కృష్ణా: అనారోగ్యం కారణంగా ఆదివారం రాత్రి మృతి చెందిన కొల్లూరి నాగేశ్వరరావు(80) భౌతికకాయాన్ని వైసీపీ అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సోమవారం ఉదయం సందర్శించారు. లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలోని వారి నివాస గృహానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Locations: Krishna
-
జాతీయ మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపిక
ఎన్టీఆర్: కొండపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్ధిని షేక్ జాకియా సుల్తానా ఎన్ఎంఎంఎస్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయిని హేమలత విద్యార్ధిని దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. హెచ్ఎం మాట్లాడుతూ.. అవార్డు గ్రహీతలైన విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్స్‌లో శిక్షణ అందించిన ఉపాధ్యాయులను పీజీటీ ఉపాధ్యాయులు నరసింహారావును ఆమె అభినందించారు.
-
ఫలితాల ప్రకటన వాయిదా
ఎన్టీఆర్: కొండపల్లి పురపాలిక సంఘ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లకు సంబంధించి సీల్డ్ కవర్ వివరాలు తెలిపే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆర్డీవో చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం పురపాలిక కార్యాలయంలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం మరో రోజుకు వాయిదా పడిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీల్డ్ కవర్ ప్రకటన తేదీని మరోసారి నిర్ణయించి ప్రకటిస్తారని పేర్కొన్నారు.
-
నేడు ‘ప్రజా సమస్యల పరిస్కార వేదిక’
ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్, నగరపాలక సంస్థ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ఆర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు వినతి పత్రాలను స్వీకరించనున్నట్లు వివరించారు.
-
జనసేన జెండా దిమ్మె ఆవిష్కరించిన ఉదయభాను
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనసేన జండా దిమ్మెను జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి కూటమి నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు ప్రజా రాజధాని అమరావతి దగ్గరలో ఉండటం శుభపరిణామమని ఉదయభాను వెల్లడించారు.
-
విజయవాడలో యువకుల వీరంగం
ఎన్టీఆర్: విజయవాడ తూర్పు మాచవరం ఎల్‌ఐసీ కాలనీలోని ఆల్ఫా టీ క్యాంటీన్ వద్ద ఆదివారం యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో బీరె సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చేతిలో కత్తి కూడా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది.
-
రెండో రోజుకు చేరిన CATC – 7 క్యాంపు
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సీబీఆర్ క్యాంపస్‌లో 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్(NCC గుంటూరు) ఆధ్వర్యంలో సీఏటీసీ -7 రెండో రోజుకు చేరింది. ఎన్‌సీసీ క్యాంపుకు 14కళాశాలు, 7పాఠశాలల నుంచి 450 మంది బాలిక క్యాడెట్‌లు పాల్గొన్నారు. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.వి.ఎస్.సుదర్శన్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ మేజర్ అవినాషి పట్వాల్, సుబెదార్ మేజర్ షేక్ ఇమామ్ పాల్గొన్నారు.
-
కృష్ణంరాజుపై మహిళా కమిషన్ ఛైర్మన్‌కు ఫిర్యాదు
ఎన్టీఆర్: సాక్షి టీవీలో “అమరావతిని వేశ్యల రాజధాని” అని ప్రస్తావించిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా పార్లమెంట్ నేత ఇందిరా ప్రియదర్శిని డిమండ్ చేశారు. ఈ మేరకు కూటమి మహిళా నేతలతో కలిసి ఆదివారం మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజకి వినతిపత్రం ఇచ్చారు. రాజధానిని, మహిళలను కించపరుస్తూ మాట్లాడటం దర్మార్గమని ఇందిరా మండిపడ్డారు.
-
మచిలీపట్నంలో త్రిముఖ చిత్ర బృందం సందడి
కృష్ణా: మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్‌లో త్రిముఖ చిత్రబృందం ఆదివారం సందడి చేసింది. “త్రిముఖ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా నిర్మించాం. 5భాషల్లో విడుదల చేయనున్నాం. ఈనెల చివరిలో విడుదల తేదీ ప్రకటిస్తాం. సన్నీలియోన్ ప్రత్యేక పాత్ర చేశారు. నేను పుట్టి పెరిగింది మచిలీపట్నంలోనే. ఇక్కడే చదువుకున్నాను. నా ఊరిలో నా సినిమా ప్రమోషన్ చేయడం సంతోషంగా ఉంది.” అని హీరో యోగేష్ వెల్లడించారు.
-
మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఫలితాలు వాయిదా
ఎన్టీఆర్: కొండపల్లి పురపాలక సంఘానికి 2021 నవంబరులో పరోక్ష పద్ధతిన ఛైర్‌పర్సన్, రెండు వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలను సోమవారం విడుదల చేయుటకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమావేశం కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడింది. తదుపరి తేదీని మరలా ప్రకటించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి & విజయవాడ ఆర్డీవో ఓ ప్రకటనలో తెలిపారు.