కృష్ణా: రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఏపీ ఉత్తమ పాఠశాలగా ఇటీవల సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న గుడ్లవల్లేరు మండలంలోని అంగులూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సరదా మాటలతో నవ్వులు పూయించాయి.
Locations: Krishna
-
గణనాథుడికి ప్రత్యేక పూజలు
ఎన్టీఆర్: నందిగామలోని మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్లో, వాసవి మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను నియోజకవర్గ బీజేపీ నాయకులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నందిగామ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీదేవి, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారావు, కంచికచర్ల మండల కన్వీనర్ మహేష్ బాబు, బీజేపీ నందిగామ పట్టణ కార్యదర్శి శివ నరసింహారావు, బీజేపీ మహిళా నాయకురాలు రోజా, రమాదేవి పాల్గొన్నారు.
-
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఎన్టీఆర్: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ అన్నారు. కంచికచర్ల మండలంలోని ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్స్‌ను పరిశీలించి, డీలర్లకు యూరియాను నిల్వ చేయవద్దని, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించవద్దని సూచనలు జారీ చేశారు. రైతులు ఎవరు యూరియా దొరకడం లేదని అధైర్య పడొద్దని తెలిపారు.ౌ
-
జలదీశ్వరస్వామి సేవలో బొబ్బా
కృష్ణా: ఘంటశాలలోని శ్రీ జలదీశ్వరస్వామి ఆలయాన్ని టీడీపీ నాయకులు బొబ్బా గోవర్థన్ సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల డీసీ కమిటీ ఛైర్మన్ ఐనంపూడి భాను ప్రకాష్ ఆహ్వానం మేరకు వినాయకచవితి అన్నసంతర్పణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గోవర్థన్‌ను ఆలయ కమిటివారు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో రామకృష్ణ, రవికుమార్, పరాత్పరరావు, ముప్పనేని రవిప్రసాద్, తదితరుల పాల్గొన్నారు.
-
పరిటాలలో ‘పొలం పిలుస్తోంది’
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాలలో ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంట నమోదు అవశ్యకత, PM-PRANAMలో భాగంగా రైతులకు ఎరువుల వినియోగం తగ్గించి నానో యూరియా,నానో DAP, జీవన ఎరువుల వాడకం గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన సంస్థ గరికపాడు నుంచి రాజశేఖర్, జిల్లా వనరుల కేంద్రం DDA వెంకటేశ్వరావు, మండల వ్యవసాయ ఆధికరి విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
-
అన్ని వర్గాల సంక్షేమమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే
కృష్ణా: కుల మత వర్గాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగులూరు, చంద్రాల గ్రామాల్లో ఎమ్మెల్యే రాము బుధవారం ఉదయం విస్తృతంగా పర్యటించారు. ముందుగా అంగులూరు పీఎసీఎస్ త్రీ మెన్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొని, అనంతరం నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.
-
ఉద్యాన పంటలతో రైతుల ఇంట సిరులు: కలెక్టర్
ఎన్టీఆర్: ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్ల, పూల మొక్కల సాగును చేపట్టవచ్చని, ఉద్యాన పంటలతో రైతులకు సుస్థిర ఆదాయాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. చందర్లపాడు మండలం, ముప్పాళ్ల గ్రామ రైతు నాగేశ్వరరావు ఉపాధి హామీ పథకం కింద ఎకరా విస్తీర్ణంలో వేసిన తైవాన్ జామ తోటను కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు.
-
మాజీ మంత్రితో వెంకటతర్నం భేటీ
ఎన్టీఆర్: కంచికచర్ల పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ గుత్తా వీర వెంకటరత్నం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా వెంకటరత్నానికి దుశ్శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ రైతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి ఒక మంచి అవకాశం కల్పించింది.
-
ప్రజలందరి సంక్షేమమే కూటమి లక్ష్యం: వెనిగండ్ల
కృష్ణా: కుల, మతాలకతీతంగా రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగులూరు, చంద్రాల గ్రామాల్లో ఎమ్మెల్యే రాము బుధవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా అంగులూరు పీఏసీఎస్ త్రీమెన్ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ..నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. రామాలయ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు.
-
గణేషుడికి MDO పూజలు
ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ రోడ్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల MDO బీఎం లక్ష్మి కుమారి పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు కాకాణి సుమన్ పాల్గొన్నారు.