Locations: Krishna

  • వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కేసు సుఖాంతం

    ఎన్టీఆర్: విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. నిన్న సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు నిర్బంధంలో ఉంచిన కిడ్నాపర్లు, పోలీసుల జోక్యం, మీడియా కథనాలతో శ్రీనివాస్‌ను విజయవాడలో విడిచిపెట్టారు. ఆలపాటి రాజా అనుచరులు స్థల వివాదంపై సంతకాలు తీసుకున్నారు. 2009 నుంచి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. శ్రీనివాస్ ప్రాణభయంతో పోలీసు రక్షణ కోరుతున్నారు.

  • పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాము

    కృష్ణా: గుడ్లవల్లేరు మండలం విన్నకోటని పోల్‌రాజ్ మేజర్ డ్రైన్‌లో రూ.20లక్షలతో పూడికతీత పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము స్వయంగా ప్రోక్లెన్ నడుపుతూ కాలువలో పూడిక తొలగించారు. డ్రైనేజీలకు 15ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో, భారీ వర్షాలు వరదలు వచ్చిన సమయంలో ఎంతో నష్టపోయామని రైతులు ఎమ్మెల్యే రాము వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

  • జగన్‌ను కలిసేందుకు బయలుదేరిన వైసీపీ నాయకులు

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు జగన్‌ను కలిసేందుకు బయలుదేరారు. ఇటీవల కాలంలో నియోజకవర్గ సమన్వయ కర్త తన్నీరు నాగేశ్వరరావు తీరును వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను కలిసి అతనిపై అసంతృప్తి వెల్లడించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు.

     

  • 2వ రోజు ప్రారంభమైన ‘మసులా బీచ్ ఫెస్టివల్’

    కృష్ణా: మచిలీపట్నంలో 2వ రోజు మసులా బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు 17రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలను బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 3రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

     

  • మానవత్వం చాటుకున్న రామినేని రాజా

    ఎన్టీఆర్: మనిషిగా ఒకడు మానవత్వం మరిచి వృద్ధురాలిని వదిలేస్తే, సాటి మనిషిగా మరొకరు వృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. నక్కరెడ్డిపల్లికి చెందిన ఎలిగుంట సత్యవతి(75)ని బంధువులు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో వదిలేశారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆవృద్ధురాలిని టీడీపీ మండల అధ్యక్షులు రామినేని రాజా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించి సొంత ఊరికి పంపే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు.

     

  • లారీ భీభత్సం.. తృటిలో తప్పిన ప్రమాదం

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం దోనబండ వద్ద లారీ భీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి ఆలయ ఆర్చిని, అనంతరం కరెంటు స్థంభాన్ని ఢీకొట్టింది. ఆర్చి ద్వారం స్వల్పంగా ధ్వంసం కాగా కరెంట్ స్థంభం విరిగి పండింది. ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుసకున్నారు.

  • మృతదేహాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణానికి చెందిన దేవిరెడ్డి నాగరాజు ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకొని మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు నందిగామ మార్చురీలో మృతదేహన్ని సందర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

     

  • ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్

    • ‘మిస్ తెలుగు అమెరికా’ పోటీల్లో విజేతగా పెడన యువతి నిహారిక
    • ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌‌గా గుంటూరు వాసి సూర్యదేవర మహేంద్రదేవ్
    • పెనుగంచిప్రోలు(మం) తోటచర్ల గ్రామ శివారులో కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
    • విజయవాడలో భార్యను బెదిరించబోయి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడి భర్త మృతి

  • గేదేలను ఢీకొన్న లారీ

    ఎన్టీఆర్: తిరువూరు మండలం లక్ష్మీపురం ఇబ్రహీంపట్నం-జగదల్పూర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ లారీ గేదెలను ఢీకొన్నఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు పాడి గేదెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

     

  • వ్యాపారికి కరెంట్ ‘షాక్’.. ఏకంగా రూ.26వేలు

    ఎన్టీఆర్: విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లో విద్యుత్ వినియోగదారునికి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. నాగరాజు అనే పిండి మర వ్యాపారికి నెలకు విద్యుత్ ఛార్జీ రూ.26వేలు రావడంతో బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినెల రూ.7వేలు మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించే వాడినని తెలిపారు. విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు.