కృష్ణా: పెడన మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు బదిలీ అయ్యారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు అసిస్టెంట్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు సూపర్డెంట్‌గా పనిచేస్తున్న ఎల్ చంద్రశేఖర్ రెడ్డి పెడన మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతిపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Locations: Krishna
-
పెడన వైసీపీ ప్రధాన కార్యదర్శిగా లోయ
కృష్ణా: పెడన మండల వైసీపీ ప్రధాన కార్యదర్శిగా లోయ ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వెలువడింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాము సూచన మేరకు ఈ నియామకం జరిగింది. కొంగంచర్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు తల్లి గతంలో సర్పంచ్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన భార్య సర్పంచ్‌గా ఉన్నారు.
-
యువతరం సన్మార్గంలో నడవాలి: MLA రాము
కృష్ణా: యువతరం సన్మార్గంలో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరులో నిర్వహిస్తున్న కొమ్మలపాటి సాయి మెమోరియల్ క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. ఫైనల్‌లో విజయం సాధించిన అంగుళూరు, రన్నరప్‌గా నిలిచిన చంద్రాల జట్లకు, ఎమ్మెల్యే రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు నగదు బహుమతులను అందజేశారు.
-
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్
కృష్ణా: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి బయల్దేరి వెళ్లారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
-
201 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్
కృష్ణా: ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి, పట్టుదలతో శ్రమించాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. 2024–25 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సోమవారం అవార్డలు ప్రదానం చేశారు. కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి “షైనింగ్ స్టార్స్” పేరిట 201 మంది విద్యార్థులకు ఇచ్చారు.
-
జోగీ రమేష్ ఇంకా మంత్రిగానే ఫీల్ అవున్నారు: చిట్టిబాబు
ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై మాజీ మంత్రి జోగీ రమేష్‌కు అవగాహన లేకపోయిందని ఛైర్మన్ అభ్యర్థి చిట్టిబాబు మండిపడ్డారు. మంత్రిగా ఫీల్ అవుతూ, అసెంబ్లీలో చక్రం తిప్పుతున్నట్లు కొండపల్లి ఛైర్మన్ ఎన్నికపై వైసీపీ అభ్యర్థే ఛైర్మన్ అనడం హస్యస్పదంగా ఉందన్నారు. టెక్నికల్ ప్రాబ్లం వలన ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడిందే తప్ప మాలో మాకు ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు.
-
ఘనంగా రాము జన్మదిన వేడుకలు
కృష్ణా: పెడన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఉప్పాల రమేష్(రాము) పుట్టినరోజు వేడుక సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో సతీమణి జడ్పీ ఛైర్‌పర్సన్ హారిక పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. గూడూరు మండల పరిషత్ అధ్యక్షుడు సంగా మధుసూదనరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పర్ణం పెదబాబు, మాజీ స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
-
సాక్షి మీడియా, పేపర్ లేకుండా చేయాలనే కుట్ర : మేయర్
ఎన్టీఆర్: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఖండించారు. అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను కొమ్మినేని ఆరోజే ఖండించారని.. టీడీపీ సోషల్‌మీడియాలో ట్రోల్ చేసి మాజీ సీఎం జగన్ కుటుంబసభ్యులకు ఆపాదించడం దారుణమని మండిపడ్డారు. సాక్షి మీడియా, పేపర్ లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
-
విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి: వెనిగండ్ల రాము
కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ టిడ్కో కాలనీ నుంచి గుడ్లవల్లేరు మండలం కౌతవరం వరకు 13Km మేర రూ.2.20కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 33kv విద్యుత్ లైన్‌ను రాము సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు కౌతవరం విద్యుత్ సబ్ స్టేషన్‌లో బ్రేకర్ స్విచ్ ఆన్ చేశారు.
-
కొత్త నాగులూరులో బరితెగించిన మట్టి మాఫియా
ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో మట్టి మాఫియా బరితెగించింది. పొలాల మెరక పేరుతో అనుమతులు తీసుకుని ఇటుక బట్టీలకు పబ్లిక్‌గా మట్టి తరలిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. పర్యావరణ సమతుల్యం గురించి ఆలోచించకుండా అధికారులు అనుమతులు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. గతంలో జువ్వుచెరువు, ఇప్పుడు రావుల చెరువులో మట్టి తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు.