Locations: Krishna

  • టీడీపీ నేతకు MLA నివాళులు

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన  టీడీపీ సీనియర్ నాయకులు ముక్కపాటి పట్టాభి రామారావు గురువారం కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పూలమాలవేసి నివాళులు అర్పించారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

  • కాచేటి వాగు ఆక్రమణపై ఎమ్మార్వోకు ఫిర్యాదు

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామం పరిధిలోని కాచేటి వాగును కొందరు ఆక్రమించుకున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. వాగులో మట్టితోలి రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. దీనివలన చుట్టుపక్కల ఉన్న పొలాలు దెబ్బతింటున్నాయని పరిటాల రైతులు గురువారం తహసీల్దార్ వేమూరి మానసకు వినతిపత్రం ఇచ్చారు. భారీ వాహనాలతో ఈ వాగును పూడ్చి రహదారి ఏర్పరచడంతో పర్యావరణం దెబ్బతింటుందని అర్జీలో వివరించినట్లు రైతన్నలు వెల్లడించారు.

  • ఇది మంచి ప్రభుత్వం: కాగిత

    కృష్ణా: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా పెడనలో గురువారం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గూడూరులో రైతులకు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాల చెక్కు అందజేశారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ, విద్యార్థిమిత్ర కిట్లు ఇచ్చారు. రైతులకు కౌలు పత్రాలు అందించారు. ఇది మంచి ప్రభుత్వమని కాగిత పేర్కొన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

  • నందిగామ ప్రగతి పథంలో నడుస్తుంది: సౌమ్య

    ఎన్టీఆర్: నందిగామలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రస్తావించారు. “చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా జయప్రదం చేసుకున్నాం. నియోజకవర్గం మొత్తం మీద MGNRGES పథకంలోని రూ.20 కోట్ల నిధులతో గ్రామ గ్రామాన సీసీ రోడ్లు నిర్మించాం. వేదాద్రి కంచల ఎత్తిపోతల మరమ్మతులకు రూ.15 కోట్ల మంజూరుకు సీఎం నుంచి వాగ్దానం తీసుకున్నాం” అని సౌమ్మ వెల్లడించారు.

  • డా.సుధరాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం

    కృష్ణా: ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల సమన్వయ కర్తగా విధులు నిర్వహిస్తున్న డా.డి.సుధారాణికి అరుదైన గౌరవం దక్కింది. విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెరుకు పంటలో చేపట్టిన పరిశోధన గాను ఆమెను ఉత్తమ శాస్త్రవేత్తగా బంగారు పతకంతో సత్కరించారు. గురువారం మంత్రి అచ్చన్నాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ సుధాకి ప్రశంసాపత్రం అందజేశారు.

  • ఎంపీపీకి సర్పంచ్‌ల సన్మానం

    కృష్ణా: బంటుమిల్లి ఎంపీపీని మండలంలోని సర్పంచ్‌లు గురువారం అభినందించారు. మండల ప్రజా పరిషత్ నిధులతో మండలంలోని మల్లంపూడి, సాతులూరు నాగన్న చెరువు, మల్లేశ్వరం గ్రామ పంచాయతీలలో నీటి ఎద్దడి లేకుండా త్రాగునీటి సమస్యను పరిష్కరించుకున్నామని వారు తెలిపారు.  ఈ సంర్భంగా ఎంపీపీ వెలివెల చిన్ బాబుని దుస్సాలువతో సన్మానించించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ పాపాన్ని భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

  • హిందూ చైతన్య వేదిక ఆర్థిక ప్రముఖ్‌గా హరిబాబు

    కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక ఆర్థిక ప్రముఖ్‌గా తోటరంగనాథరావు (హరిబాబు) నియమితులు అయ్యారు. సహకార శాఖ విశ్రాంత ఉద్యోగి అయిన హరిబాబుకు వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు గురువారం  పైడమ్మ తల్లి దేవాలయంలో బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు తోట రామారావు తదితరులు పాల్గొన్నారు.

  • అంగన్వాడీ అమ్మ ఒడి లాంటివి: సర్పంచ్ సాత్విక

    ఎన్టీఆర్: అంగన్వాడీ పాఠశాలలు అమ్మ ఒడి లాంటివని పేరకలపాడు సర్పంచ్ మన్నే సాత్విక అన్నారు. గురువారం కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలోని అంగన్వాడి ఒకటవ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్  చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.

  • కొత్త నాగులూరులో దళితులపై టీడీపీ నాయకుల దాష్టీకం

    ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో దళితులపై టీడీపీ నాయకుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. దళిత కాలనీ ప్రవేశంలో నిర్మించుకున్న ఆర్చ్‌కి బాబు జగజీవన్‌రామ్ నగర్‌గా గ్రామస్తులు పేరు పెట్టుకున్నారు. పేరును జీర్ణీంచుకోలేని పలువురు టీడీపీ నేతలు అడ్డుకుంటూ దళితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కాలనీ వాసులు గురువారం ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • చంద్రబాబుకు, జగన్‌కు తేడా ఇదే: వసంత

    ఎన్టీఆర్: సీఎం చంద్రబాబుకు, మాజీ సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎద్దేవ చేశారు. చంద్రబాబును ఎందుకు తిట్టడం లేదని గతంలో జగన్ ప్రశ్నించేవారని.. అసభ్యకరంగా మాట్లాడితే నా గడప తొక్కొద్దని చంద్రబాబు చెప్పేవారని వసంత తెలిపారు. అత్యధిక మెజారిటీతో ఓడిన వ్యక్తి జోగి రమేష్ అని దుయ్యబట్టారు. కూటిమి విజయోత్సవ ర్యాలీలో ఈవ్యాఖ్యలు చేశారు.