ఎన్టీఆర్: సంవత్సర కాలం పాటు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పాలన చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. వరదలు వచ్చి విజయవాడ మునిగితే ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. 30లక్షల మంది తల్లులకు తల్లికి వందనం ఎగొట్టారని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి రెడ్‌బుక్ చూపించి బయపెడుతున్నారని మండిపడ్డారు. మీరు ఏ సవాల్ విసిరిన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
Locations: Krishna
-
‘లోకేశ్ సవాల్‌ను ఎదుర్కొనే ధైర్యం లేదు’
ఎన్టీఆర్: తల్లికి వందనం పథకంపై మాజీ సీఎం జగన్ సహా వైసీపీ మూకలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిజాయితీగా, ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి బిడ్డకు తల్లికి వందనం అమలు చేస్తూ తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసిందన్నారు. నారా లోకేశ్ సవాల్‌ను ఎదుర్కొనే ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదన్నారు.
-
కొండపల్లిలో అట్టహాసంగా కూటమి ర్యాలీ
ఎన్టీఆర్: ప్రతిష్ఠాత్మక గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార మహోత్సవ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. కొండపల్లిలోని ఎన్టీఆర్, రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా ర్యాలీకి తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలతో, కార్లలో ప్రమాణం స్వీకారానికి గొల్లపూడి సభా వేదికకు తరలివెళ్లారు.
-
ఘనంగా తంగిరాల ప్రభాకరరావు విగ్రహావిష్కరణ
ఎన్టీఆర్: నందిగామ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ తంగిరాల ప్రభాకర రావు 11వ వర్ధంతిని పురస్కరించుకొని నందిగామలోని స్మారక ఘాట్ వద్ద ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. రైతుపేటలో ఘనంగా ప్రభాకరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
-
ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలోని గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ మోగులూరి ఎలీషా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలియజేశారు. ఫాదర్స్ డే సందర్భంగా కొంత మంది తండ్రులను శాలువాలతో సన్మానించారు.
-
మచిలీపట్నంలో తెలుగు మహిళల ఆందోళన
కృష్ణా: అమరావతిపై సాక్షిలో అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మచిలీపట్నంలో మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలుగు మహిళా విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వందలాదిగా మహిళలు పాల్గొన్నారు. సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన జగన్,భారతిరెడ్డి తక్షణం క్షమాపణలు చెప్పాలని, అమరావతిపై విషప్రచారం చేస్తున్న సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
-
‘మురుగునీటి పారుదలకు చర్యలు’
కృష్ణా: బంటుమిల్లి మండలం అముందాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు గ్రామ ప్రజల సహకారంతో మురికి డ్రెయిన్ బాగు చేసి తూముల ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీ ఛైర్మన్ బొర్రా కాశీ, అముందాలపల్లి సంఘ అధ్యక్షులు అబ్బూరి కిరణ్, ములపర్రు సంఘ అధ్యక్షులు చింత వెంకటేశ్వరరావు, రైతు నాయకులు గొట్టిపాటి శ్రీనివాసరావు, గొట్టిపాటి హరికాంత్, రైతులు పాల్గొన్నారు.
-
టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ
కృష్ణా: పెడన నియోజకవర్గం పుల్లపాడు గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు టీడీపీ సభ్యత్వం కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పడమట గంటయ్య, డీసీ వైస్ ఛైర్మన్ గూడవల్లి భద్రాచలం, పడమట నాగరాజు, పెడన మండలం బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మురాల ఫణి కుమార్, చిల్లి మంత మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకే..
కృష్ణా: ఈనెల 16న సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
-
‘పారిశుద్ధ్య పనులు చేపట్టండి’
కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గ్రామాల్లోని పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పెడన మండల అభివృద్ధి అధికారిణి అరుణ కుమారి శనివారం పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వర్షం నీరు ఎక్కడ నిల్వ లేకుండా చూడాలని, గ్రామ వీధుల్లో బ్లీచింగ్, పిచికారి చేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లోని ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సహకరించాలని కోరారు.