Locations: Krishna

  • ట్రాఫిక్ నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

    కృష్ణా: గుడివాడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కొత్తగా ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గంగాధర రావుని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ పట్టణంలో ప్రజల సౌకర్యానికి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

  • ‘రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి’

    ఎన్టీఆర్: రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లిలోని బీపీసీఎల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ డా.వెలగా జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

  • గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరక్టర్‌గా రాధిక

    ఎన్టీఆర్: గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరక్టర్‌గా జనసేన నాయకరాలు చెరుకుమల్లి రాధిక నియమితులయ్యారు. కూటమి సర్దుబాటులో రాధికకు ఈ పదవి దక్కింది. జనసేన కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు సురేష్‌ సతీమణి రాధిక, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. డిప్యూటీసీఎం పవన్‌కళ్యాణ్, నాయకులకు ధన్యవాదాలు తెలిపిన రాధిక, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

  • ‘ఆ ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీల సంఖ్యను పెంచాలి’

    కృష్ణా: మచిలీపట్నం-బీదర్ ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని సీపీఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. శనివారం రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని అదనపు బోగీలు ఏర్పాటు చేయాలన్నారు.

  • పేర్నినాని అనుచిత వ్యాఖ్యలను ఖండించిన రెవెన్యూ అసోసియేషన్

    కృష్ణా: రెవెన్యూ ఉద్యోగులపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఇటీవల పేర్ని నాని తన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర దగ్గర అధికారిక పీఏగా పనిచేస్తున్న తోట శివరామకృష్ణపై పేర్నినాని నిరాధారమైన అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత దూషణలు చేశారు. దీన్ని అసోసియేషన్ ఖండించింది.

     

  • ‘బాధితులకు భరోసా సీఎం సహాయనిధి’

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కె.అగ్రహారం గ్రామంలో 11 మంది అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సీఎం సహాయ నిధి రూ.4,07,164 చెక్కులను అందజేశారు. బాధితుల ఆవేదనను తెలుసుకున్న తాతయ్య, ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేయగా, శనివారం నాడు నిధులు మంజూరయ్యాయి. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఆ చెక్కులను అందించారు.

  • ఒడిశాలో కొనుగోలు.. ఏలూరులో అమ్మకం!

    ఎన్టీఆర్: విసన్నపేటలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆత్కూరి ప్రిన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తిరువూరు సీఐ గిరిబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1కేజీ 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి విజయవాడ, ఏలూరు ప్రాంతాల్లో ప్యాకెట్‌ రూ.500కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

  • షైనింగ్ స్టార్స్‌కు నగదు బహుమతులు

    ఎన్టీఆర్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నేను అండగా ఉంటానని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు భరోసా కల్పించారు. షైనింగ్ స్టార్స్-2025 పేరిట పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి, మొత్తం 130 మందికి రూ.7.40లక్షల ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు.

  • ‘పేదలను ఆదుకోవడమే లక్ష్యం’

    ఎన్టీఆర్: పేదలను ఆదుకోవడమే ఆర్యవైశ్య సేవా సంఘం లక్ష్యమని సంఘ అధ్యక్షుడు మద్దాళి శ్రీనివాస్ కుమార్ అన్నారు. గొల్లపూడి సెంటర్‌లో శనివారం నిర్వహించిన మజ్జిగ పంపిణీ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చడం అదృష్టంగా బావిస్తున్నానన్నారు. గత 45రోజులుగా రోజుకు సుమారు 3వేల మందికిపైగా బాటసారులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేసినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మావతి తెలిపారు.

  • ‘మురుగు’కు చెక్ పెట్టిన మున్సిపల్ అధికారులు

    ఎన్టీఆర్: కొండపల్లి పట్టణంలోని ఖిల్లా రోడ్డు సెంటర్‌లో జాతీయ రహదారిపై మురుగు నీటి సమస్యను మున్సిపల్ అధికారులు పరిష్కరించారు. గత 20రోజుల నుంచి ఖిల్లా రోడ్డు ప్రాంతంలో నుంచి వచ్చే మురుగు నీరుతో దుర్గంధం వ్యాపించడంతో ఆ పరిసరాల్లో నిలబడలేని దుస్థితి ఏర్పడింది. ఈ సమస్యను స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు మురుగు నీటి సమస్యకు పరిష్కారం చూపారు.