Locations: Krishna

  • కొండపల్లి ఖిల్లాలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం

    ఎన్టీఆర్: కొండపల్లి ఖిల్లాలో ఏపీ టూరిజం, ఏపీ ngo’s, కొండపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ జి.లక్ష్మీషా, జేసీ అలేఖ్య, ఏపీ ngo’s రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరిలో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి, జిల్లాలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కొండపల్లి ఖిల్లాలో యోగా కార్యక్రమము నిర్వహించామని కలెక్టర్ అన్నారు.

  • సెలవు దినాల్లోనూ అందుబాటులో!

    ఎన్టీఆర్: రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని సూర్యారావుపేట ఎస్ఈ తోట శ్రీనివాసరావు తెలిపారు. ఆరెండు రోజుల్లో వినియోగదారులు తమ విద్యుత్తు బిల్లులు చెల్లించాలని కోరారు. ఏపీ-సీపీడీసీఎల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సర్వీసు నెంబరును రిజిస్టర్ చేసుకుని బిల్లులను చెల్లించవచ్చన్నారు. గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్‌పే, బిల్‌డెస్క్‌యాప్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చన్నారు.

  • మహిళలకు ఉచిత శిక్షణ.. ‘దరఖాస్తు చేసుకోండి’

    ఎన్టీఆర్: జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు  డైరెక్టర్ ఎ.పూర్ణిమ తెలిపారు. బ్యూటీకేర్ అసిస్టెంట్, హెయిర్‌డ్రెస్సర్, సెలూన్ సర్వీస్ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 15-45 సంవత్సరాల వయసుగల మహిళలు అర్హులని, ఆసక్తి గలవారు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్‌కార్డు తీసుకుని ఈనెల 17వ తేదీలోపు విజయవాడ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్లోని తమ సంస్థ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

    K

  • కారులో మృతదేహం లభ్యం

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలం కందులపాడు అడ్డరోడ్డు వద్ద కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మృతుడు రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామానికి చెందిన అన్నెబోయిన నాగరాజు(35)గా పోలీసులు గుర్తించారు. జేసీబీ డ్రైవ‌ర్‌గా పని చేసే నాగరాజు గత రెండు సంవత్సరాలుగా జి.కొండూరు మండలం వెలగలేరు కుటుంబంతో నివాసముంటున్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

  • నేడు పవర్ కట్.. ప్రాంతాలివే?

    కృష్ణా: పెనమలూరు మండలం కానూరులోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ హరిబాబు తెలిపారు. కానూరు సర్కిల్ పరిధిలో తోటలు, పెదబావి సెంటర్, యాదవులబజారు, రంగాబొమ్మ సెంటర్, ఓల్డేజ్ హోమ్, రాజ్కామరియా, కెనడీ స్కూల్, కామయ్యతోపు సెంటర్, జేఆర్డీ పారిశ్రామికవాడ ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

  • తల్లికి వందనం @రూ.39 వేలు

    కృష్ణా: తల్లికి వందనం ద్వారా తన ముగ్గురు పిల్లలకు రూ.39 వేలు ఇచ్చినట్లు పెడనకు చెందిన మహిళ ఆనందాన్ని వ్యక్త పరిచింది. శుక్రవారం టీడీపీ 20వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కొసనం కరుణ కుమారి లబ్ధిదారునికి అందజేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మహిళ హర్షం వ్యక్తం చేసింది. ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడింది.

     

  • మైలవరం అభివృద్ధికి సహకరించండి: వసంత

    ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టరుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలక్కియను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శుక్రవారం కలిశారు. విజయవాడలోని జేసీ కార్యాలయంలో ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

  • పేర్ని నానిపై పోలీస్ అధికారుల సంఘం ఫైర్

    కృష్ణా: రేషన్ బియ్యం దుర్వినియోగం కేసులో విచారణాధికారిపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పేర్ని నాని సతీమణి జయసుధను న్యాయస్థానం ఆదేశాల మేరకే విచారణాధికారి విచారించారన్నారు. విచారణ సమయంలో తన భార్యను ఇబ్బంది పెట్టారని నిందలు వేయడం సరికాదన్నారు. ఏకవచనంతో మాట్లాడుతూ విచారణాధికారిని బెదిరించారని జిల్లా అధ్యక్షులు జయపాల్ అన్నారు.

  • ముగిసిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ

    కృష్ణా: మచిలీపట్నంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 2,780 మంది ఉపాధ్యాయులను కౌన్సిలింగ్ ద్వారా అధికారులు బదిలీ చేశారు. మున్సిపల్ SGTలు 54 మంది, మున్సిపల్ కార్పొరేషన్ SGTలు 429 మంది, జెడ్పీ SGTలు 2,297 మందిని బదిలీ చేసినట్టు DEO రామారావు తెలిపారు.

  • ‘దివి ఎడమ కరకట్ట అభివృద్ధికి రూ.2.9 కోట్లు’

    కృష్ణా: అవనిగడ్డ దివి ఎడమ కరకట్ట అభివృద్ధికి రూ.2.49కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సమస్య తీవ్రతను సభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. తద్వారా ప్రభుత్వం కోడూరు మండలం ఉల్లిపాలెం బ్రిడ్జి వద్ద దివి లెఫ్ట్‌ఫ్లడ్ బ్యాంక్ నుంచి హంసలదీవి పుష్కర ఘాట్ వరకు కృష్ణానది కరకట్టను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసిందని వివరించారు.