Locations: Krishna

  • విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరం: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అధిక సంఖ్యలో ప్రజలు మరణించడం తీరని ఆవేదనను కలిగించిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం ఆమె కార్యాలయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కృష్ణకుమారి, లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ వీరబాబులతో కలిసి ప్రమాదంలో మృతి చెందిన వారికి మౌనం పాటించారు. అనంతరం ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  • తల్లికి వందనం..3.84 లక్షల మందికి లబ్ధి

    ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తల్లికి వందనం పథకానికి 3,84,809 మంది విద్యార్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు. వీరికి సంబంధించిన 2,53,457 మంది తల్లులకు లబ్ధి చేకూరబోతోందన్నారు. వీరిలోనూ.. 1.31,352 మంది తల్లులకు ఇద్దరేసి పిల్లలు ఉండడంతో వీరికి రూ.30 వేల చొప్పున ఖాతాల్లో పడతాయని, 1,22,105 మంది తల్లులకు ఒక్కో విద్యార్ధికి రూ. 15 వేల చొప్పున డబ్బులు ఖాతాల్లో పడబోతున్నాయని పేర్కొన్నారు.

     

     

  • అండగా ఉంటాం: మాలమహానాడు జిల్లా నేత

    కృష్ణా: అవనిగడ్డ మండలం ఎడ్లంక గ్రామానికి చెందిన మునిపల్లి బాలస్వామి నివాసం గురువారం రాత్రి 11 గంటలకు అగ్నిప్రమాదంలో కాలి బూడిదైంది. దీంతో టేకు కలప, బీరువా, పలు వస్తువులు దగ్ధమయ్యాయి. మనమరాలు డెలివరీ అవ్వడంతో వృద్ధ దంపతులు ఆమె దగ్గరకు వెళ్లిన కారణంగా ప్రాణనష్టం తప్పింది. ఈనేపథ్యంలో శుక్రవారం మాలమహానాడు జిల్లా నేత గోవర్ధన్ బాధితుడిని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

  • యోగా వైభవానికి నిదర్శనంగా ‘యోగాంధ్ర’

    కృష్ణా: ఘంటసాలలోని పురాతన బౌద్ధ స్థూపం వద్ధ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ అద్భుతమైన భారతీయ యోగా వైభవానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ‘యోగాంధ్’ర వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో యోగా గురువులు ఆసనాలు, ప్రాణాయామం చేయించారు.

  • కంచికచర్ల మండల సర్వసభ్య సమావేశం..ఎప్పుడంటే!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 17వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి ఒక ప్రకనటలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10గంటలకు ఎంపీపీ షేక్ మలక్బషీర్ అధ్యక్ష్యతన జరిగే సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.

  • డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

    కృష్ణా: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఘంటసాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సత్య ప్రియలలిత తెలిపారు. పదో తరగతి, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్హులైన వారు, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులు, చదువు మధ్యలో ఆపేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08671-254499 సంప్రదించాలని కోరారు.

  • విమాన ప్రమాదంపై ఎంపీ శివనాథ్ దిగ్భ్రాంతి

    ఎన్టీఆర్: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

  • విజయవాడ కౌన్సిల్ సమావేశం వాయిదా: మేయర్

    ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం వాయిదా పడిందని, శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని ప్రస్తుతం వాయిదా వేసినట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటనలో అనేక మంది ప్రయాణికులు మరణించిన ఘటనకు సంతాప సూచకంగా కౌన్సిల్ సమావేశాన్ని ఆకస్మికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. కౌన్సిల్ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడిస్తామని మేయర్ వెల్లడించారు.

  • పక్షవాతంతో రోగి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

    ఎన్టీఆర్: పక్షవాతంతో అపస్మారక స్థితికి చేరుకున్న మస్తాన్‌వలిని బంధువులు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు విజయవాడకు తరలించాలని సిఫార్సు చేశారు. ప్రైవేట్ అంబులెన్స్‌ను ఆశ్రయించే స్తోమతలేక 108కు కాల్ చేయగా ఆలస్యం కావడంతో బంధువులు రోడ్డుపై నిరసన తెలిపారు. ఈక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగి బంధువులకు మధ్య వాగ్వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో రోగిని విజయవాడకు తరలించారు.

     

  • 241మంది మృతి చెందడం మనసు కలిచివేసింది: తంగిరాల

    ఎన్టీఆర్: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి అవడంపై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో 241 మంది ప్రయాణికలు మృతి చెందడం మనసు కలిచివేసిందని తెలిపారు. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా విషాదకరమన్నారు. మృతులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.