కృష్ణా: పెడన పట్టణంలో పారిశుధ్య నిర్వహణ విఫలమైందని మున్సిపల్ పాలకవర్గం.. అధికారులపై ఆరోపణలు చేస్తూ చేతకానితనాన్ని మరోసారి నిరూపించుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. పురపాలక సంఘంలో 43మంది అక్రమ లేఅవుట్ దారుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మీరు ఇప్పటివరకు ఎంత మందికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. లేఅవుట్ దారులు పురపాలక సంఘానికి డబ్బును కడతారని కటకం ప్రసాద్ తెలియజేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
Locations: Krishna
-
గుడివాడ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభించిన సీఎం
కృష్ణా: గుడివాడ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్‌ను సీఎం చంద్రబాబు సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎమ్మెల్యే రాము, అధికారులు హాజరయ్యారు. పేదరిక నిర్మూలనకు పీ-4 ద్వారా చేయనున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై దృష్టి, పేదరిక నిర్మూలపై రాము అధికారులతో చర్చించారు. పి-4 సర్వే పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
-
నాపై సాక్షి తప్పుడు ప్రచారం: వసంత
ఎన్టీఆర్:”యుద్ధ ప్రాతిపదికన బీడీసీ గండ్లు పూడ్చివేత పనులు చేస్తుంటే సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడి పనులు ఆగితే అది ప్రభుత్వ నిర్లక్ష్యమని మరో అసత్య ప్రచారం చేస్తారు” అంటూ సాక్షి రాతలను మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఖండించారు. విజయవాడకు వరదముంపు రాకూడదని బుడమేరు కట్టల బలోపేతానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించానని, అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టంచేశారు.
-
యోగాతో మంచి ఆరోగ్యం: ఎంపీడీవో లక్ష్మీ
ఎన్టీఆర్: యోగా చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని ఎంపీడీవో లక్ష్మీ కుమారి తెలిపారు. సోమవారం కంచికచర్లలో యోగాంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వో వేమూరి మానస, డ్వాక్రా సభ్యులు, అంగన్వాడి టీచర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జాతీయ ఉపాధి హామీ శ్రామికులు తదితరులు పాల్గొని మండల కేంద్రంలో మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు.
-
సాక్షిపై ఆగ్రహించిన తెలుగు మహిళలు
ఎన్టీఆర్: విజయవాడలోని ఆటో నగర్‌లో సాక్షి కార్యాలయం ఎదుట టీడీపీ మహిళా కార్యకర్తలు సోమవారం ఆందోళనకు దిగారు. డౌన్ డౌన్ సాక్షి, అబద్ధాల ప్రచారం చేసే సాక్షి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి కార్యాలయం గేటు పైకెక్కి సాక్షి బోర్డును తొలగించి చెప్పులతో కొట్టారు.
-
మహిళలను కించపరచడం సిగ్గుచేటు: వల్లూరు
ఎన్టీఆర్: జర్నలిస్టులు, ఎనలిసిస్టుల పేరుతో అమరావతి రాజధాని మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఏపీ కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ హెడ్ వల్లూరు భార్గవ్ అన్నారు. మొదటి నుంచి సాక్షి మీడియాకు రాజధాని ఉద్యమం నడిపిన మహిళలంటే చులకన భావం ఉందని ఆరోపించారు. జర్నలిస్టులు విలువలు పాటించాలని సూచించారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
-
మంచి చిరస్థాయిగా నిలిచిపోతుంది: వెనిగండ్ల
కృష్ణా: మంచి చేసేవారు చనిపోయినా వారి సేవల రూపంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ బలరామకృష్ణయ్య మృతిపై ఆయన దిగ్బ్రాంతి చెందారు. గుడివాడ రాజేంద్రనగర్‌లో బలరామకృష్ణయ్య భౌతిక కాయానికి రాము సోమవారం నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. ఆదర్శప్రాయుడైన బలరామకృష్ణయ్య పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
-
కొమ్మినేని, కృష్ణంరాజుపై పెట్టిన సెక్షన్లు ఇవే!
గుంటూరు: సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. సెక్షన్ 79, 196(1), 353( 2), 299, 356(2), 6(1) BNS, 67 ITA-2000-2008, 3(1) (U), SC,ST POA ACT కింద కొమ్మినేనిని సోమవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు.
-
‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎన్టీఆర్: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో సాక్షిలో అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏసీపీ తిలక్, ఆర్డీవో బాలకృష్ణ, నందిగామ ఎస్ఐలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి కూటమి నేతలు, మహిళలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరమని, దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
-
ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, జనసేన నాయకులు సామినేని ఉదయభాను, పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.