ఎన్టీఆర్: తిరువూరు మున్సిపల్ కమిషనర్ జి.లోవరాజు నందిగామకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కదిరి మున్సిపల్ కమిషనర్ కే.మనోజ తిరువూరుకు బదిలీపై వచ్చారు. ఈ బదిలీలు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Locations: Krishna
-
రేపు ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఎన్టీఆర్: జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ బుధవారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఆ రోజు తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. సుమారు 8కిలోమీటర్ల సాగే గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకోనుందన్నారు.
-
తిరుపతమ్మ హుండీ ఆదాయం ఎంతంటే?
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించగా రూ.1.15 కోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో కిశోర్‌కుమార్ తెలిపారు. విజయవాడ గ్రూప్ టెంపుల్స్ ఈవో రవీంద్రబాబు పర్యవేక్షణలో ఆలయంలోని అన్ని హుండీల నగదును లెక్కించారు. 75 రోజులకు గాను రూ. 1,15,31,525 నగదు, 98 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి, యూఎస్-51, కెనడా-100, మలేసియా-1, ఇంగ్లాండ్-5, థాయిలాండ్-20 తదితరు దేశాలకు చెందిన నోట్లు వచ్చాయన్నారు.
-
నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీ
ఎన్టీఆర్: మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి ఏసీఏ సెంట్రల్ జోన్ అంతర్ జిల్లాల సీనియర్ వన్డే(50 ఓవర్లు) క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల జట్లు పోటీ పడనున్నాయి. టోర్నీలో తొలి రోజైన మంగళవారం సీపీ మైదానంలో కృష్ణా జట్టు ప్రకాశం జట్టుతో తలపడనుండగా..డీవీఆర్ మైదానంలో పశ్చిమగోదావరి, గుంటూరు జట్లు తలపడనున్నాయి.
-
దేవీ ప్రసాద్‌ను కలిసిన మాల ఉద్యోగ సంఘాలు
ఎన్టీఆర్: విజయవాడ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) ప్రధాన కార్యాలయంలో పార్టీ ఏపీ ఛీప్ ఉప్పులేటి దేవీప్రసాద్‌ను మాల ఉద్యోగ సంఘాలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశాయి. దేవీప్రసాద్ RPI రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడంపై BSI&SSD రాష్ట్ర అధ్యక్షుడు బేతాళ సుదర్శన్, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు నూతలపాటి జగదీష్ హర్షం వ్యక్తం చేశారు. దేవీ ప్రసాద్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
-
వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న RPI ఛీప్ దేవీ ప్రసాద్
కృష్ణా: పామర్రు గ్రామానికి చెందిన మద్దుల సుబ్రహ్మణ్యం కుమార్తె వివాహ రిసెప్షన్ సోమవారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పామర్రు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యుక్షులు మత్తే వడ్డీ కాసులుతో పాటు పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.
-
సజ్జల రామకృష్ణారెడ్డి దిష్టిబొమ్మ దహనం
ఎన్టీఆర్: అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులను సమర్ధిస్తూ మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు సోమవారం రాత్రి దహనం చేశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వన్ సెంటరులో అమరావతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్, సజ్జల రామకృష్ణారెడ్డి డౌన్ డౌన్ అంటూ నాయకులు నినాదాలు చేశారు. రామకృష్ణారెడ్డి మాటలు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు వంటిదన్నారు.
-
కొమ్మినేని, కృష్ణంరాజుపై ఫిర్యాదు
ఎన్టీఆర్: రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గమని ఇది యావత్ మహిళా జాతికే అవమానమని తెలుగు మహిళలు పేర్కొన్నారు. మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై మైలవరం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రసారం చేసిన సాక్షి యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
-
పశ్చిమ దివ్యంగుల విభాగం అధ్యక్షుడిగా బద్రి
ఎన్టీఆర్: పశ్చిమ నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా కొమ్మూరు బద్రి నారాయణ నియమితులయ్యారు. సోమవారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసీపీ విజయవాడ పశ్చిమ కార్యాలయంలో 35వ డివిజన్‌కు చెందిన బద్రి నారాయణ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సంద్భంగా బద్రిని.. వెలంపల్లి శాలువాతో సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.
-
‘మసులా బీచ్ ఫెస్టివల్ విజయవంతం’
కృష్ణా: బందరు మసులా బీచ్ ఫెస్టివల్ విజయవంతం అయ్యిందని తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మచిలీపట్నం టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సీనియర్ నాయకులు గోపిచంద్ మాట్లాడారు. 4 రోజుల పాటు జరిగిన ఫెస్టివల్‌కు లక్షలాది మంది పర్యాటకులు వచ్చారని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.