ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఈనెల 13వ తేదీ జరగనుంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఈమేరకు సమావేశపు తేదీని ఇప్పటికే ప్రకటించారు. అధికార, విపక్ష కార్పొరేటర్లు, శాసనసభ్యుల నుంచి సమావేశానికి సంబంధించిన పలు ప్రతిపాదిత అంశాలను నగరపాలక సంస్థ కార్యదర్శి విభాగం అధికారులు స్వీకరిస్తున్నారు. సభ్యుల ప్రతిపాదనల ఆధారంగా ప్రధాన అజెండా తయారవుతుంది.
Locations: Krishna
-
కూచిపూడి నృత్య భంగిమలో యోగా సాధన
కృష్ణా: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కూచిపూడి (పెదపూడి) కామినేని జిమ్‌లో నిర్వహించిన యోగాంధ్ర-25 కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కూచిపూడి నృత్య భంగిమలో యోగా సాధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మలు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు సామూహిక యోగాసనాలు వేశారు.
-
క్రేజీ ఫుడ్డు.. బందరు లడ్డు
కృష్ణా: బందరు లడ్డూకు ఉన్న చారిత్రక నేపథ్యం సుపరిచితమే. ఢిల్లీ సుల్తానుల కాలంలో బుందేల్‌ఖండ్ నుంచి వలస వచ్చిన బొందిలీలు ఈ బందరు తొక్కుడు లడ్డూ తయారు చేసినట్లు చర్రిత చెబుతోంది. శనగపిండి, నెయ్యి కలిపి బూందీ చేసి, వాటిని రోకలితో దంచి బెల్లంపాకంలో పోసి తయారు చేసే ఈ లడ్డూకు స్వాంతంత్య్రం రాకపూర్వం నుంచే ఎంతో ఖ్యాతి వహించింది.
-
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఎన్టీఆర్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కంచికచర్లలో చోటుచేసుకుంది. లారీ విడిభాగాల దుకాణం, లారీలు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన దేవిరెడ్డి నాగరాజు(38) గురువారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నీటిలో నాగరాజు మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
-
క్రికెట్ టోర్నీ విజేతగా చిట్టిపాలెం సీఎస్‌కే
కృష్ణా: పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో చిట్టిపాలెం సీఎస్‌కే జట్టు విజేతగా నిలిచింది. చివరి రోజు చిట్టిపాలెం సీఎస్‌కే, డీటీపాలెం సోల్జియర్స్ పోటీపడగా.. చిట్టిపాలెం సీఎస్‌కే విజయం సాధించింది. విజేత, రన్నరప్ జట్లకు మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ చిరువెళ జయేశ్ బహుమతులు అందజేశారు.
-
ఫాథర్ మరియ సాగర్‌కు ఘనంగా వీడ్కోలు
కృష్ణా: పెద పారిపూడి మండలం వెంట్రప్రగడ విచారణ గురువు ఫాథర్ మరియ సాగర్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్యారిష్ పరిధిలోని 12గ్రామాల సంఘ పెద్దలు, విశ్వాసులు ఆయనకు శుక్రవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. పాథర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. మూడేళ్లపాటు సంఘాల్లో దేవుని పరిచర్యను, దేవాలయ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సడన్‌గా ట్రాన్స్‌ఫర్ అవడాన్ని యువత జీర్ణించుకోలేపోయింది.
-
ఉప్పులేటి దేవీ ప్రసాద్‌కు ఘనంగా సత్కారం
ఎన్టీఆర్: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) రాష్ట్ర అధ్యక్షులు మాజీ IRS ఆఫీసర్ ఉప్పులేటి దేవీ ప్రసాద్‌ను టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేవీప్రసాద్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.
-
యువత వాటికి దూరంగా ఉండాలి: దేవినేని
ఎన్టీఆర్: గుంటుపల్లిలో చెరుకూరి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిత జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. 62జట్లు పాల్గొనగా, అమ్మా క్యారెట్స్ (పోరంకి) విజేతగా, గుంటుపల్లి యూత్ సీసీ రన్నర్‌గా నిలిచాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్రోఫీలు అందజేశారు. యువత చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండి క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని దేవినేని అన్నారు.
-
ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్
- నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి
- విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కేసు సుఖాంతం
- దోనబండ వద్ద లారీ భీభత్సం.. తృటిలో తప్పిన ప్రమాదం
- మసులా బీచ్ ఫెస్టివల్‌లో హెలీ రైడ్స్ ప్రారంభం
-
ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ ఆటోను కారు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.