Locations: Krishna

  • న్యూజిలాండ్ ఉప ప్రధానిని కలిసిన ఎమ్మెల్యే బోడే

    కృష్ణా: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి బ్రూక్వెన్వెల్డెన్, ఎంపీ పరంజీత్ పార్మర్లను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతో పాటు లైట్రేచల్ కమిటీ వైస్ ఛైర్మన్ అట్లూరి అశ్విన్‌కుమార్, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్సీ జనార్దన్ ఉన్నారని పేర్కొన్నారు.

     

     

  • 9 నుంచి పటమట రైతు బజారు మూత

    కృష్ణా: ఈనెల 9 నుంచి 11 వరకు పటమట రైతు బజారును పలు అభివృద్ధి పనులు నిమిత్తం మూసివేస్తున్నట్లు ఎస్టేట్ అధికారి రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజారు అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు అక్కడకు వెళ్లాలని పేర్కొన్నారు.

  • సీఎంను కలిసిన నెట్టెం

    ఎన్టీఆర్: టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం శనివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆయన పుష్పగుచ్ఛం అందించారు. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.

  • గుడ్లవల్లేరులో నేడు ఉచిత మధుమేహ వైద్య శిబిరం

    కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని లయన్స్ సేవా భవన్‌లో ఆదివారం ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్ ప్రతినిధి మూల్పూరి సుధాకర్ వెల్లడించారు. గుడివాడ వైద్య సిబ్బంది పరీక్షించి దాతల వితరణతో ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

     

  • పిడుగుపాటుతో తాడిచెట్టు దగ్ధం

    కృష్ణా: కంకిపాడు మండలం కొణతనపాడులో శనివారం సాయంత్రం ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం పడింది. తాడిచెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

     

  • మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు: తంగిరాల

    ఎన్టీఆర్: రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమరావతి దేవతల రాజధాని కాదు.. అది వేశ్యల రాజధాని’ అంటూ సాక్షి టీవీ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను సౌమ్య ఖండించారు. రాజధాని ప్రాంతంలో నివసిస్తూ తన సాక్షిలో మహిళలను కించపరుస్తూ మాట్లాడితే భారతి రెడ్డి మహిళై ఉండి చూస్తూ ఉండిపోవడం సిగ్గు చేటన్నారు.

  • ఉయ్యూరు సెంటర్‌లో కొట్లాట

    కృష్ణా: ఉయ్యూరు సెంటర్‌లో శనివారం సాయంత్ర యువకుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పిడుగుద్దులు గుద్దుకుంటూ బీభత్సం సృష్టించారు. గొడవను చూసి స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంత జరుగుతున్న కనుచూపు మేరలో పోలీసులు కనిపించకపోవడం గమనార్హం.

     

     

     

  • సుజనా చౌదరికి శ్రీరాం రాజగోపాల్ పరామర్శ

    ఎన్టీఆర్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, సోదరులు శ్రీరాం సాయి ప్రసాద్ శనివారం కలిశారు. ఇటీవల సుజనా చౌదరి లండన్‌లో ఓ ప్రమాదంలో గాయపడటంతో ఇరువురు ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

  • దేవీ ప్రసాద్‌కు అభినందనల వెల్లువ

    ఎన్టీఆర్: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) ఏపీ అధ్యక్షుడు ఉప్పులేటి దేవీప్రసాద్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భీమవరానికి చెందిన డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కోన జోసెఫ్, అడ్వకేట్ ప్రశాంత్, దేవీప్రసాద్‌ను కలిశారు. RPI రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికవడంపై హర్షం వ్యక్తంచేసి ఘనంగా సన్మానించారు. కేశిరాజు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

  • కనపర్తిపై చర్యలు తీసుకోవాలి: గౌతమ్

    కృష్ణా: ABN ఛానల్ డిబేట్‌లో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కనపర్తి శ్రీనివాసరావు మాజీ సీఎం జగన్‌, పెండిగ్ కేసుల విషయమై న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడారని అవనిగడ్డ వైసీపీ యువనేత గౌతమ్ ఆరోపించారు. రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే నామినేటెడ్ పోస్టుల కోసం కొందరు జడ్జిలు ఆశపడుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థను అవమానించడనేనని తెలిపారు. వెంటనే శ్రీనివాసరావు, ఏబీఎన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.