Locations: Krishna

  • BREAKING: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ కైవసం

    ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబు 16 ఓట్లతో ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి వైస్ ఛైర్మన్ 1గా, టీడీపీ కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు వైస్ ఛైర్మన్ 2గా ఎన్నికయ్యారు.

  • ఉత్కంఠ రేపుతున్న కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్‌లు ఆసీనులయ్యారు. ఎక్స్-అఫీషియో ఓటుతో వైసీపీ వైపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూర్చున్నారు. గత మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రకారం సీట్లు కేటాయించారు. ఇప్పటికే 14 మంది టీడీపీ, 9 మంది వైసీపీ, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయానికి చేరుకున్నారు.

  • నేడు జైలు నుంచి కొమ్మినేని విడుదల!

    గుంటూరు: అమరావతి మహిళలను కించపరిచారన్న అభియోగంపై అరెస్టయిన కొమ్మినేని శ్రీనివాసరావు (KSR) నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, కోర్టు సెలవుల కారణంగా ఆయన విడుదల ఆలస్యమైంది. ఈరోజు బెయిల్ ఉత్తర్వులు అందితే, సాయంత్రానికి ఆయన బయటకొచ్చే అవకాశం ఉందని లాయర్లు తెలిపారు.

  • హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని, కిట్టు

    కృష్ణా: నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. తొందరపాటు చర్యలు నిలువరించాలని, విచారణకు సహకరిస్తామని, అయితే అరెస్టు చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

  • కొండపల్లికి వచ్చిన ‘సీల్డ్ కవర్’

    ఎన్టీఆర్ జిల్లా: మైలవరం సబ్ ట్రెజరీ కార్యాలయం నుండి కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన సీల్డ్ కవర్‌ను అధికారులు పోలీసులు బందోబస్తు మధ్య కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించారు. ఈ సీల్డ్ కవర్‌తో కమిషనర్ వాహనం కొండపల్లి చేరుకుంది. సీల్డ్ కవర్‌లో న్యాయంస్థానం ఏమి తీర్పు ఇచ్చిందోనని జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

  • నేడు తేలనున్న కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక భవితవ్యం

    ఎన్టీఆర్ జిల్లా: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక భవితవ్యం నేడు తేలిపోనుంది. హైకోర్టు సీల్డ్ కవర్‌లో ఏముందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న జరగాల్సిన ఎన్నిక అనివార్యంగా వాయిదా పడింది. గత మూడేళ్లుగా ఈ ఎన్నికకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అధికారులు కౌన్సిలర్ల సమక్షంలో సీల్డ్ కవర్‌ను తెరవనున్నారు.

  • మట్టి గణపయ్య నిర్మాణానికి నేడు శంకుస్థాపన

    ఎన్టీఆర్: విజయవాడలో 72అడుగుల మట్టి గణపయ్య నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు. డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని నెలకొల్పబోతున్నారు. విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపో పక్కన ఉన్న లేబరుకాలనీ మైదానంలో విగ్రహ నిర్మాణానికి సంబందించిన భూమి పూజ కార్యక్రమం ఉదయం 9.55 గంటలకు చేయనున్నట్లు డూండీ గణేష్ సేవా సమితి నిర్వాహకులు డూండీ రాకేష్ వెల్లడించారు.

  • సమస్యల పరిష్కారానికై PGRS

    ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్యలపై ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికై ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

  • జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

    కృష్ణా జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై మచిలీపట్నం హిందూ కళాశాలలో ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎస్ ఏపీఎం ఆర్.శ్యాంసుందరరావు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన 250 మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

  • పీఠం దక్కేదెవరికో..?

    ఎన్టీఆర్: కొండపల్లి పురపాలక సంఘం ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల సీల్డ్ కవర్ ప్రకటన ఈరోజు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆర్డీఓ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ రమ్యకీర్తన తెలిపారు. 2021 నవంబర్‌లో కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.