Locations: Krishna

  • జనసేన జెండా దిమ్మె ఆవిష్కరించిన ఉదయభాను

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనసేన జండా దిమ్మెను జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి కూటమి నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు ప్రజా రాజధాని అమరావతి దగ్గరలో ఉండటం శుభపరిణామమని ఉదయభాను వెల్లడించారు.

  • విజయవాడలో యువకుల వీరంగం

    ఎన్టీఆర్: విజయవాడ తూర్పు మాచవరం ఎల్‌ఐసీ కాలనీలోని ఆల్ఫా టీ క్యాంటీన్ వద్ద ఆదివారం యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో బీరె సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చేతిలో కత్తి కూడా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది.

  • రెండో రోజుకు చేరిన CATC – 7 క్యాంపు

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సీబీఆర్ క్యాంపస్‌లో 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్(NCC గుంటూరు) ఆధ్వర్యంలో సీఏటీసీ -7 రెండో రోజుకు చేరింది. ఎన్‌సీసీ క్యాంపుకు 14కళాశాలు, 7పాఠశాలల నుంచి 450 మంది బాలిక క్యాడెట్‌లు పాల్గొన్నారు. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.వి.ఎస్.సుదర్శన్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ మేజర్ అవినాషి పట్వాల్, సుబెదార్ మేజర్ షేక్ ఇమామ్ పాల్గొన్నారు.

  • కృష్ణంరాజుపై మహిళా కమిషన్ ఛైర్మన్‌కు ఫిర్యాదు

    ఎన్టీఆర్: సాక్షి టీవీలో “అమరావతిని వేశ్యల రాజధాని” అని ప్రస్తావించిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా పార్లమెంట్ నేత ఇందిరా ప్రియదర్శిని డిమండ్ చేశారు. ఈ మేరకు కూటమి మహిళా నేతలతో కలిసి ఆదివారం మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజకి వినతిపత్రం ఇచ్చారు. రాజధానిని, మహిళలను కించపరుస్తూ మాట్లాడటం దర్మార్గమని ఇందిరా మండిపడ్డారు.

  • మచిలీపట్నంలో త్రిముఖ చిత్ర బృందం సందడి

    కృష్ణా: మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్‌లో త్రిముఖ చిత్రబృందం ఆదివారం సందడి చేసింది. “త్రిముఖ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా నిర్మించాం. 5భాషల్లో విడుదల చేయనున్నాం. ఈనెల చివరిలో విడుదల తేదీ ప్రకటిస్తాం. సన్నీలియోన్ ప్రత్యేక పాత్ర చేశారు. నేను పుట్టి పెరిగింది మచిలీపట్నంలోనే. ఇక్కడే చదువుకున్నాను. నా ఊరిలో నా సినిమా ప్రమోషన్ చేయడం సంతోషంగా ఉంది.” అని హీరో యోగేష్ వెల్లడించారు.

  • మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఫలితాలు వాయిదా

    ఎన్టీఆర్: కొండపల్లి పురపాలక సంఘానికి 2021 నవంబరులో పరోక్ష పద్ధతిన ఛైర్‌పర్సన్, రెండు వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలను సోమవారం విడుదల చేయుటకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమావేశం కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడింది. తదుపరి తేదీని మరలా ప్రకటించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి & విజయవాడ ఆర్డీవో ఓ ప్రకటనలో తెలిపారు.

  • వైఎస్ భారతిపై ఫిర్యాదు

    ఎన్టీఆర్: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన మహిళా రైతుల గురించి సాక్షి టీవీలో అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీటీవీ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి టీవీ యజమాని భారతి రెడ్డిపై, కొమ్మినినేని, కృష్ణంరాజుపై కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కూటమి మహిళా నేతలు ఫిర్యాదు చేశారు.

  • కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక వాయిదా?

    ఎన్టీఆర్: సోమవారం జరగాల్సిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్లు సమాచారం. కారణాలు ఏమనే విషయాలు తెలియాల్సి ఉంది. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కొండపల్లి మున్సిపల్ ప్రజలు మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

  • లక్ష్యం నెరవేరుతోంది: బుద్ధ ప్రసాద్

    కృష్ణా: నాగాయలంకలో జల క్రీడల శిక్షణా కేంద్రం నిర్మాణ లక్ష్యం నెరవేరుతోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం శిక్షణా కేంద్రం నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం నాగాయలంకలో వసతి గృహాలు పరిశీలించారు. బీసీ బాలికల వసతి గృహాలను రూ.15.50 లక్షలు, సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాలను రూ.7.60 లక్షలతో నిర్మిస్తున్నారు.

  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న సత్యప్రకాష్

    కృష్ణా: మోపిదేవి గ్రామంలో భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ప్రముఖ సినీనటుడు సత్య ప్రకాష్ ఆదివారం దర్శించుకున్నారు. వీరికి దేవాలయం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సత్యప్రకాష్‌ను శ్రీరామ వరప్రసాదరావు సత్కరించి, ప్రసాదాలు అందజేశారు. అర్చకులతో కలిసి శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.