Locations: Krishna

  • నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రధాన మంత్రి స్కూల్స్ రైజింగ్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రూ.24లక్షలతో ప్లే గ్రౌండ్ అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్‌ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుజాత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

     

  • నదిలో బోట్లపై యోగాసనాలు.. ఎన్టీఆర్‌ జిల్లాకు ప్రపంచ రికార్డు

    యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్నీ ప్రముఖమైన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడలో బెరం పార్కు వద్ద కృష్ణా నదిలో పడవలపై పలువురు యువత యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డును నెలకోల్పారు.

  • మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణస్వీకారం

    కృష్ణా: గుడ్లవల్లేరు మండల కేంద్రం లయన్స్ క్లబ్ ప్రాంగణంలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఛైర్మన్ పొట్లూరి రవికుమార్, వైస్‌ఛైర్మన్ కూనపురెడ్డి కళ్యాణ కృష్ణ, ఇతర సభ్యులచే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ప్రజలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.

  • ఆధార్ నమోదు కేంద్రాలు.. ‘సద్వినియోగం చేసుకోండి’

    కృష్ణా: గూడూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈనెల 27 వరకు ఆధార్ నమోదు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ మోటేపల్లి వనజ తెలిపారు. ఈనెల 10-12వ తేదీ వరకు పోసినవారిపాలెం, కంకటావ, కప్పలదొడ్డి సచివాలయాల్లో, 24-27వ తేదీ వరకు మల్లవోలు-1 తరకటూరు, ఆకులమన్నాడు, లేళ్లగరువు సచివాలయాల పరిధిలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • రేపు వితంతు పెన్షన్ల పంపిణీ

    కృష్ణా: మొవ్వ మండలానికి వితంతు పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ వితంతు పెన్షన్లను గురువారం పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు ఎంపీడీఓ జె.విమాదేవి తెలిపారు. మండలానికి 91 పింఛన్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన నగదును ఆయా సచివాలయాల పరిధిలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ బుధవారం సంబంధిత బ్యాంకు నుంచి డ్రా చేస్తారని పేర్కొన్నారు.

  • వీడెవడండి.. బాబూ.. బ్యాంకునే బురిడి కొట్టించి..

    కృష్ణా: నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఓ ప్రైవేటు బ్యాంకును బురిడీ కొట్టించిన వ్యక్తిపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు..భవానీపురంలోని ఓప్రైవేటు సంస్థలో కోమలశ్రీరామ్ గతేడాది 54.7గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల బ్యాంకులో ఇన్స్పెక్షన్ జరగగా బంగారం నకిలీదని తేలడంతో బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

  • అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: జగన్

    పశ్చిమగోదావరి: అధైర్యపడొద్దని.. వైసీపీ అండగా ఉంటుందని రైతులు, ఎండీయూ వాహన డ్రైవర్లకు మాజీసీఎం జగన్ భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు, ఎండీయూ వాహనడ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు కలిశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని రైతులు, జీవనోపాధి కోల్పోయామని డ్రైవర్లు వాపోయారు. దాంతో వారికి అండగా ఉంటామని జగన్ ధైర్యం చెప్పారు.

  • అంగన్వాడీ కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు

    ఎన్టీఆర్: గంపలగూడెం మండలం పెనుగొలను 99వ అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం వ్యాధి నిరోధక టీకాలు వేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు వ్యాధులు రాకుండా టీకాలు వేసి, ముందుగా సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుకన్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

     

  • పశుసంపదను దైవంగా పూజించే రోజు ‘ఏరువాక పౌర్ణమి’: సౌమ్య

    ఎన్టీఆర్: రైతన్నలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ‘ఏరువాక పౌర్ణమి’ శుభాకాంక్షలు తెలిపారు. రైతులు ఎండనకా, వాననకా కష్టపడి పంట పండిస్తేనే మనం సంతోషంగా ఉండగలుగుతామని అన్నారు. అలాంటి రైతన్నలు పశు సంపదను దైవంగా పూజించే రోజును ఏరువాక పూర్ణిమగా జరుపుకుంటారని తెలిపారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసి అందరి ఆకలి తీర్చే రైతులు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాని అన్నారు.

  • అలర్ట్.. రేపటి నుంచి ఇగ్నో పరీక్షలు

    కృష్ణా: ఇగ్నో నిర్వహించే జూన్-2025 టర్మ్ ఎండ్ పరీక్షలు ఈనెల 12 నుంచి జూలై 19 వరకు నిర్వహిస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం సీనియర్ రీజనల్ డైరెక్టర్ దోనెపూడి రామాంజనేయశర్మ తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని అన్నారు. హాల్‌ టికెట్లు ఇగ్నో వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు.