Locations: Krishna

  • ‘చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల పేర్లు చరిత్రలో మిగిలిపోతాయి’

    కృష్ణా: తల్లికి వందనం పథకం డబ్బులు రూ.13వేల చొప్పున ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్ధులుంటే అంత మందికి తల్లుల అకౌంట్లలో జమ కావడం పట్ల గుడివాడలో మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గుడివాడ జనసేన నాయకులు పవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన‌కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల పేర్లు చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతాయని కొనియాడారు.

     

  • అప్పుడు ఇరిగేషన్ శాఖ ఎక్కడ కనిపించలేదు: ఎమ్యెల్యే

    ఎన్టీఆర్: గత ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖ ఎక్కడ కనిపించలేదని ఎమ్యెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ శాఖను గత ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయలనుకుందని ఆరోపించారు. అవనిగడ్డ తీర ప్రాంతంలో సాగునీరు కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

  • కృష్ణా తూర్పు డెల్టాకు నీటి విడుదల

    ఎన్టీఆర్: కృష్ణా తూర్పు డెల్టాకు 1000 క్యూసెక్కుల సాగు, త్రాగునీటిని జిల్లా కలెక్టర్ లక్ష్మిషా, ఎమ్యెల్యేలు బోండా ఉమ, వెంకటరావు, మండలి బుద్ధ ప్రసాద్ విడుదల చేశారు. రైతులకు నీటి సరఫరా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

  • ‘ఇంకా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదు’

    క‌ృష్ణా: రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని, ‘తల్లికి వందనం’పై వైసీపీ ఆరోపణలను ఖండించారు. వైసీపీ నేతలకు సిగ్గు లేదని విమర్శించారు.

  • ప్రతి తల్లి కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొల్లు

    క‌ృష్ణా: ప్రతి తల్లి కళ్లల్లో ఆనందం చూడాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రతి తల్లి ఖాతాకు ‘తల్లికి వందనం’ సొమ్ము జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా మార్చి, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా పెంచుతున్నామని వెల్లడించారు.

  • పెడనలో 17 మందిపై కేసు నమోదు

    కృష్ణా: పెడన పట్టణంలో శనివారం రాత్రి పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆదివారం తెలిపారు. పేకాట, కోడిపందాలు, చిత్తూలాటలపై సమాచారం ఇవ్వాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • VIDEO: విజయవాడలో పార్కింగ్ దోపిడీ

    ఎన్టీఆర్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పార్కింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నో పార్కింగ్ జోన్‌లో కూడా వాహనాలు పెట్టి ఇష్టానుసారంగా ప్రజల ముక్కు పిండి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దుర్గమ్మ భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. పార్కింగ్ ఫీజు పేరుతో వందల సంఖ్యలో భక్తుల వద్ద నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారని, వారి అరాచకాలు నుంచి కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

  • గన్నవరం చేరుకున్న పీయూష్ గోయల్

    కృష్ణా: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గన ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి బయలు దేరి వెళ్లారు.

  • కొల్లు రవీంద్రపై పేర్ని కిట్టు ఆగ్రహం

    కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నం వైసీపీ నేత పేర్ని కిట్టు మండిపడ్డారు. కొల్లు రవీంద్ర మర్డర్ కేసు ముద్దాయిలా మాట్లాడుతున్నారని, కార్యకర్తల సమావేశంలో నిజాలు మాట్లాడి తమపై పెడుతున్న కేసులు వివరిస్తుంటే హడావుడిగా తన భాగోతం బయటపడుతుందని, తనకు వచ్చే కమిషన్‌ల గురించి ఎక్కడ బయటకు తెలుస్తుందో అని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

  • బెజవాడలో పెళ్లి పేరుతో మోసం

    ఎన్టీఆర్: పెళ్లి పేరుతో బెజవాడలో ఘరానామోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ మధ్యవర్తుల ద్వారా కర్ణాటకకు చెందిన గుణం దుర్గాప్రసాద్‌.. పల్లవిని వారం క్రితం దుర్గమ్మ సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో పల్లవికి దుర్గాప్రసాద్ రూ.4.5 లక్షలు ఇచ్చాడు. అయితే పెళ్లి తర్వాత పల్లవికి గతంలో వివాహం జరిగిందని, ఒక బిడ్డ కూడా ఉందని తెలిసి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.