కృష్ణా: దేశంలోని పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్ సీటీసీ సంస్థ ప్రత్యేక రైలును నడపనుంది. ఈనెల 14న సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని మీదుగా వారణాశి, అయోధ్య, ప్రయాగరాజ్, నైమిశారణ్యం తదితర ప్రాంతాలను సందర్శించి 22న తిరుగు ప్రయాణమవుతుందని అధికారులు తెలిపారు. వివరాలకు 9281495848 నంబరులో సంప్రదించాలని కోరారు.
Locations: Krishna
-
బీచ్ ఫెస్టివల్ విజేతలకు బహుమతుల ప్రదానం
కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ నెల 5,6,7,8 తేదీల్లో మచిలీపట్నంలోని మసులా బీచ్ ఫెస్టివల్‌లో నిర్వహించిన జాతీయ జల క్రీడలకు విశేష ఆదరణ లభించిందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. 15లక్షల మంది పర్యాటకులు, వీక్షకులు హాజరవడం సంతోకరమన్నారు. ఈ మేరకు విజయవాడలోని శాప్ ప్రధానకార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో బీచ్ ఫెస్టివల్ పోటీల విజేతలకు మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు.
-
మూడో రోజుకు చేరిన సీఏటీసీ-7 క్యాంపు
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సీబీఆర్ క్యాంపస్ నేతాజీ సైనిక్ స్కూల్‌లో (గుంటూరు NCC ఆధ్వర్యంలో) 10వ ఆంధ్రా బాలికల బెటాలియన్ సీఏటీసీ – 7 మూడో రోజు శిబిరాన్ని క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్.వి.ఎస్.సుదర్శన్ ప్రారంభించారు. ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఫైరింగ్ రేంజ్‌ను ఏఆర్ ఇన్స్‌పెక్టర్ కె.నాగరాజు పరిశీలించి తగు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. 70మంది ఎన్‌సీసీ క్యాడెట్‌లకు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు.
-
మచిలీపట్నం DPO గా మొహమ్మద్ రజావుల్లా
కృష్ణా: మచిలీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారిగా మొహమ్మద్ రజావుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన జంగారెడ్డిగూడెం డీఎల్పీఓగా పని చేశారు. బదిలీలలో భాగంగా మచిలీపట్నం డివిజన్‌కు వచ్చారు. రజావుల్లా గతంలో గూడూరు మండలం ఈఓపీఆర్డీగా పని చేస్తూ డీఎల్పీఓగా పదోన్నతి పొందారు.
-
ఫ్రీ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం
ఎన్టీఆర్: తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆలిండియా ప్రవేట్ స్కూల్స్ ఆసోసియోషన్ డైరెక్టర్ ఆగస్టీన్ తెలిపారు. మంగళవారం విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్‌లో ఆలిండియా ప్రవేట్ స్కూల్స్ ఆసోసియోషన్, గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రవేట్ లిమిటెడ్ ఆధ్వర్యం మీడియా సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్యను శాటిలైట్ డిజిటల్ టెక్నాలజీతో ఇంటర్ నెట్ అవసరం లేకుండా అందించనున్నట్లు చెప్పారు.
-
జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం
కృష్ణా: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్‌లో మంగళవారం జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఈ నెల 14 వరకు నిర్వహించనున్నారు. విజేతలు 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. యోగా గురువు గురువెల్లి కృష్ణ జడ్జిగా వ్యవహరించారు.
-
RPI చీఫ్‌ను కలిసిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ
ఎన్టీఆర్: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) ఏపీ చీఫ్ డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్‌ను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సభ్యులు జిల్లెల్ల సత్య సుధమ్మ, కటికల రాజారావు దేవీప్రసాద్‌కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. RPI రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికవడం గర్వించదగ్గ విషయమని వారు అభినందించారు.
-
సజ్జల మహిళలకు క్షమాపణ చెప్పాలి : సుజనా చౌదరి
ఎన్టీఆర్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఖండించారు. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడి తరఫున ప్రజా జీవితంలో ఉంటూ.. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఇలా దిగజారి మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. సజ్జల తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-
‘సాక్షి మీడియా బ్యాన్ చేయాలి’
కృష్ణా: దేవతలు నడయాడిన అమరావతిలో వేశ్యలు ఉన్నారని వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును వెంటనే చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో మంగళవారం ఆందోళన చేశారు. సాక్షి పత్రికలను దహనం చేశారు. సాక్షి మీడియాను బ్యాన్ చేయాలన్నారు. భారతి రెడ్డి మౌనం అత్యంత ప్రమాదకరమని తక్షణమే ఆమెను కూడా అరెస్ట్ చేయాలని ధ్వజమెత్తారు.
-
ఇళ్ల తొలగింపు అన్యాయం: దేవభక్తుని
కృష్ణా: పెనమలూరు మండలం కానూరులో గుమ్మడితోట కాలువకట్ట వాసుల ఇళ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం సరైనది కాదని నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి అన్నారు. వాటిని సవాల్ చేస్తూ పెనమలూరు ఎమ్మార్వోకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. గత నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్నవారికి అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి ఇళ్లను తొలగిస్తామడం అన్యాయమని వెల్లడించారు.