Locations: Krishna

  • ‘విద్యార్థి దశలోనే లక్ష్యం పెట్టుకోండి’

    కృష్ణా: విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాన్ని పెట్టుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని విక్యూబ్ ఫౌండేషన్ అధినేత పామర్తి వీర రాఘవులు తెలిపారు. శుక్రవారం గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫౌండేషన్ సభ్యులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుమూడి అంకాలరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • BREAKING: ఫర్నిచర్ షోరూంలో అగ్నిప్రమాదం(VIDEO)

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో గల షా విజన్ ఫర్నిచర్ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్షల విలువ చేసే ఫర్నిచర్ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • పేర్ని నానికి మతిభ్రమించింది : కొల్లు రవీంద్ర

    కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానికి మతిభ్రమించిందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో మాట్లాడుతూ ‘‘అరెస్ట్ భయంతో పిచ్చిపిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నాడు. దొంగపట్టాలు సృష్టించి అమాయక పేదలకు పంచిపెట్టి మోసం చేశారు. నీ భార్య మీద అంత ప్రేమ ఉంటే పేదల బియ్యం బొక్కేవాడివా..? ప్రెస్‌మీట్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నిన్ను చూసి ప్రజలంతా బఫూన్‌లా చూస్తున్నారు’’ అంటూ విమర్శించారు.

  • ‘నేడు ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు’

    ఎన్టీఆర్: ఏపీ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరి తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమచేయటం ప్రారంభించిందన్నారు. ఇది ఆర్థిక సాయం మాత్రమే కాదని.. విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా అని తెలిపారు.

  • ‘మాజీ ఎంపీ అంకినీడు మృతి తీరని లోటు’

    కృష్ణా: చల్లపల్లి రాజా కుమారులు, బందరు మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ మృతి తీరని లోటని గ్రామ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. తొలుత అంకినీడు ప్రసాద్ చిత్రపటానికి సర్పంచ్, వార్డు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చల్లపల్లి రాజా వంశీయులు ప్రభువులుగా, ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవలు చేశారని వారు కొనియాడారు.

  • నీటిపై తేలియాడుతూ యోగాసనాలు

    కృష్ణా: యోగాంధ్ర-2025లో భాగంగా కృష్ణానదిలో శుక్రవారం జల యోగా చేశారు. నాగాయలంక శ్రీరామపాద క్షేత్ర తీరాన యోగా గురువులు నీటిపై తేలియాడుతూ యోగాసనాలు వేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ తిలకించి వారిని అభినందించారు. తహశీల్దార్ హరనాధ్, ప్రముఖులు మండవ బాలవర్దిరావు, తలశిల రఘుశేఖర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

  • కాచవరంలో పక్కా ప్లాన్‌తోనే హత్య: సీఐ

    ఎన్టీఆర్: ఈనెల 6న ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో అనుమానాస్పదమృతి కే‌సులో మిస్టరీ వీడింది. తండ్రి సైకం ప్రభాకర్‌పై దాడికి పాల్పడిన నడకుదిటి ఏసుబాబుపై ప్రతీకారం తీర్చుకోడానికి ప్రభాకర్ కుమారులు పక్కా ప్లాన్‌తో 5వ తేదీ రాత్రి కారుతో గుద్ది హత్య చేసినట్లు ఇబ్రహీంపట్నం సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. హత్యలో కుమారస్వామి, నవీన్‌‌కు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

  • రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది: ఎమ్మెల్యే

    కృష్ణా: సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో శక్తివంతంగా ముందుగా సాగుతోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా బంటుమిల్లిలో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మల్లేశ్వరం సువర్చలాసమేత ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీపురం అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

     

  • రైతు సంక్షేమమే కూటమి ధ్యేయం: ఎమ్మెల్యే వెనిగండ్ల

    కృష్ణా: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం కంకిపాడు రోడ్డులో గల చంద్రయ్య డ్రైన్ పరివాహక పంట పొలాల్లో ఎమ్మెల్యే శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా పేద ఎరుకపాడు, బేతవోలు, పరివాహక రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు. పలు అంశాలపై రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

  • పదవ తరగతి టాపర్ల‌కు సన్మానం

    ఎన్టీఆర్: నందిగామలోని కమ్మ కళ్యాణ మండపంలో శుక్రవారం పదవ తరగతి పరీక్షల్లో నియోజకవర్గ, మండల, స్కూల్ టాపర్లైన విద్యార్థులకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని, విద్యార్థులను అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంస్కరణలను సౌమ్య ప్రశంసించారు. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.