ఏలూరు: నూజివీడు పట్టణంలోని కుమ్మరీపేటకు చెందిన 80 ఏళ్ల కోసూరి వెంకటేశ్వరరావు అనే వృద్ధుడు మంగళవారం అదృశ్యమయ్యాడు. ఏలూరులో నివసించే తన కూతురు ఇంటికి బయలుదేరారు. ఆ తర్వాత ఆయన కనిపించకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించి చూశారు. ఎటువంటి సమాచారం దొరకకపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Locations: Krishna
-
1 నుంచి జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు
కృష్ణా: బంటుమిల్లి ZCDS ప్రాజెక్టు పరిధిలో CDPO సముద్రేణ్ణి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించనున్నారు. కృత్తివెన్ను మండలం లక్మిపురం పంచాయతీలో సూపర్ వైజర్ ఝన్సీ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. గర్భిణీలు, బాలలకు పౌష్టికాహార ప్రయోజనాలు, మునగాకు, కరివేపాకు ప్రయోజనాలు, అంగన్వాడిలో ఉచిత పోషక ఆహారాలు వివరించారు. పెరట్లో ఆకుకూరలు, కూరగాయలు పండించి తినాలని సూచించారు.
-
ఆనందపురంలో ఫ్రీ మెడికల్ క్యాంప్
కృష్ణా: ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కొండా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆనందపురంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు వెంకట్రామ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత గొల్లనపల్లి రవి సహకారంతో వైద్య సామగ్రిని చిన్న ఓగిరాల PHC డాక్టర్లకు అందజేశారు. నాదెళ్ల సాంబశివరావు, మండవ జయదేవ్, పోతిరెడ్డి, గుండే రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.
-
మున్సిపల్ కమిషనర్ లోవరాజు ఆకస్మిక తనిఖీలు
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని 1, 9వ వార్డుల సచివాలయాల్లో మున్సిపల్ కమిషనర్ లోవరాజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ చలాన్ల రూపంలో వచ్చిన నగదును వెంటనే బ్యాంకులో జమ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలు వసూలు చేసి, వంద శాతం పూర్తి చేయాలని కార్యదర్శులకు సూచించారు. సచివాలయ సేవల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరారు.
-
తుర్లపాడు చెరువును పరిశీలించిన కలెక్టర్
ఎన్టీఆర్: నందిగామలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తుర్లపాడు గ్రామ చెరువు పూర్తిగా నిండింది. ఈ నేపథ్యంలో తుర్లపాడు గ్రామ టీడీపీ నాయకుల ఆహ్వానం మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా, చందర్లపాడు మండల తహశీల్దార్, ఇతర అధికారులు చెరువు కట్టను పరిశీలించారు.
-
రీసర్వే చేసిన రికార్డుల పరిశీలన
కృష్ణా: పమిడిముక్కల మండలం మర్రివాడలోని సచివాలయంలో రీ సర్వే చేసిన రికార్డులు, రీ సర్వేపై ప్రజలు ఇచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలు పరిశీలించారు. అనంతరం రైతులు, వివిధ సమస్యలతో వచ్చిన గ్రామ ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు.
-
ఇళ్లల్లో దొంగతనాలు.. వారంలోనే నేరస్థుల అరెస్ట్
కృష్ణా: పక్కింటి వారితో పాటు సొంత బంధువుల ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్న ఇంటి దొంగలను చల్లపల్లి సీఐ ఈశ్వరరావు పట్టుకున్నారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై సుబ్రహ్మణ్యం బృందం దొంగతనం జరిగిన వారం రోజుల్లోనే నేరస్థులను పట్టుకుని వారి వద్ద నుంచి నగలు, వెండి వస్తువులను స్వాధీనపరుచుకోవటంలో కీలక పాత్ర పోషించారు. చల్లపల్లి పోలీసులను ఎస్పీ గంగాధరరావు, అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీలు అభినందించారు.
-
మాజీ మంత్రిని పరామర్శించిన రమేష్ బాబు
కృష్ణా: కాకినాడ రూరల్ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ(83) మృతి పట్ల అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు సంతాపం తెలిపారు. కాకినాడలోని కన్నబాబు నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నబాబును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
-
‘దివిసీమ విద్యా ప్రదాత ఎంవీ కృష్ణారావు’
కృష్ణా: దివిసీమ విద్యా ప్రదాత ఎంవీ కృష్ణారావు అని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డలోని వంతెన సెంటరులో దివిసీమ గాంధీ, ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు మండలి అభిమానులు, శత జయంతి ఉత్సవ కమిటీ, గాంధీ క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి కూటమి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
-
నిత్యాన్నదాన పథకానికి విరాళం
కృష్ణా: మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి తెనాలి వాస్తవ్యులు గాజుల పార్థసారథి–షణ్ముఖ ప్రియా దంపతులు రూ.50,001 విరాళంగా అందజేశారరు. ఈ సందర్భంగా విరాళాన్ని డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేయగా, ఆలయ అధికారులు దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.