుల రూములు, కోర్ట్ రూమ్, మహిళా హెల్ప్‌డెస్క్, కౌన్సిలింగ్ సెంటర్, చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ వంటి సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. మహిళలు,బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసుస్టేషన్‌లను ఏర్పాటు చేశామన్నారు. నేరస్థులను 24గంటల్లోనే గుర్తించాలని కమిషనర్ సూచించారు.

  • ‘తల్లికి వందనం’ డబ్బులు కోసం తల్లుల తంటాలు!

    కృష్ణా: తల్లికి వందనం నగదు డ్రా చేసేందుకు గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు తల్లులు బారులు తీరారు. ఒక్కసారిగా ఖాతాదారులు పోటెత్తడంతో పోస్టల్ సర్వర్ డౌన్ అయ్యింది. డబ్బులు అందించడంలో పోస్టల్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నగదు డ్రా చేసేందుకు పోస్టల్ కార్యాలయంలో మహిళలు వేచి ఉండడంతో.. ఇతర కార్యాలపాలకు ఆటంకం కలుగుతుందంటున్నారు. దీనిపై పోస్టల్ అధికారులు స్పందించడం లేదంటూ మహిళలు విమర్శించారు.

     

  • సీమ రాజాపై చర్యలు తీసుకోవాలి : కోన నాగార్జున

    కృష్ణా: వైసీపీ కండువా మెడలో వేసుకుని, వైసీపీ నాయకుల భార్యలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న సీమ రాజాపై చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం భారత చైతన్య యువజన పార్టీ నాయకుడు కోన నాగార్జున డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ గంగాధరరావుని కలిసి ఫిర్యాదు చేశారు. సీమరాజా మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై తీవ్రంగా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు.

  • MLA వసంతకృష్ణ “చవట సన్నాసి దద్దమ్మ”: జోగి రమేష్

    కృష్ణా: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇనాక్టివ్‌గా ఉన్నారని, చంద్రబాబు ఆయన గొంతు నొక్కుతున్నారని YCP  మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. BIG Tvతో ఆయన మాట్లాడుతూ..పవన్ తమతో కలిసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందని, సీల్డ్ కవర్‌లో ఏముందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వసంతకృష్ణను “చవట సన్నాసి దద్దమ్మ” అని దూషించారు.

  • చంద్రబాబు ఏడాది పాలనంతా మోసమే: YCP

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ నేతలతో కలిసి వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుపరిపాలన కాదు సూపర్ సిక్స్‌కు ఎగనామం పెట్టిన పాలన అని ఎద్దెవా చేశారు. చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసమేనని ఆరోపించారు.

  • జోగి రమేష్ మళ్లీ ఓడిపోతాడు.. ఎమ్మెల్యే వసంత జోస్యం

    గుంటూరు: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అమరావతిలోBIG Tvతో మాట్లాడుతూ.. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి తాను అత్యధిక మెజారిటీతో గెలిచానని అన్నారు. గతంలో చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పుడు పరిస్థితి వేరని, ఇప్పుడు ఆయన బయలుదేరితేనే తమ పవర్‌ చూపిస్తామని హెచ్చరించారు. జోగి రమేష్ చాలాసార్లు ఓడిపోయాడని, మళ్లీ ఎన్నిక జరిగినా ఓడిపోతాడని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

     

  • మూడేళ్ల నిరీక్షణకు తెర.. జెండా ఎగురవేసిన TDP

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. టీడీపీ కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి వైస్ ఛైర్మన్1గా, టీడీపీ కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు వైస్ చైర్మన్ 2గా ఎన్నికయ్యారు. కోర్టు ఆదేశాలతో సీల్డ్ కవర్‌లో ఈ ఎన్నిక నిర్వహించారు. తొలిసారిగా జరిగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసింది.

  • రేపు జి.కొండూరు మండల సర్వసభ్య సమావేశం

    ఎన్టీఆర్: జి.కొండూరు మండల సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 17వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వి.లక్ష్మి తిరుపతమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ రామకృష్ణ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి సభ్యులు, అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.

  • ఎంపీ ఓటు చెల్లుతుందా? లేదా?: వైసీపీ డిమాండ్

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎంపీ కేశినేని నాని ఎక్స్-అఫీషియో ఓటు చెల్లుబాటుపై వైసీపీ కౌన్సిలర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితం ప్రకటించొద్దని, 24 గంటలు సమయం ఇచ్చి కోర్టుకు వెళ్లే అవకాశం కల్పించాలని గుంజ శ్రీనివాస్, జోగి రాము డిమాండ్ చేశారు. ప్రిసైడింగ్ అధికారి చైతన్య ఛాలెంజ్ చేసుకోవాలని సూచించగా, ఎమ్మెల్యే వసంత ఆదేశాల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.