కృష్ణా: గుడివాడ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఆదివారం విద్యుత్ అధికారులతో రాము సమావేశమై విద్యుత్ సమస్యలపై సమీక్షించారు. సమస్యలపై ప్రణాళికలు రూపొందించారు. పరిష్కారానికి అధిష్టానం నుంచి నిధులు తీసుకొస్తానని ఈ సందర్భంగా రాము హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిన్న, చిన్న సమస్యలు పెద్దవిగా మారి ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలిపారు.
Locations: Krishna
-
కృష్ణంరాజు వ్యాఖ్యలతో వైసీపీకి సంబంధం లేదు : పోతిన
ఎన్టీఆర్: జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత పోతిన మహేష్ స్పష్టం చేశారు. విజయవాడలో మాట్లాడుతూ కావాలనే టీడీపీ, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా వైసీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని హితవుపలికారు. ఇప్పటికే సాక్షి టీవీ యాజమాన్యం కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించిందని వెల్లడించారు.
-
ట్రాక్టర్ షోరూమ్ ప్రారంభించిన తంగిరాల
ఎన్టీఆర్: నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో నూతనంగా ఐషర్ ట్రాక్టర్ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలసి ఆదివారం ప్రారంభించారు. ఈ సంద్భంగా ట్రాక్టర్ షోరూమ్ యాజమాన్యాన్ని సౌమ్య అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
-
సలహాలు తీసుకుంటే తప్పేంటి..? : సీపీఐ రామకృష్ణ
ఎన్టీఆర్: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను వదిలేసి కొత్త ప్రాజెక్టుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తే తెలంగాణ మాదిరిగానే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సలహాలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
-
మద్దులమ్మకు వరద పాయసం పోసిన సౌమ్య
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ సమీపంలోని రిజర్వు ఫారెస్ట్‌లో స్వయంభుగా వెలసిన మద్దులమ్మకు ఆదివారం వరద పాయసం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దులమ్మకు వరద పాయసం పోశారు. వరద పాశం పోస్తే వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకమని సౌమ్య తెలియజేశారు. పరిటాల, నక్కలంపేట, కంచికచర్ల, నరసింహారావు పాలెంతో పాటు పలు గ్రామస్తులు హాజరయ్యారు.
-
అక్రెడిటేషన్లు ఇవ్వాలని మంత్రులకు వినతి
కృష్ణా: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు. శనివారం రాత్రి మంగినపూడి బీచ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న మంత్రులు పార్థసారధి, నారాయణకు జర్నలిస్టుల సమస్యలపై APMPA తరుఫున వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు అక్రెడిటేషన్ విషయంలో పలు ఇబ్బందులకు గురయ్యారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమస్యలు పరిష్కరించి అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు.
-
హిందూ స్మశాన వాటికలో గడ్డి మందు పిచికారీ
కృష్ణా: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సహకారంతో హిందూ స్మశాన వాటికలో పిచ్చి మొక్కల నివారణకు అవసరమైన గడ్డి మందు పిచికారి కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఈకార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటి సభ్యులు వెంకటేశ్వరావు పర్యవేక్షించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
-
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సింగ్ జన్మదిన వేడుకలు
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరబాబు సింగ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక నేతలతో కలిసి కేక్ కట్ చేసి సింగ్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
-
మచిలీపట్నంలో ఉపాధ్యాయ సంఘాల నిరసన
కృష్ణా: మచిలీపట్నం డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం నిరసన తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యానువల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. గతంలో మ్యానువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ.. ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
-
అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదు: సీఐ
కృష్ణా: నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడత కలిగి, వివిధ కేసుల్లో ఎదుటివారిపై ఇబ్బందులకు గురి చేస్తున్న వారందరికీ ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనిలో భాగంగా వారందరూ కూడా ఇకపై ఎటువంటి వివాదాలకు పోకుండా మంచిగా ఉంటామని ప్రమాణం చేసినట్లు పోలీసులు తెలిపారు. మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదని సీఐ వైవిఎల్వి నాయుడు, ఎస్సై శాతకర్ణి తెలిపారు.